Andhra Pradesh

News June 4, 2024

ధ్రువీకరణ పత్రం అందుకున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు

image

శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ ఎంపీ‌గా గెలుపొందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఆయన వెంట కింజరాపు అచ్చెన్నాయుడు, గొండు శంకర్, కుటుంబ సభ్యులు, నాయకులు, అభిమానులు ఉన్నారు.

News June 4, 2024

విశాఖ ఎంపీగా శ్రీభరత్

image

విశాఖ ఎంపీగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ 5,04,247 ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. శ్రీభరత్‌కి 9,07,467 ఓట్లు పోలవ్వగా.. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి 4,03,220 ఓట్లు మాత్రమే లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి పి.సత్యారెడ్డి 30,267 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

News June 4, 2024

ఆలూరులో సీటు వైసీపీ ఖాతాలోకి..!

image

ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి బీ.విరుపాక్షి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్‌పై 2,831 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2వ రౌండ్, 9, 13, 14, 18, 19, 20, 21, 22 రౌండ్లు మినహా మిగిలిన రౌండ్లలో విరుపాక్షి ఆధిక్యం కనబర్చారు. విరుపాక్షికి మొత్తం 1,00,264 ఓట్లు పోలవ్వగా.. వీరభద్ర గౌడ్‌కు 97,433 ఓట్లు పడ్డాయి. ఈ విజయంతో ఆలూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

News June 4, 2024

విశాఖలో 5లక్షలు దాటిన శ్రీభరత్ మెజార్టీ

image

విశాఖ ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.శ్రీభరత్ 5,04,247 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. భరత్‌కి 9,07,467 ఓట్లు లభించాయి. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి కేవలం 4,03,220 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీగా నిలవనుంది. కూటమి అభ్యర్థిగా నిలిచిన శ్రీభరత్‌కు భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారు.

News June 4, 2024

3,42,121 ఓట్ల మెజార్టీతో హరీశ్ మాధుర్ గెలుపు

image

కోనసీమ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. అమలాపురం పార్లమెంట్‌కి 28 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేశారు. అమలాపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి గంటి హరీశ్ మాధుర్ 3,42,121 మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌కు మొత్తం 4,54,458 ఓట్లు రాగా.. హరీష్ మాధుర్‌కి 7,96,579 ఓట్లు వచ్చాయి. 3,42,121 మెజార్టీతో హరీశ్ ఘన విజయం సాధించారు.

News June 4, 2024

దర్శిలో బూచేపల్లి విజయం

image

దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై విజయం సాధించారు. 21 రౌండ్లు పూర్తయ్యే సరికి 2597 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. దీంతో జిల్లాలో టీడీపీకి 10 స్థానాలు, వైసీపీ రెండు స్థానాలు గెలిచాయి.

News June 4, 2024

విశాఖపట్నంలో అభ్యర్థుల కంటే నోటా ఓట్లే అధికం

image

విశాఖ పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థుల కంటే నోటాకు అధికంగా ఓట్లు లభించడం విశేషం. విశాఖపట్నంలో 33 మంది పోటీ చేయగా కేవలం ఐదుగురు మాత్రం 5 వేల కంటే అధికంగా ఓట్లు సాధించారు. నోటాకు 5171 ఓట్లు లభించాయి. మిగిలిన 28 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువగా ఓట్లు పోలవరం గమనార్హం. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, ప్రజాశాంతి పార్టీ, బీఎస్పీ అభ్యర్థులకు మాత్రమే 5000 కంటే అధికంగా ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

చిత్తూరు జిల్లాలో విజేతలు వీళ్లే

image

➤కుప్పం:చంద్రబాబు ➤పలమనేరు: అమరనాథ రెడ్డి
➤పూతలపట్టు: మురళీ ➤చిత్తూరు: జగన్మోహన్
➤GDనెల్లూరు: థామస్ ➤నగరి: గాలి భానుప్రకాశ్
➤సత్యవేడు: ఆదిమూలం ➤శ్రీకాళహస్తి: బొజ్జల
➤తిరుపతి: శ్రీనివాసులు ➤చంద్రగిరి: పులివర్తి నాని
➤పీలేరు: నల్లారి కిశోర్ ➤పుంగనూరు: పెద్దిరెడ్డి
➤మదనపల్లె:షాజహాన్➤తంబళ్లపల్లె:ద్వారకనాథరెడ్డి
NOTE: పుంగనూరు, తంబళ్లపల్లోనే వైసీపీ గెలిచింది.

News June 4, 2024

శ్రీకాకుళం జిల్లాలో గెలుపు గుర్రాలు వీరే..

image

⁍ఎచ్చెర్ల: నడుకుదిటి ఈశ్వరరావు (బీజేపీ)
⁍పలాస: గౌతు శిరీష (టీడీపీ)
⁍పాతపట్నం: మామిడి గోవిందరావు (టీడీపీ)
⁍ఆమదాలవలస: కూన రవికుమార్ (టీడీపీ)
⁍నరసన్నపేట: బగ్గు రమణమూర్తి (టీడీపీ)
⁍శ్రీకాకుళం: గొండు శంకర్ (టీడీపీ)
⁍టెక్కలి: కింజరాపు అచ్చెన్నాయుడు (టీడీపీ)
⁍రాజాం: కోండ్రు మురళీ మోహన్ (టీడీపీ)
⁍పాలకొండ నిమ్మక జయకృష్ణ (జనసేన)
⁍ఇచ్ఛాపురం, బెందాళం అశోక్ (టీడీపీ)

News June 4, 2024

శ్రీకాకుళం జిల్లాలో రేపు వర్షాలు పడే అవకాశం

image

బుధవారం శ్రీకాకుళం జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సైతం రేపు వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.