Andhra Pradesh

News December 20, 2025

పల్స్ పోలియోపై వైద్య ఆరోగ్యశాఖ అవగాహన ర్యాలీ

image

పోలియో కార్యక్రమంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో కార్యాలయం నుంచి గుప్తా పార్కు సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీని జిల్లా వైద్యశాఖ అధికారి సుజాత జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2,94,604 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు అందించనున్నామన్నారు. 21 నుంచి మూడు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

News December 20, 2025

రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

image

పామిడి పట్టణ శివారులో శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న వాహనాన్ని వెనుక వైపు నుంచి కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన విషయం విధితమే. ఘటనా స్థలాన్ని పామిడి ఇన్‌ఛార్జ్ సీఐ ప్రవీణ్ కుమార్‌తో కలిసి ఎస్పీ జగదీశ్ పరిశీలించారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

News December 20, 2025

విశాఖలో టెట్ పరీక్షకు 131 మంది గైర్హాజరు: డీఈవో

image

విశాఖలో శనివారం 17 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 2,018 మంది అభ్యర్థులకు గానూ 1,887 మంది అభ్యర్థులు హాజరుకాగా 131 మంది గైర్హాజరు అయ్యారని వెల్లడించారు. డీఈవో ప్రేమ్ కుమార్ రెండు పరీక్ష కేంద్రాలను, స్క్వాడ్ ఐదు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో పేర్కొన్నారు.

News December 20, 2025

చిత్తూరు: రేపు 2 లక్షల మందికి టీకాలు.!

image

ఈఏడాది జిల్లాలో 2,21,502 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఆదివారం నుంచి మూడు రోజులు ఈ ప్రోగ్రాం జరగనుంది. జిల్లా వ్యాప్తంగా 5,794 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు ఈ కేంద్రాల వద్ద, మిగిలిన రెండు రోజులు సిబ్బంది ఇంటింటికీ తిరిగి వేయనున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో మొబైల్ టీమ్స్ అందుబాటులో ఉండనున్నాయి. పేరంట్స్ చిన్నారులకు తప్పక టీకాలు వేయించాలి.

News December 20, 2025

స్వచ్ఛతలో పశ్చిమను ప్రథమ స్థానంలో నిలుపుదాం: RRR

image

పశ్చిమ గోదావరి జిల్లాను రాష్ట్రంలోనే మొట్టమొదటి స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు యువత, ప్రజలు నడుం బిగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పిలుపునిచ్చారు. శనివారం భీమవరంలో ‘పర్యావరణంలో అవకాశాలు’ అనే థీమ్‌తో నిర్వహించిన సదస్సులో ఆయన కలెక్టర్ నాగరాణితో కలిసి పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

News December 20, 2025

కర్నూలు: మిరప పంటలో గంజాయి సాగు

image

చిప్పగిరి మండలం దేగులపాడు గ్రామ పరిధిలో మిరప పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పొలాన్ని తనిఖీ చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 20, 2025

విశాఖ: ‘కాంగ్రెస్ అవినీతి విషవృక్షం’

image

కాంగ్రెస్ అవినీతి విషవృక్షాన్ని సముద్రంలో విసిరేసిన ఏపీ ప్రజలకు హ్యాట్సాఫ్ అని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. బీచ్ రోడ్‌లో మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణలో పాల్గొని మాట్లాడారు. వైజాగ్ వస్తే బీపీ, షుగర్ ఎగిరిపోతాయన్నారు. చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నాయకుడు అని, బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, MP, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు.

News December 20, 2025

స్వచ్ఛతలో పశ్చిమను ప్రథమ స్థానంలో నిలుపుదాం: RRR

image

పశ్చిమ గోదావరి జిల్లాను రాష్ట్రంలోనే మొట్టమొదటి స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు యువత, ప్రజలు నడుం బిగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పిలుపునిచ్చారు. శనివారం భీమవరంలో ‘పర్యావరణంలో అవకాశాలు’ అనే థీమ్‌తో నిర్వహించిన సదస్సులో ఆయన కలెక్టర్ నాగరాణితో కలిసి పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

News December 20, 2025

అనంత: ఒకే పాఠశాల నుంచి 52 మంది విద్యార్థులు

image

అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 52 మంది విద్యార్థులు ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పీఈటీ సంజీవరాయుడు శిక్షణలో విద్యార్థులు ప్రతిభ చాటారని హెచ్‌ఎం రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయిలోనూ రాణించి పాఠశాలకు కీర్తి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించింది.

News December 20, 2025

నూతన ఆలోచనలతో అద్భుతాలు సృష్టించాలి: కలెక్టర్

image

నూతన ఆలోచనలతో విద్యార్థులు అద్భుతాలు సృష్టించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం కర్నూలు ప్రభుత్వ టౌన్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలను డీఈవో సుధాకర్, ఏపీసీ లోకరాజుతో కలిసి ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టి నమూనాలను రూపొందించాలన్నారు.