Andhra Pradesh

News June 5, 2024

నారా లోకేశ్‌ను కలిసిన తిరుపతి ఎమ్మెల్యే

image

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అమరావతిలో కలిశారు. మంగళగిరి నుంచి భారీ మెజారిటీతో గెలిచిన లోకేశ్‌ను ఆరణి శ్రీనివాసులు దుశ్శాలువతో సత్కరించారు. తిరుపతి నుంచి ఘన విజయం సాధించిన ఆరణి శ్రీనివాసులును లోకేశ్ అభినందించారు. తిరుపతి అభివృద్ధికి అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని నారా లోకేశ్ ఆరణి శ్రీనివాసులుకు భరోసా ఇచ్చారు.

News June 5, 2024

పాలకొల్లు: ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మృతి

image

పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గంటా ప్రభాకర్ (61)విధి నిర్వహణలో గుండెపోటుకు గురై మృతి చెందారు. బుధవారం ఆయన ఆసుపత్రిలో గుండె పోటు రాగా హుటాహుటిన పాలకొల్లు న్యూలైఫ్ హాస్పిటల్‌కి తరలించారు. వైద్య సేవలందిస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్, వైద్యులు, సిబ్బంది తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

News June 5, 2024

కృష్ణా జిల్లాలో కృష్ణప్రసాద్‌లు ఇద్దరూ కొట్టేశారు..

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం, పెడనలో టీడీపీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన వసంత కృష్ణప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్‌లిద్దరూ గెలుపొందారు. వీరి తండ్రులు వసంత నాగేశ్వరరావు, కాగిత వెంకట్రావులు సైతం గతంలో టీడీపీ నుంచి గెలిచారు. తాజా ఎన్నికల్లో కాగిత పెడనలో 38,123 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాముపై, వసంత మైలవరంలో 42,829 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిపై గెలిచారు.

News June 5, 2024

నెల్లూరు జిల్లాలో అత్యల్ప, అత్యధిక మెజార్టీలు వీరికే

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 10 స్థానాల్లో గెలిచింది. వీరిలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణకు (72,489) అత్యధిక మెజార్టీ ఓట్లు లభిస్తే.. ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (7,576) అత్యల్ప మెజార్టీ ఓట్లతో గెలిచారు. ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణకు ఇది తొలి విజయం.

News June 5, 2024

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్ ఢిల్లీ రావు

image

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ కలెక్టరేట్లో గుడ్డ, నారతో చేసిన పర్యావరణహిత సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని అరికట్టాలన్నారు. గుడ్డ, నారతో చేసిన సంచులనే వాడాలన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహిత జీవన శైలి అలవర్చుకోవాలన్నారు.

News June 5, 2024

కమలాపురం:  చికిత్స పొందుతూ ఫీల్డ్ అసిస్టెంట్ మృతి 

image

కమలాపురం మండలం పెద్దచెప్పలిలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఆది భాస్కర్ (52) మృతి చెందినట్లు ఏపీవో సారధి తెలిపారు. ఏపీవో వివరాల మేరకు..  అనారోగ్యంతో కడప హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ భాస్కర్ బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

News June 5, 2024

తిరుపతి : MED ఫలితాలు విడుదల

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మార్చి నెలలో ఎంఈడీ( MEd) మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు బుధవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News June 5, 2024

అనంత: ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

image

అనంతపురం జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ అభ్యర్థుల వైపు మొగ్గు చూపారు. 7 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు అధిక శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థులకు 15058 ఓట్లు, వైసీపీ అభ్యర్థులకు 7598 ఓట్లు వచ్చాయి. అందులో అధికంగా అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్‌కు 4272, రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు 2406 వచ్చాయి.

News June 5, 2024

విశాఖ: తండ్రి ప్రతీకారాన్నీ తీర్చుకున్న తనయుడు

image

గాజువాకలో గుడివాడ అమర్నాథ్‌పై గెలిచి పల్లా శ్రీనివాసరావు రాజకీయ ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. 1989లో గుడివాడ గురునాథరావు, పల్లా సింహాచలంపై 13,903 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే 35 ఏళ్ల తర్వాత వారి వారసులు గాజువాకలో పోటీపడ్డారు. పల్లా శ్రీనివాసరావు తన తండ్రి ఓటమికి ప్రతీకారంగా అమర్నాథ్‌పై 95,235 ఓట్ల మెజార్టీతో విజయకేతనాన్ని ఎగురవేశారు.

News June 5, 2024

కౌంటింగ్ సమయంలో గుడ్డుపై ఈకలు పీకారా: MS రాజు

image

మడకశిరలో ఈవీఎంలు మార్చారనే వ్యాఖ్యలపై మడకశిర తాజా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్పందించారు. కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కోడి గుడ్డుపై ఈకలు పీకారా అంటూ వైసీపీపై ఎంఎస్ రాజు ధ్వజమెత్తారు. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లు అక్కడే ఉన్నారన్నారు. వైసీపీ పార్టీ ఏజెంట్లు ఇతర అధికారులు ఉండగా ఈవీఎం ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ఈవీఎంలు ఎక్కడా మార్చలేదని స్పష్టం చేశారు.