India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి 17191
ప్రొద్దుటూరు – నంద్యాల వరద రాజుల రెడ్డి 22744
కమలాపురం – పుత్తా చైతన్య రెడ్డి 25357
బద్వేల్ – దాసరి సుధ 18567
పులివెందుల- వైఎస్ జగన్ 61687
మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్ 20950
కడప – మాధవి రెడ్డి 18860
రాయచోటి- మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి 2495
రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 7016
రైల్వే కోడూరు- అరవ శ్రీధర్ 11101

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు హవా చూపించారు. అన్నిచోట్ల స్పష్టమైన మెజారిటీతో ఘన విజయం సాధించి జిల్లాను క్లీన్ స్వీప్ చేశారు. ఇదే క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో చరిత్ర తిరగరాశారు. ప్రత్తిపాడు, జగ్గంపేట, కొత్తపేట నియోజకవర్గాల్లో 1999లో గెలిచిన TDP ఆపై ఎప్పుడూ గెలవలేదు. దాదాపు 25 ఏళ్ల తర్వాత తాజాగా టీడీపీ పాగా వేసింది.

సాలూరు నియోజకవర్గం తొలి మహిళా ఎమ్మెల్యేగా గుమ్మిడి సంధ్యారాణి రికార్డు సాధించారు. పీడిక రాజన్నదొరపై 13,733 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. సాలూరులో 1952 నుంచి పురుషులే ఎమ్మెల్యేగా పనిచేశారు. తొలిసారిగా మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే సాలూరు నుంచి ఎమ్మెల్సీగా పని చేసిన తొలి వ్యక్తి సంధ్యారాణి కావడం గమనార్హం. ఎమ్మెల్సీగా పని చేసిన అనంతరం ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవులపై సర్వత్ర ఉత్కంఠ నెలపొంది. జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, మండలి బుద్ధప్రసాద్ మంత్రి పదవులు రేసులో ఉన్నారు. జిల్లా నుంచి గెలుపొందిన వారిలో వీరిద్దరు సీనియర్లు కావటంతోపాటు సామాజిక వర్గ సమీకరణాలు కూడా వీరికి కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. బీసీ సామాజిక వర్గం నుంచి రవీంద్రకు, పొత్తు ధర్మంలో భాగంగా జనసేన నుంచి గెలుపొందిన బుద్ధప్రసాద్‌కు మంత్రి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో గత 2019 ఎన్నికల్లో 13 చోట్ల వైసీపీ గెలుపొందగా.. 2 చోట్ల టీడీపీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో చింతలపూడిలో సిట్టింగ్ MLA ఎలీజాను కాదని కంభం విజయరాజుకు టికెట్ ఇచ్చింది. ఇక పోలవరంలోనూ తెల్లం బాలరాజుకు బదులు ఆయన సతీమణి రాజ్యలక్ష్మి పోటీలో నిలిచారు. గెలుపే లక్ష్యంగా ఆయా చోట్ల టికెట్లు మార్చినప్పటికీ ప్లాన్ ఫెయిల్ అయిందని పలువురు చర్చించుకుంటున్నారు.

అరకు పార్లమెంట్ స్థానంలో వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందిన గుమ్మ తనూజ రాణి రిటర్నింగ్ అధికారి నిషాంత్ కుమార్ నుంచి మంగళవారం రాత్రి ధ్రువపత్రాన్ని అందుకున్నారు. బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై 50,580 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన అరకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానన్నారు.

‘ధర్మవరంలో కేతిరెడ్డిపై గెలవడమంటే అంత ఈజీ కాదు’ ఇది ఎన్నికల వరకు జరిగిన చర్చ. ఫలితం తర్వాత కేతిరెడ్డి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కేవలం 40 రోజుల్లోనే.. ఈ నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన సత్యకుమార్ యాదవ్ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. కూటమి, స్థానిక నేతలతో సమన్వయం, అమిత్ షా వంటి జాతీయ నేతల అండతో సంచలన విజయం సాధించారు.

ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన గుడివాడ అమర్నాథ్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు భారీ ఓటమి చవిచూశారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన తొలి రెండు స్థానాల్లో ఓడిన అభ్యర్థులు వీరే కావడం గమనార్హం. గాజువాకలో అమర్నాథ్‌పై పల్లా శ్రీనివాస్‌రావు 95,235 ఓట్ల మెజారిటీతో గెలిపొందగా, అవంతిపై గంటా శ్రీనివాస్ రావు 92,401 ఓట్ల తేడాతో గెలిపొందారు.

పెదకూరపాడులో టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన తన మామ, సమీప ప్రత్యర్థి నంబూరు శంకర్రావుపై గెలిచారు. కాగా, మార్చి 15న నియోజకవర్గ అభ్యర్థిగా చంద్రబాబు ప్రవీణ్‌ను ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన 60 రోజుల్లోనే ప్రజల మనసు గెలుచుకున్నారు. సీనియర్ నేత, టికెట్ ఆశించి భంగపడిన కొమ్మాలపాటి శ్రీధర్ సహకారం ఈయనకు కలిసొచ్చింది. పల్నాడులో తొలిసారి గెలిచిన వారిలో భాష్యం ప్రవీణ్ ఒకరు.

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ సిట్టింగ్ MLA కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేసి డిపాజిట్ కోల్పోయారు. ఆయనకు కేవలం 1,526 ఓట్లు మాత్రమే వచ్చాయి. నోటాకు 1,751 ఓట్లు వచ్చాయి. దాని కన్నా తక్కువ ఓట్లు చిట్టిబాబుకు రావటం గమనార్హం. 2014లో పి.గన్నవరం నుంచి YCP అభ్యర్థిగా చిట్టిబాబు పోటీచేసి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు.
Sorry, no posts matched your criteria.