India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం జగన్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ గోపాలపురం నియోజకవర్గం యర్నగూడెం గ్రామంలో వైసీపీ నాయకులు నిర్వహించిన నిరసన ర్యాలీలో మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఇది హేయమైన చర్య అని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు గన్నమని వెంకటేశ్వరరావు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో రోడ్లు వేయలేని పాలకుల అసమర్థతను నిరసిస్తూ ఆ గ్రామస్థులు రానున్న ఎన్నికలను బహిష్కరించారు. పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఫ్లెక్సీని గ్రామంలో అంటించి తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. సీఎస్ పురం మండలంలోని దర్శిగుంట్ల పంచాయతీ పరిధిలోని బొంతవారిపల్లిలో గ్రామస్థుల ఆవేదన చర్చనీయాంశమైంది.
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన దాడి హేయమైన చర్యని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలో ఆదివారం సీఆర్సీలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందడం చూసి ఓర్వలేక ఇటువంటి దాడులు చేస్తున్నారన్నారు. దాడి నేపథ్యంలో ఈ నెల 18న రావులపాలెంలో జరగనున్న సిద్ధం సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
నెల్లూరు జిల్లాకు చెందిన వేలాది మంది ఓటర్లు పొరుగు రాష్ట్రాల్లో ఉపాధి నిమిత్తం ఉన్నారు. ఒక్క ఉదయగిరికి సంబంధించే సుమారు 35 వేల మంది ఓటర్లు హైదరాబాద్, నల్గొండ, పూనే, ముంబయి, బెంగళూరు, చెన్నైలో ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలో వలస ఓటర్లపై అన్నిపార్టీల నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. టీడీపీ నేతలు ఇప్పటికే హైదరాబాద్ మియాపూర్, బీఎన్ రెడ్డి నగర్లలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి తమకు మద్దతు పలకాలని కోరారు.
ఖాజీపేట మండలం ఆంజనేయపురం వద్ద ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కారు బ్రిడ్జిని ఢీకొన్నట్లుగా స్థానికులు తెలిపారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కలిశారు. మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిసి తన విజయానికి సహాయం అందించాల్సిందిగా అభ్యర్థించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 68 శాతం మంది ఫెయిల్ అయ్యారు. 2,581 మంది పరీక్షలు రాయగా 806(32 శాతం) మందే పాసయ్యారు. ఇందులో అబ్బాయిలు 272 మంది, అమ్మాయిలు 534 మంది ఉన్నారు. రెండో సంవత్సరంలో 2240 మందికి 1083 మందే పాసయ్యారు. ఇందులో అబ్బాయిలు 456, అమ్మాయిలు 627 మంది ఉన్నారు. ఓవరాల్గా ఇంటర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది.
బూర్జ మండలం పెద్దపేట పంచాయతీ బొమ్మిక గ్రామంలో సవర చంద్రయ్య(48) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానిక ఎస్సై జీవీ ప్రసాద్ ఆదివారం తెలిపారు. చంద్రయ్య భార్య ఎస్.పున్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. చంద్రయ్య మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాకి నియమించిన ఎన్నికల పరిశీలకులకు అవసరమైన వసతి, రవాణా ఇతర సదుపాయాలు సక్రమంగా ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శివ శంకర్ సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఆదివారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నుండి రిటర్నింగ్ అధికారులు, ఏఈఆర్ఓలు తదితరులతో వెబెక్స్ ద్వారా మీటింగ్ నిర్వహించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిన్న జరిగిన దాడిని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఖండించారు. ప్రతిపక్షాలు చేసిన పిరికిపంద చర్యగా అభివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగడం హేయమైన చర్య అన్నారు. చేతకానితనంతో చేసే దాష్టీక చర్యగా పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.