India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రకాశం జిల్లాలో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. దర్శిలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి వెనుకబడ్డారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 2,363 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. గొట్టిపాటి లక్ష్మికి 97,416 ఓట్లు రాగా, బూచేపల్లికి 99,779 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు 20 రౌండ్లు పూర్తవ్వగా, చివరి రౌండ్ లో ఎవరు ఆధిక్యంలోకి వస్తారనేది ఆసక్తిగా మారింది.

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కూటమి నుంచి బరిలో నిలిచిన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ భారీ విజయం సాధించారు. ఈ మేరకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా ఆయన ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు డా.కృష్ణ కాంత్ పాఠక్, ఎస్ఏ రామన్ పాల్గొన్నారు.

చిత్తూరు ఎంపీగా టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు ఘన విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి ఆయన ఆధిక్యం చూపారు. తన సమీప ప్రత్యర్థి ఎన్.రెడ్డప్ప మీద 1.80 లక్షల మెజార్టీతో గెలుపు దుందుభి మోగించారు. ఈక్రమంలో ఆయన జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ మీదుగా డిక్లరేషన్ ఫారం అందుకున్నారు.

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ ఘనవిజయం సాధించారు. నిర్ణీత రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి శివనాథ్ 2,82,085 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి కేశినేని నానిపై విజయం సాధించారు. టీడీపీ ఘనవిజయంతో ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ, జనసేన కూటమి శ్రేణులు ఫుల్ జోష్‌లో సంబరాలు చేసుకుంటున్నాయి.

కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్యపై 1,02,822 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచి ప్రతి రౌండ్‌లోనూ నాగరాజు ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

గుంటూరు టీడీపీ ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపొందారు. ఆయన తన ప్రత్యర్థి కిలారు వెంకట రోశయ్యపై 3,44,695 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయనకి 8,64,948 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 5,20,253 ఓట్లు వచ్చాయి. కాగా పెమ్మసాని అమెరికా నుంచి గుంటూరు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి తనదైన శైలిలో అందరినీ కలుపుకుంటూ వెళ్ళారు. గుంటూరు జిల్లాలో టీడీపీ జెండా ఎగరవేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

కింజరాపు కుటుంబం నుండి తాజా ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు నాయకులు గెలుపొందారు. దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ శ్రీకాకుళం ఎంపీ, సోదరుడు అచ్చెన్న టెక్కలి అసెంబ్లీ, అల్లుడు ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ నుంచి గెలిచారు. 2019లో సైతం అచ్చెన్న, రామ్మోహన్‌తో పాటు రామ్మోహన్ సోదరి ఆదిరెడ్డి భవాని రాజమండ్రి సిటీ నుండి టీడీపీ తరపున గెలిచారు.

విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున లోక్‌సభకు పోటీ చేసిన ఎం.శ్రీభరత్ 5 లక్షల భారీ మెజారిటీకి చేరువులో ఉన్నారు. ఇప్పటివరకు ఆయన 8,93,613 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ 3,97,555 ఓట్లు సాధించారు. దీనితో ప్రస్తుతం భరత్ మెజారిటీ 4,96,058కి చేరింది. మరి కొద్దిసేపట్లో ఐదు లక్షల మెజారిటీని శ్రీభరత్ చేరుకోనున్నారు.

ఉమ్మడి తూ.గో జిల్లాలోని 19 నియోజకవర్గాలనూ కూటమి ఉడ్చేసింది. టీడీపీ-13, జనసేన-5, బీజేపీ-1 స్థానంలో విజయకేతనం ఎగురవేశాయి. ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ కాకినాడ రూరల్ JSP అభ్యర్థి పంతం నానాజీ సాధించారు. పిఠాపురం నుంచి బరిలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు 70,279+ ఓట్ల మెజార్టీ రాగా.. నానాజీ 72,040+ ఓట్ల మెజార్టీతో పవన్ కంటే ముందంజలో ఉండటం గమనార్హం.
NOTE: మెజార్టీ కాస్త అటూ ఇటుగా మారొచ్చు.

తిరుపతి పార్లమెంట్ కౌంటింగ్ హోరాహోరీగా జరిగింది. తొలుత వైసీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి వెనుకబడ్డారు. తర్వాత ప్రతి రౌండ్‌లోనూ బీజేపీ వరప్రసాద్ వరప్రసాద్‌తో హోరాహోరీ తలపడ్డారు. చివరకు గురుమూర్తికి 6,32,228 ఓట్లు దక్కాయి. సమీప ప్రత్యర్థి వరప్రసాద్ రావు 6,17,659 ఓట్లు సాధించారు. ఈక్రమంలో గురుమూర్తి 14,569 ఓట్లతో గట్టెక్కారు. ఉప ఎన్నికలో ఆయన 2,30,572 ఓట్లతో గెలవడం విశేషం.
Sorry, no posts matched your criteria.