India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నిన్న విడుదల కాగా.. రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. కానీ కాంగ్రెస్ తరుఫున చీరాల నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు రాష్ట్రంలో అత్యధికంగా 41,295 ఓట్లు పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులకు ఎవరికి కూడా ఇన్ని ఓట్లు పడలేదు. ఆమంచి ఓట్లను చీల్చడం వల్ల వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేశ్ ఓటమి చవిచూశారు.

ఎన్నికల విధుల్లో పోలీసు సహా అందరి కృషి అభినందనీయమని కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ అభినందించారు. జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించిన పోలీసు అధికారుల సేవలు ఎనలేనివని ప్రశంసించారు. బుధవారం పోలీస్ ఆడిటోరియంలో విధులు నిర్వహించిన కేంద్ర, రాష్ట్ర పోలీసు సిబ్బందికి, మీడియాకు, అధికారులకు అభినందన సభ నిర్వహించారు.

మొదలియార్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి బుల్లెట్ సురేశ్ రాజీనామా చేశారు. చిత్తూరుకు చెందిన ఆయన మొదటి రెండేళ్లు ఆ పదవిలో ఉన్నారు. ఇటీవల మరోసారి ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. నిన్న టీడీపీ గెలవడంతో రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీకి పంపించారు. నూతన ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో పలువురు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 7 స్థానాల్లో కూటమి, 3 స్థానాల్లో వైసీపీ గెలిచింది. వీరిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (61687) అత్యధిక మెజార్టీ ఓట్లు లభిస్తే.. రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి(2495) అత్యల్ప మెజార్టీ ఓట్లతో గెలిచారు. జగన్‌కు ఇది హ్యాట్రిక్ విజయం కాగా.. మండిపల్లికి ఇది మొదటి గెలుపు.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన MLAలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు విజయం సాధించిన వారందరినీ అభినందించారు.

నరసరావుపేట లోక్ సభ ఎన్నికలలో ఈసారి నెల్లూరు సెంటిమెంట్ పనిచేయలేదు. 1999, 2004లో నెల్లూరుకు చెందిన నేదురమల్లి జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి నరసరావుపేట నుంచి ఎంపీలుగా గెలిచారు. అదే సెంటిమెంట్‌తో నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్‌ను వైసీపీ అభ్యర్థిగా రంగంలోనికి దించింది. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న కృష్ణ దేవరాయలు ఈ దఫా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మరోసారి విజయం సాధించారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక నేత TDP నేతగా బీసీ జనార్దన్ రెడ్డి పేరొందారు. 2014-19 వరకు అప్పటి TDP ప్రభుత్వంలో ఆయన తొలిసారి బనగానపల్లె MLAగా గెలుపొందారు. 2019లో ఓటమిని చవిచూసిన ఆయన.. 2024లో అదే స్థానం నుంచి మరోసారి MLAగా గెలిచారు. దీంతో ఈసారి CM చంద్రబాబు కేబినెట్‌లో బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని TDP శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకొని దోర్నాల మండలం రామచంద్రకోట గ్రామంలో టీడీపీ కార్యకర్త దర్శనం దేవయ్య బుధవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కష్టపడి పనిచేసిన ఎరిక్షన్ బాబు ఓటమిని దేవయ్య జీర్ణించుకోలేక పోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. దేవయ్యకు పలువురు టీడీపీ నాయకులు నివాళులు అర్పించారు.

ఉమ్మడి ప.గో.లోని 15 స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి నలుగురు పోటీచేయగా అందరూ ఓడిపోయారు.
☛ అసెంబ్లీ స్థానం
✦ పోలవరంలో వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి
✦ గోపాలపురంలో వైసీపీ అభ్యర్థి తానేటి వనిత ఓడిపోయారు.
☛ పార్లమెంట్
✦ ఏలూరులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె.లావణ్య 20826ఓట్లతో 3వ స్థానానికి పరిమితమయ్యారు.
✦నరసాపురంలో వైసీపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల 4,30,541 ఓట్లతో 2వ స్థానంలో నిలిచింది.

శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీస్ శాఖ సిబ్బంది సమిష్టిగా పనిచేయడం వల్ల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయడం హర్షనీయమన్నారు.
Sorry, no posts matched your criteria.