Andhra Pradesh

News June 5, 2024

నంద్యాల: బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి?

image

ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక నేత TDP నేతగా బీసీ జనార్దన్ రెడ్డి పేరొందారు. 2014-19 వరకు అప్పటి TDP ప్రభుత్వంలో ఆయన తొలిసారి బనగానపల్లె MLAగా గెలుపొందారు. 2019లో ఓటమిని చవిచూసిన ఆయన.. 2024లో అదే స్థానం నుంచి మరోసారి MLAగా గెలిచారు. దీంతో ఈసారి CM చంద్రబాబు కేబినెట్‌లో బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని TDP శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

News June 5, 2024

ప్రకాశం: టీడీపీ ఓటమి.. కార్యకర్తకు గుండెపోటు

image

యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకొని దోర్నాల మండలం రామచంద్రకోట గ్రామంలో టీడీపీ కార్యకర్త దర్శనం దేవయ్య బుధవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కష్టపడి పనిచేసిన ఎరిక్షన్ బాబు ఓటమిని దేవయ్య జీర్ణించుకోలేక పోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. దేవయ్యకు పలువురు టీడీపీ నాయకులు నివాళులు అర్పించారు.

News June 5, 2024

ప.గో.: మహిళలకు దక్కని అధికారం

image

ఉమ్మడి ప.గో.లోని 15 స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి నలుగురు పోటీచేయగా అందరూ ఓడిపోయారు.
☛ అసెంబ్లీ స్థానం
✦ పోలవరంలో వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి
✦ గోపాలపురంలో వైసీపీ అభ్యర్థి తానేటి వనిత ఓడిపోయారు.
☛ పార్లమెంట్
✦ ఏలూరులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె.లావణ్య 20826ఓట్లతో 3వ స్థానానికి పరిమితమయ్యారు.
✦నరసాపురంలో వైసీపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల 4,30,541 ఓట్లతో 2వ స్థానంలో నిలిచింది.

News June 5, 2024

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది: ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీస్ శాఖ సిబ్బంది సమిష్టిగా పనిచేయడం వల్ల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయడం హర్షనీయమన్నారు.

News June 5, 2024

సిరిపురం జంక్షన్‌లో స్టాపర్లు తొలగించాలని నిరసన

image

విశాఖ సిరిపురం టైక్వాన్ జంక్షన్ వద్ద మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణాలకు అనుకూలంగా స్టాప్‌బోర్డులను ఏర్పాటు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. వారే స్వయంగా వీటిని తొలగించడానికి ప్రయత్నించారు. ఈలోపు అక్కడకు పోలీసులు చేరుకున్నారు. కాగా..సిరిపురం నుంచి రేసపువానిపాలెం వైపు వెళ్లే మార్గానికి మధ్యలో స్టాపర్లను గతంలో ఏర్పాటు చేశారు.

News June 5, 2024

పామర్రు: నాడు తండ్రిని ఓడించారు.. నేడు కొడుకును గెలిపించారు

image

2009లో ఏర్పడ్డ పామర్రు నియోజకవర్గంలో 2024లో తొలిసారి టీడీపీ గెలిచింది. గత 3 ఎన్నికల్లో ఇక్కడ ఓడిన టీడీపీకి తాజా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా తొలి విజయాన్ని అందించారు. 2014లో పామర్రులో టీడీపీ తరపున పోటీ చేసిన వర్ల కుమార్ రాజా తండ్రి రామయ్య 1,069 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాడు రామయ్యను ఓడించిన పామర్రు ఓటర్లు.. నేడు అతని కుమారుడు కుమార్ రాజాను 29,690 ఓట్ల మెజారిటీతో గెలిపించారు.

News June 5, 2024

శ్రీ సత్యసాయి: వ్యక్తి మృతదేహం లభ్యం

image

మడకశిర మండల పరిధిలోని గుర్రప్పకొండ గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం సగం కాల్చినట్టు గుర్తించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 5, 2024

కడప: ఎమ్మెల్యేగా ఎవరు ఎన్నిసార్లు గెలిచారు

image

కడప జిల్లాలో ఎవరు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారంటే..
* అరవ శ్రీధర్: మొదటి సారి
* పుత్తా చైతన్య రెడ్డి: మొదటి సారి
* రెడ్డప్పగారి మాధవిరెడ్డి: మొదటి సారి
* మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి: మొదటి సారి
* పుట్టాసుధాకర్ యాదవ్: మొదటి సారి
* దాసరి సుధ: రెండోసారి
* వైఎస్ జగన్: మూడోసారి
* ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి: మూడోసారి
* ఆదినారాయణ రెడ్డి: నాలుగోసారి
* నంద్యాల వరదరాజుల రెడ్డి: ఆరోసారి

News June 5, 2024

తూ.గో: నలుగురు మహిళామణుల విజయకేతనం

image

ఉమ్మడి తూ.గో జిల్లా నుంచి నలుగురు మహిళామణులు విజయకేతం ఎగురవేశారు. వీరిలో ముగ్గురు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనుండగా.. ఒకరు పార్లమెంట్‌లో గళం వినిపించనున్నారు.
➠ పార్లమెంట్ స్థానం
☞ రాజమండ్రి- పురందీశ్వరి(BJP) (మెజార్టీ-2,39,139)
➠ అసెంబ్లీ స్థానాలు
☞ ప్రత్తిపాడు- వరుపుల సత్యప్రభ(TDP) (38,768+)
☞ తుని- యనమల దివ్య(TDP) (15,177 +)
☞ రంపచోడవరం-శిరీషాదేవి(TDP) (9,139+)

News June 5, 2024

ప.గో.: ఎక్కువసార్లు అసెంబ్లీకి వెళ్లింది వీరే

image

ఉమ్మడి ప.గో. జిల్లా ఆచంట మాజీ MLA పితాని సత్యనారాయణ ప్రస్తుత విజయంతో 4వ సారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అలాగే తాజా విజయంతో వరుసగా 3 సార్లు గెలిచిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈసారి హ్యాట్రిక్ సాధించారు. తరువాతి వరుసలో దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, భీమవరం నుంచి పులపర్తి అంజిబాబు 3వ సారి అసెంబ్లీకి వెళ్తున్నారు.