India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రానున్న ఎన్నికల్లో నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సమన్వయకర్తలను నియమించింది. అందులో భాగంగా కర్నూల్ పార్లమెంట్‌కు జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు, నంద్యాల నియోజకవర్గానికి ఏరాసు ప్రతాపరెడ్డి, కోడుమూరు, ఎమ్మిగనూరుకు సంజీవ్ కుమార్‌ను నియమించింది. ఆలూరు, పత్తికొండలకు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆళ్లగడ్డకు కేవీ సుబ్బారెడ్డిలు ఉన్నారు.
బి.కోడూరు మండలం తుమ్మలపల్లి గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై జయరాములు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. పోలీసు వాహనాన్ని పక్కకి ఆపి ఫోన్‌లో మాట్లాడుతున్న ఎస్సై వాహవాన్ని అటు వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సైకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఎస్సైను చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటకి చెందిన రాము విద్యుత్ షాక్‌తో ఆదివారం మృతి చెందాడు. కొండకర్ల ప్రైవేట్ రిసార్ట్‌లో పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌తో భవనం పైనుంచి కింద పడ్డాడు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రాముని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అధికారం కోసం చంద్రబాబు అనేక తప్పుడు ప్రచారాలు చేస్తూ, మాయమాటలు చెబుతున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇచ్చిన జగనన్నకు ఓటు వేయాలన్నారు.
నంద్యాల జిల్లాలో ఎక్కడైనా అల్లర్లు, గొడవలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏదైనా ప్రమాదంలో ఉంటే అత్యవసర పోలీసు సేవలు పొందాలనుకునే వారు వెంటనే 08514-225097 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పై నంబర్లో పోలీసు అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు.
బేస్తవారిపేట మండలంలో ఆదివారం అమానుష ఘటన చోటుచేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న బాలిక తన స్నేహితురాలు వద్దకు పుస్తకాల కోసం వెళ్లగా అక్కడే ఉన్న పిచ్చయ్య అనే ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లి వాపోయారు. బాలికను బలవంతంగా తన ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడని బాలిక తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తెలిపారు. ఆదివారం విజయనగరంలో ఆమె మాట్లాడుతూ.. అందరి ఆత్మ గౌరవం అనే నినాదంతో వెళ్తున్నట్లు చెప్పారు. పదవుల కోసం చూడకుండా పార్టీ మనుగడ కోసం పని చేస్తే 2O24లో కూడా తనకు అన్యాయం చేశారన్నారు. పార్టీ ప్రయోజనాల కోసం అన్ని అవమానాలు భరించానన్నారు.
తెనాలిలో చిన్న చిన్న అంగళ్లలోనూ గంజాయి ఎక్కువగా విస్తరించిందని తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. తెనాలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ తెనాలిలో అనేక హామీలు ఇచ్చారని కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హామీ ఇచ్చారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు ఈసారి ఎన్నికల్లో రెండు ఓట్లు(MLA, MP) వేయాల్సి ఉంటుంది. పొత్తులో భాగంగా తిరుపతి, రాజంపేట MP అభ్యర్థులుగా బీజేపీ నేతలు బరిలో ఉన్నారు. దీంతో శ్రీకాళహస్తి, సత్యవేడు, పుంగనూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లెలో ఒక ఈవీఎం(MLA)లో సైకిల్ గుర్తు, మరొక ఈవీఎం(MP)లో కమలం గుర్తు ఉంటుుంది. తిరుపతిలో జనసేన MLA అభ్యర్థి పోటీలో ఉండటంతో ఇక్కడ రెండు EVMలోనూ సైకిల్ గుర్తు కనపడదు.
ఓ మహిళ ఆర్టీసీ బస్సులోనే చనిపోయిన ఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి వద్ద ఆదివారం వెలుగు చూసింది. నెల్లూరు నుంచి కలువాయికి వెళ్తున్న బస్సులో ఓ మహిళ అస్వస్థతకు గురైంది. ప్రయాణికులు 108కు సమాచారం అందించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యానికి చేర్చారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.