India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉలవపాడు మండలం తెట్టు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ట్రాక్ సిబ్బంది గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆకుపచ్చ రంగు చీర ధరించినట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్, ఆయన భార్య రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ సోమవారం పలాసలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 11 సంవత్సరాలుగా పార్టీకి విధేయుడుగా సేవలందించినా గడిచిన కొంతకాలంగా జరిగిన అవమానాలను తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కృష్ణా వర్సిటీ పరిధిలోని బీపీఈడీ/డీపీఈడీ విద్యార్థులకు 4వ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 25,26, 27, 29 తేదీల్లో నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ పరీక్షలు జరుగుతాయని, సబ్జెక్టువారీగా పరీక్షల షెడ్యూల్ కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా అనంతపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ మహిళా నాయకురాలు బుల్లె శివబాల నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన నారా లోకేశ్, అచ్చెన్నాయుడికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నందికొట్కూరులో ఇవాళ సాయంత్రం 4 గంటలకు పర్యటించనున్నారు. ‘స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్ర’ పేరుతో ఆయన రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా టీడీపీ అభ్యర్థి గిత్త జయసూర్య, పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపు కోసం నందికొట్కూరులో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అనంతరం కర్నూలులో పర్యటిస్తారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో పలు అనుమానాలను సీబీఐ నివృత్తి చేయాలని నిందితుడు శంకర్ రెడ్డి కుమారుడు డా.చైతన్య రెడ్డి డిమాండ్ చేశారు. కడపలో ఆయన ఈ కేసులో ఉన్న అనుమానాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. హత్య చేశానన్న దస్తగిరిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. అతను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేయడం సరికాదన్నారు. అసలైన నిందితులని అరెస్టు చేయాలన్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఇచ్చిన చివరి అవకాశం నేటితో ముగియనుంది. ప్రకాశం జిల్లాలోని 18 సంవత్సరాల నిండిన యువతీ, యువకుల్లో ఓటర్ కార్డు లేని వారు ఆన్లైన్లో ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. ఈ అవకాశం కోల్పోతే మళ్లీ 5 సంవత్సరాల వరకు ఆగాల్సిందేనన్నారు.
పలువురు టీడీపీ ముఖ్య నాయకులకు అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. పెదకూరపాడు కొమ్మాలపాటి శ్రీధర్‌ను నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా, సత్తెనపల్లి-కోడెల శివరామకృష్ణను రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గుంటూరు వెస్ట్-తాడిశెట్టి మురళీమోహన్, నరసరావుపేట- నల్లపాటి రాములను కార్యనిర్వాహక కార్యదర్శులుగా, మాచర్ల-కళ్ళం రామాంజిరెడ్డి, పంగులూరు అంజయ్యను పార్టీ కార్యదర్శులుగా నియమించారు.
ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాక ముందే రాజకీయ పార్టీల ప్రచారం తారస్థాయికి చేరింది. ప్రధానంగా నెల్లూరు జిల్లా కేంద్రంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో పాటు సోషల్ మీడియాను సైతం పూర్తిగా వాడేస్తున్నారు. ప్రధానంగా ఫోన్ కాల్స్‌తో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వేర్వేరు నంబర్ల నుంచి ఎడతెగకుండా వస్తున్న ఫోన్ కాల్స్‌తో జనం విసుగెత్తిపోతున్నారు.
రూరల్ మండలంలోని పార్నాసలో అక్క ఇంజినీరింగ్, చెల్లెలు ఇంటర్మీడియట్‌లో తప్పడంతో ఇద్దరూ సోమవారం పురుగు మందు తాగారు. చెల్లే చికిత్స పొందుతూ మృతిచెందగా.. అక్క బయటపడింది. ఎస్సై లక్ష్మీనరసింహమూర్తి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Sorry, no posts matched your criteria.