Andhra Pradesh

News April 15, 2024

ప.గో.లో 2 రోజులు సీఎం.. పర్యటన ఇలా..

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం (నేడు) భీమడోలు మండలం గుండుగొలను వద్ద రాత్రి 7 గంటలకు రోడ్డు షో మొదలు పెడతారని ఎమ్మెల్యే వాసు బాబు తెలిపారు. అనంతరం భీమడోలు, పూళ్ల, కైకరం మీదగా నారాయణపురం చేరుకొని రాత్రి అక్కడ బస చేస్తారన్నారు. అనంతరం మంగళవారం నారాయణపురం, నిడమర్రు, భువనపల్లి, గణపవరం సరిపల్లె మీదుగా భీమవరం చేరుకుంటారన్నారు.

News April 15, 2024

నరసన్నపేట: పెయింటర్ అనుమానాస్పద మృతి

image

నరసన్నపేటలోని ఒక పెయింటర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నరసన్నపేట పట్టణంలో పెయింటర్‌గా పనిచేస్తున్న గండి సోమేశ్వరరావు కుటుంబ కలహాలు కారణంగా ఈనెల 11వ తేదీన విశాఖపట్నం వెళుతున్నట్లుగా కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఆదివారం సాయంత్రం అతని మృతదేహం కనిపించింది. మండలంలోని సత్యవరం వద్ద మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై అశోక్ బాబు తెలిపారు.

News April 15, 2024

విజయవాడ: పోలీసుల అదుపులో అనుమానితులు.?

image

విజయవాడలో సీఎం జగన్‌పై దాడిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈక్రమంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎయిర్ గన్లు తదితర వస్తువులను వాడే వాళ్ల గురించి ఆధారలు సేకరిస్తున్నట్లు సమాచారం. గత 15 రోజులుగా గంగానమ్మ గుడి పరిధిలోని కాల్స్ వివరాలు సేకరిస్తున్నారు. మొత్తంగా ఆరు బృందాలతో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.

News April 15, 2024

CTR: వీడియోలతో బ్లాక్‌మెయిల్

image

చిత్తూరు(D) గంగవరం మండలానికి చెందిన యువతి B.tech సెకండ్ ఇయర్ చదువుతోంది. బైరెడ్డిపల్లెకు చెందిన అజయ్ తన స్నేహితుడి ద్వారా ఆమెతో వాట్సాప్‌ చేశాడు. ఆ చాట్ విషయాలు బయటపెడతానని బెదిరించి అమ్మాయిని ముళబాగల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ యువతితో కొన్ని వీడియోలు తీసుకున్నాడు. ఇటీవల అమ్మాయికి ఎంగేజ్‌మెంట్ కావడంతో వీడియోలను వారి బంధువులకు పంపాడు. యువతి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో పోలీసులు అజయ్‌ను అరెస్ట్ చేశారు.

News April 15, 2024

కడప జిల్లా నుంచి TDPలో నలుగురికి కీలక పదవులు

image

ఉమ్మడి కడప జిల్లాలోని నలుగురు టీడీపీ నేతలకు పార్టీలో కీలక పదవులు దక్కాయి. రైల్వే కోడూరుకు చెందిన విశ్వనాధ నాయుడిని పార్టీ రాష్ర్ట కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. కడపకు చెందిన సూదా దుర్గా ప్రసాద్, పొన్నూరు రాం ప్రసాద్ రెడ్డి, రాజంపేటకు చెందిన ఇడమడకల కుమార్‌లను రాష్ర్ట కార్యదర్శులుగా పార్టీ నియమించింది. చంద్రబాబు ఆదేశాల మేరకు.. ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు అచెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు.

News April 15, 2024

ప.గో.: శుభలేఖలు పంచడానికి వెళ్తూ మృతి

image

శుభలేఖలు పంచడానికి వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన నరసాపురం మండలంలో జరిగింది. వివరాలు.. నరసాపురం శ్రీహరిపేటకు చెందిన మురపాక సంతోష్‌కుమార్‌ (37) తన అన్న కుమారుడి వివాహం సందర్భంగా బంధువులకు శుభలేఖలు పంచేందుకు ఆదివారం బైక్‌పై జగన్నాథపురం బయలుదేరాడు. పాలకొల్లు సమీపంలోని పెంకుళ్లపాడు టిడ్కో గృహాల సముదాయం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మరణించాడు.

News April 15, 2024

కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా పాలకుర్తి తిక్కారెడ్డి

image

టీడీపీ కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డిని నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు నియమించినట్లు తెలిపారు. కాగా తిక్కారెడ్డి మంత్రాలయం టికెట్ ఆశించి భంగపడిన విషయం తెలిసిందే. టికెట్ దక్కని వారికి ఈ అవకాశాలు కల్పించారు.

News April 15, 2024

తూ.గో.: టీడీపీలో చేరిన రాష్ట్ర నాయకుడు

image

పాయకరావుపేటలో టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కాపు సంఘం నాయకుడు ఆకుల షణ్ముఖరావును చంద్రబాబుకు పరిచయం చేసి టీడీపీలో చేర్పించారు. ఈ మేరకు షణ్ముఖరావుకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

News April 15, 2024

కంభం:  IIITలో విద్యార్థి ఆత్మహత్య

image

ఇడుపులపాయ IIITలో చదువుతున్న కంభం మండలం జంగంగుంట్ల గ్రామానికి చెందిన విద్యార్థి హాస్టల్‌ బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారంరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుర్రి పుల్లయ్య కూతురు కుర్రి రేఖ (21) మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 4వ సంవత్సరం చదువుతోంది. ఈ విషయం కాలేజీ యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటాహుటిన ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

News April 15, 2024

50 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన నేడు

image

నాతవరం మండలంలోని చిక్కిడిపాలెంలో మన నేస్తం పేరిట 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన జరగనుంది. కార్యక్రమానికి సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని నిర్వాహకులు కేఎస్ఆర్ శర్మ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు చెప్పారు.