Andhra Pradesh

News April 15, 2024

టికెట్ వార్..? అక్కడ పోటీచేసేదెవరు..?

image

ప.గో. జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీ టికెట్‌పై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. అక్కడి నుంచి సిట్టింగ్ MLA మంతెన పోటీచేస్తారా..? లేక ఎంపీ రఘురామకృష్ణ బరిలో ఉంటారా అన్నది తెలియరావడం లేదు. ఇదిలా ఉండగా ఈ నెల 22న నామినేషన్ వేస్తానని RRR ప్రకటించారు. కానీ ఏ స్థానం నుంచి వేస్తారో చెప్పలేదు. మరోవైపు ఆకివీడులో రామరాజు ప్రచారం కొనసాగిస్తున్నారు.
– ఇంతకీ ఉండి టికెట్ ఎవరికి దక్కుతుంది..? మీ కామెంట్..?

News April 15, 2024

ప్రకాశం: రేపు బాస్కెట్ బాల్ జిల్లా ఎంపిక

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ జూనియర్‌ బాలబాలికల జట్ల ఎంపిక ఈనెల 16న కందుకూరులోని టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు సోమినేని సురేష్‌ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎంపిక ప్రారంభమవుతుందన్నారు. 2006 జూన్‌ 1వ తేదీ తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలన్నారు.

News April 15, 2024

గుంటూరు: రైలు ప్రమాదంలో మహిళ మృతి

image

గద్వాల పాత హౌసింగ్ బోర్డ్ సమీపంలో నిన్న జరిగిన <<13050560>>రైలు ప్రమాదం<<>>లో మృతి చెందిన మహిళ గుంటూరు జిల్లా మంతెనవారి పాలెం వేముల ప్రియాంకగా గుర్తించారు. ఉద్యోగరీత్యా భర్త జితేంద్రతో కలిసి జడ్చర్లలో ఉంటున్నారు. ఇటీవల భర్త తిరుపతికి వెళ్లగా ఆమె వారి బంధువులను చూసేందుకు గుంటూరు వెళ్లింది. తిరిగి జడ్చర్లకు వస్తుండగా గద్వాల వద్ద రైలు నుంచి కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

News April 15, 2024

తర్లుపాడు: ద్విచక్ర వాహనం అదుపుతప్పి.. ఒకరి మృతి

image

తర్లుపాడు మండలం గొల్లపల్లి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మార్కాపురం మండలం మిట్టమీదపల్లికు చెందిన వెంకటేశ్వరరెడ్డి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

News April 15, 2024

కర్నూలు: గుండెపోటుతో మహిళ మృతి

image

క్రిష్ణగిరి మండలం అమకతాడు గ్రామ పంచాయతీ మాదాపురంలో మాదిగ జమ్మక్క గుండెపోటుతో మృతి చెందారు. ఆమె భర్త గిడ్డన్న తెలిపిన వివరాల మేరకు.. నిన్న రాత్రి నిద్రపోవడానికి ముందు ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పిందని, ఉదయం పలకరించినా మాట్లాడకపోవడంతో దగ్గరకు వెళ్లి చూడగా మృతిచెంది ఉందని తెలిపారు. జమ్మక్కకు నలుగురు కూతుర్లు ఉన్నారు.

News April 15, 2024

కడప: రైలులో ప్రయాణిస్తూ మహిళ మృతి

image

పెండ్లిమర్రి మండలం, సంత కొవ్వూరు చెందిన మంటింటి లక్ష్మీదేవి (36) రైలులో ప్రయాణిస్తూ మృతి చెందినట్లు మంచిర్యాల జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను తెలంగాణలోని బెల్లంపల్లి మండలం సోమగూడెం కల్వరి చర్చికి తీసుకొచ్చారు. ప్రార్థనల్లో పాల్గొన్న లక్ష్మీదేవి తిరిగి రైలులో వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పేర్కొన్నారు.

News April 15, 2024

ఏలూరు: విదేశాలకు మన జిల్లా మామిడి ఎగుమతి

image

ప్రస్తుత సీజన్‌లో నూజివీడు మామిడిని కెనడా, అమెరికా దేశాలకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏలూరు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రామ్మోహన్‌ తెలిపారు. నూజివీడు మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మామిడి రైతు ఎం.బీ.వీ రాఘవరావు, మామిడి తోటను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ నెల 16వ తేదీన 1.2 టన్నుల మామిడి పండ్లను కెనడాకు, ఈ నెల 25న అమెరికాకు ఎగుమతి చేయనున్నట్టు తెలిపారు.

News April 15, 2024

CTR: ఛార్జింగ్ పెడుతుండగా షాక్.. వ్యక్తి మృతి

image

చిత్తూరు జిల్లా శ్రీరంగరాజుపురం(SRపురం) మండలంలో విషాదం నెలకొంది. మండల కేంద్రానికి చెందిన హిమాచల మందడి తన గానుగ షెడ్ వద్దకు వెళ్లాడు. అక్కడ సెలఫోనుకు ఛార్జింగ్ పెట్టడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలో కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ కుళ్లాయప్ప కేసు నమోదు చేశారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News April 15, 2024

నెల్లూరు వద్ద ముగ్గురు శ్రీకాకుళం వాసుల మృతి

image

నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా వాసులు ముగ్గురు చనిపోయారు. టెక్కలికి చెందిన రామయ్య(44), జలుమూరు(M) నగిరికటకానికి తవిటయ్య(60), సిమ్మయ్య(42) నెల్లూరుకు వలస వెళ్లారు. ముగ్గురూ కలిసి బైకుపై ఆ జిల్లాలోని పొదలకూరుకు పనికి వెళ్లారు. తిరిగొస్తుండగా కొత్తూరు పోలీసు ఫైరింగ్ ఆఫీసు వద్ద వీరి బైక్‌ను మరో బైక్ ఢీకొట్టింది. రామయ్య స్పాట్‌లో చనిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో కన్నుమూశారు.

News April 15, 2024

గుంటూరు: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

image

గుంటూరు నల్లకుంటకు చెందిన తొనుగుంటల సాయి రాజేశ్ (25) చిలకలూరిపేట సమీపంలోని ఓ కళాశాలలో 2022లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత బెంగళూరు వెళ్లి ఉద్యోగ ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో 6 నెలల కిందట ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఈ నెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు లాల్‌పురం పొలాల వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.