India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ ఎంపీగా ఐదు లక్షలకు పైగా మెజార్టీతో గెలిచిన శ్రీభరత్‌ను చంద్రబాబుతో పాటు బాలకృష్ణ అభినందించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో శ్రీభరత్ సతీమణితో చంద్రబాబును, బాలకృష్ణుడు మర్యాదపూర్వకంగా కలిశారు. అత్యధిక మెజార్టీ సాధించిన శ్రీభరత్‌కు చంద్రబాబు, బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

ప.గో. జిల్లాలోని మొత్తం 15 స్థానాల్లో గెలిచిన MLAలలో 9మంది తొలిసారే కావడం విశేషం. అందులో ఐదుగురు జనసేన కాగా.. నలుగురు టీడీపీ.
☛ నిడదవోలు- కందుల దుర్గేశ్
☛ నరసాపురం- బొమ్మిడి నాయకర్
☛ తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్
☛ ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు
☛ పోలవరం – చిర్రి బాలరాజు
☛ గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు
☛ ఉండి – RRR
☛ ఏలూరు – బడేటి రాధాకృష్ణ
☛ చింతలపూడి – సొంగా రోషన్
➤ SHARE IT

2024 సార్వత్రిక ఎన్నికల్లో పుట్టా ఇంట మరపురాని ఘటన చోటుచేసుకుంది. ఒకేసారి తండ్రి ఎమ్మెల్యేగా, తనయుడు ఎంపీగా విజయం సాధించారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్టా కుమారుడు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ టీడీపీ తరఫున పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ పైన భారీ మెజార్టీతో విజయం సాధించారు. తండ్రి తనయులు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఒకేసారి గెలిచారు.

విశాఖ సీతకొండ దగ్గర YSR వ్యూ పాయింట్ పేరును అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌గా గుర్తు తెలియని వ్యక్తులు మార్చారు. జీ-20 సమయంలో విశాఖ నగరాన్ని సుందరీకరించి సీతకొండ దగ్గర వ్యూ పాయింట్‌ను వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌గా నామకరణ చేసి ఇక్కడ నేమ్ బోర్డు సైతం పెట్టారు. తాజాగా వైఎస్సార్ అక్షరాలపై అబ్దుల్ కలాం స్టిక్కర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అతికించినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిది సీట్లను ఎన్డీఏ కూటమి సొంతం చేసుకుంది. వీటిలో 8 సీట్లను టీడీపీ గెలవగా పొత్తులో భాగంగా నెల్లిమర్ల నుంచి జనసేన గెలుపొందింది. అయితే తొమ్మిది మందిలో కోళ్ల లలిత కుమారి, కిమిడి కళా వెంకట్రావు మినహా మిగిలిన ఏడుగురు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. వీరిలో బేబినాయన, తోయక జగదీశ్వరి, కొండపల్లి శ్రీనివాస్, విజయచంద్ర తొలిసారి బరిలో నిలిచి విజయం సాధించారు.

కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఘన విజయం నమోదు చేశారు. మరోవైపు అక్కడ గెలిచిన తొలి ఎమ్మెల్యే రికార్డును తన బుట్టలో వేసుకున్నారు. ఇప్పటి వరకు అక్కడ 14 సార్లు సాధారణ, ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ఓ ఏ ఒక్క మహిళకూ ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచే అవకాశం రాలేదు. ఈసారి టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రశాంతి రెడ్డి 54, 583 ఓట్లతో వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించారు.

వరుసగా రెండుసార్లు గెలిచిన చెవిరెడ్డికి ఈసారి ఫలితాలు నిర్ఘాంతపోయేలా చేశాయి. వైసీపీకి కంచుకోటగా ఉన్న స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఆయనతో పాటు కుమారుడు మోహిత్ రెడ్డి ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్నారు. చంద్రగిరిలో మోహిత్ రెడ్డి పులివర్తి నానిపై 43,852 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. అటు ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి టీడీపీ అభ్యర్థి మాగుంట చేతిలో 48,911 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.

పర్చూరు నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులకంటే నోటాకు అధికంగా ఓట్లు లభించడం విశేషం. నియోజకవర్గంలో 15 మంది పోటీ చేయగా కేవలం ముగ్గురు మాత్రం 5 వేల కంటే అధికంగా ఓట్లు సాధించారు. నోటాకు 1289 ఓట్లు లభించాయి. మిగిలిన 12 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువగా ఓట్లు పోల్ అవ్వడం గమనార్హం. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు మాత్రమే 5000 కంటే అధికంగా ఓట్లు వచ్చాయి.

కాకినాడ ఎంపీగా జనసేన నుంచి తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ భారీ మెజారిటితో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన వెంటనే కాకినాడ జేఎన్టీయూలో మంగళవారం జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ జే.నివాస్ ఆయన ధ్రువీకరణ అందజేశారు.

కడప ఎంపీగా ఎన్నికైన వైయస్ అవినాష్ రెడ్డికి ఎన్నికల అధికారులు డిక్లరేషన్ అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి షర్మిల, కూటమి అభ్యర్థి భూమేష్ రెడ్డి మీద భారీ మెజారిటీతో అవినాష్ రెడ్డి గెలుపొందారు. వరుసగా మూడోసారి వైఎస్ అవినాష్ రెడ్డి కడప పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు అవినాష్ రెడ్డికి డిక్లరేషన్ పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.