India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శుభలేఖలు పంచడానికి వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన నరసాపురం మండలంలో జరిగింది. వివరాలు.. నరసాపురం శ్రీహరిపేటకు చెందిన మురపాక సంతోష్‌కుమార్ (37) తన అన్న కుమారుడి వివాహం సందర్భంగా బంధువులకు శుభలేఖలు పంచేందుకు ఆదివారం బైక్‌పై జగన్నాథపురం బయలుదేరాడు. పాలకొల్లు సమీపంలోని పెంకుళ్లపాడు టిడ్కో గృహాల సముదాయం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మరణించాడు.
టీడీపీ కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డిని నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు నియమించినట్లు తెలిపారు. కాగా తిక్కారెడ్డి మంత్రాలయం టికెట్ ఆశించి భంగపడిన విషయం తెలిసిందే. టికెట్ దక్కని వారికి ఈ అవకాశాలు కల్పించారు.
పాయకరావుపేటలో టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కాపు సంఘం నాయకుడు ఆకుల షణ్ముఖరావును చంద్రబాబుకు పరిచయం చేసి టీడీపీలో చేర్పించారు. ఈ మేరకు షణ్ముఖరావుకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఇడుపులపాయ IIITలో చదువుతున్న కంభం మండలం జంగంగుంట్ల గ్రామానికి చెందిన విద్యార్థి హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారంరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుర్రి పుల్లయ్య కూతురు కుర్రి రేఖ (21) మెకానికల్ ఇంజినీరింగ్ 4వ సంవత్సరం చదువుతోంది. ఈ విషయం కాలేజీ యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటాహుటిన ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
నాతవరం మండలంలోని చిక్కిడిపాలెంలో మన నేస్తం పేరిట 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన జరగనుంది. కార్యక్రమానికి సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని నిర్వాహకులు కేఎస్ఆర్ శర్మ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు చెప్పారు.
ఎల్.కోట మండలంలో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజు అనే యువకుడు శనివారం రాత్రి 8 గంటల సమయంలో, చెల్లితో ఆడుకుంటున్న 8ఏళ్ల బాలికను బలవంతంగా తన ఇంటి మేడ మీదకి తీసుకువెళ్లాడు. దీంతో బాలిక చెల్లి తన తల్లీదండ్రులకి చెప్పింది. వారు చుట్టుప్రక్కల వారి సహాయంతో మేడ మీదకు వెళ్లారు. బలవంతంగా తలుపులు తెరవడంతో రాజు అర్ధనగ్నంగా, బాలిక ఏడుస్తూ కనిపించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
భీమవరంలో మంగళవారం నిర్వహించనున్న ‘మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. భీమవరంలోని స్థానిక బైపాస్ రోడ్డులోని మెంటేవారితోట ప్రాంతంలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహిరంగ సభ అనంతరం సీఎం జగన్ రోడ్డుషో ద్వారా తూర్పుగోదావరి జిల్లాకు పయనమవుతారన్నారు.
పాత గుంటూరులో ఆదివారం ఘోర ఘటన చోటుచేసుకుంది. పాతగుంటూరు పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరు యాదవుల బజారుకు చెందిన దూళ్ళ ప్రభాకర్ (40) స్నేహితుడు పోగుల రాంబాబు వద్ద రూ.100 అప్పుగా తీసుకున్నాడు. గత నెల 31న తనవద్ద అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయాలని ప్రభాకర్‌ను రాంబాబు అడిగాడు. ఈ విషయంలో గొడవ పెద్దదై రాంబాబు పక్కనే ఉన్న ఇనుపరాడ్డుతో ప్రభాకర్ తలపై కొట్టాడంతో తలలో రక్తం గడ్డకట్టి చనిపోయాడు.
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈనెల నేడు, రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు వెల్లడించారు. నేడు కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ ఆటో స్టాండ్ నుంచి ర్యాలీ ప్రారంభమై కొండారెడ్డి బురుజు వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. రాత్రికి కర్నూలులోనే బస చేసి, 16న ఎమ్మిగనూరులో సాయంత్రం 4 గంటలకు, కోసిగిలో సాయంత్రం 6 గంటలకు ప్రసంగిస్తారని వివరించారు.
విజయనగరం జిల్లాలో టీడీపీ MLA సీటు దక్కని నేతకు పార్టీలో కీలక పదవి లభించింది. S.కోట నియోజకవర్గానికి చెందిన గొంప కృష్ణ ఎమ్మెల్యే సీటు ఆశించారు. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి టికెట్ ఇచ్చారు. దీంతో కృష్ణ రెబల్‌గా పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఈక్రమంలో ఆయన్ను టీడీపీ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. ఇప్పటి వరకు ఆయన రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు.
Sorry, no posts matched your criteria.