Andhra Pradesh

News June 5, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో గెలుపు గుర్రాలు వీరే..

image

⁍సాలూరు: గుమ్మడి సంధ్యారాణి (TDP)
⁍బొబ్బిలి: బేబినాయన (TDP)
⁍పార్వతీపురం: బోనెల విజయచంద్ర (TDP)
⁍కురుపాం: తోయక జగదీశ్వరి (TDP)
⁍చీపురుపల్లి: కళా వెంకట్రావు (TDP)
⁍గజపతినగరం: కొండపల్లి శ్రీనివాస్ (TDP)
⁍ఎస్.కోట: కోళ్ల లలిత కుమారి (TDP)
⁍విజయనగరం: అదితి గజపతిరాజు (TDP)
⁍నెల్లిమర్ల: లోకం మాధవి (JSP)

News June 5, 2024

ఎమ్మెల్యేగా ఆదాలకు తొలి ఓటమి .

image

శాసనసభ ఎన్నికల బరిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి తొలిసారి ఓటమిపాలయ్యారు. 1999 ఎన్నికల్లో అల్లూరు ఎమ్మెల్యేగా, 2004, 2009 ఎన్నికల్లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆదాల 2019లో గెలిచి లోక్ సభలో అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసిన ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో ఓడారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇదే ఆయనకు తొలి ఓటమి.

News June 5, 2024

ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్న అఖిలప్రియ

image

ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా విజయం సాధించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఎన్నిక పత్రాన్ని కౌంటింగ్ అధికారులచే అందుకున్నారు. వైసీపీ అభ్యర్థి గంగుల నానిపై అఖిల ప్రియ 12037 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఎన్నికల అధికారులు ఆమెకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. తమ్ముడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, భర్త భార్గవ రాయుడు, ఇతర కుటుంబ సభ్యులు టీడీపీ నాయకులతో కలిసి ఆమె ఎన్నికైన పత్రాన్ని అందుకున్నారు.

News June 5, 2024

చంద్రబాబు విజయంపై డిక్లరేషన్ ఫారం అందుకున్న టీడీపీ నేతలు

image

టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నుండి 47వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా బాబు విజయంపై టిడిపి నేతలు డిక్లరేషన్ ఫారం అందుకున్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టిడిపి కుప్పం ఇంచార్జ్ మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్, సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ డా. సురేష్ తదితరులు కుప్పం ఆర్వో శ్రీనివాసులు వద్ద డిక్లరేషన్ ఫారం అందుకున్నారు.

News June 4, 2024

అనకాపల్లిలో సీఎం రమేశ్ గెలుపు

image

అనకాపల్లి ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్ 2,96,530 పైచిలుకు మెజార్టీలో ఉన్నారు. సీఎం రమేశ్‌కు 7,62,069 ఓట్లు పోలవ్వగా.. తన సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుకి 4,65,539 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్తి వేగి వెంకటేశ్‌కు 25,651 ఓట్లు పోలవ్వగా.. నోటాకు 26,235 మంది ఓటేశారు.

News June 4, 2024

నంద్యాలలో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్

image

నంద్యాలలో ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి తెలిపారు. స్థానిక ఆర్జీఎం కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు చెప్పిన మేరకు ఏజెంట్లు తెల్లవారుజామున 6 గంటలకు చేరుకున్నారన్నారు. భారీ పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.

News June 4, 2024

VZM: ధ్రువపత్రం అందుకున్న కలిశెట్టి అప్పలనాయుడు

image

2024 విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకు జిల్లా ఎన్నికల అధికారి నాగమణి గెలుపు ధ్రువపత్రం అందించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌పై 2,29,216 ఓట్లు మెజార్టీతో విజయనగరం ఎంపీగా గెలిచారు. కలిశెట్టికి మొత్తం 7,18,294 ఓట్లు పడ్డాయి.

News June 4, 2024

2లక్షల 46వేల మెజారిటీతో వేమిరెడ్డి విజయం

image

నెల్లూరు పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2,45,902 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ నుంచి పోటీచేసిన విజయసాయిరెడ్డికి 5,20,300 ఓట్లు రాగా.. వేమిరెడ్డికి 7,66,202 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

ధ్రువీకరణ పత్రం అందుకున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు

image

శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ ఎంపీ‌గా గెలుపొందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఆయన వెంట కింజరాపు అచ్చెన్నాయుడు, గొండు శంకర్, కుటుంబ సభ్యులు, నాయకులు, అభిమానులు ఉన్నారు.

News June 4, 2024

విశాఖ ఎంపీగా శ్రీభరత్

image

విశాఖ ఎంపీగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ 5,04,247 ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. శ్రీభరత్‌కి 9,07,467 ఓట్లు పోలవ్వగా.. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి 4,03,220 ఓట్లు మాత్రమే లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి పి.సత్యారెడ్డి 30,267 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.