India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పిఠాపురం-పవన్, అనపర్తి-నల్లమిల్లి, రాజమండ్రి సిటీ-ఆదిరెడ్డి, రాజమండ్రి రూరల్-గోరంట్ల, రాజానగరం-బత్తుల, ప్రత్తిపాడు-సత్యప్రభ, పెద్దాపురం-చినరాజప్ప, తుని-దివ్య, రాజోలు-దేవవరప్రసాద్, జగ్గంపేట-జ్యోతుల, రంపచోడవరం-శిరీషాదేవి, కాకినాడ సిటీ-కొండబాబు, కొత్తపేట-బండారు, కాకినాడ రూరల్-నానాజీ, అమలాపురం-ఆనందబాబు, పి.గన్నవరం-గిడ్డి, మండపేట-వేగుళ్ల, ముమ్మిడివరం-దాట్ల సుబ్బరాజు, రామచంద్రపురం-వాసంశెట్టి సుభాశ్.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10 స్థానాల్లో ఫలితాలు తేలాయి. ఇక మిగిలింది దర్శి, అద్దంకి స్థానాలే. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ 22 వేల పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి అయిన హనిమిరెడ్డి ఓటమి పాలయ్యారు. దీంతో జిల్లాలో టీడీపీ మరో స్థానాన్ని కైవసం చేసుకుంది.

సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గల్లా మాధవి విజయకేతనం ఎగురవేశారు. వైసీపీ అభ్యర్థి, మంత్రి విడుదల రజనీపై 49722 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తొలిసారిగా రాజకీయంలోకి వచ్చిన గల్లా మాధవి చివరి క్షణంలో అనూహ్యంగా ఎమ్మెల్యే సీటు పొందారు. ఏకంగా ఒక మంత్రిపై గెలుపొంది సంచలనం సృష్టించారు. దీంతో టీడీపీ శ్రేణులు గుంటూరులో సంబరాలు చేసుకున్నాయి.

గన్నవరం నియోజకవర్గ ఫలితం అభ్యర్థుల మధ్య దోబూచులాడుతోంది. మొదట్లో వల్లభనేని ముందంజలో ఉండగా.. చివర్లో యార్లగడ్డ వెంకట్రావు ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. 22 రౌండ్లు ముగిసేసరికి 36564 ఓట్ల మెజార్టీతో కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ముందంజలో ఉన్నారు. మరో రౌండ్ ఫలితం రావాల్సి ఉంది.

<<13379807>>అనంత<<>>: దగ్గుపాటి ప్రసాద్ > రాప్తాడు: సునీత
ధర్మవరం: సత్యకుమార్(BJP) > పెనుకొండ :సవిత
హిందూపురం: బాలకృష్ణ > మడకశిర: ఎంఎస్ రాజు
పుట్టపర్తి: పల్లె సింధూర > కదిరి: కందికుంట
ఉరవకొండ: పయ్యావుల > కళ్యాణదుర్గం: సురేంద్రబాబు
గుంతకల్లు: గుమ్మనూరు > శింగనమల: బండారు శ్రావణి
తాడిపత్రి: అస్మిత్ > రాయదుర్గం: కాల్వ

కూటమి సునామీలో వైసిపి కొట్టుకుపోయిందని భీమిలి కూటమి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎంవీపీ కాలనీలోని గంటా నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో 151 సీట్లతో అధికారం పొందిన వైసీపీ 2024లో తక్కువ స్థానాలకు పరిమితం అయిందన్నారు. కూటమి అభ్యర్థులపై ప్రజల విశ్వాసం ఉంచారని అన్నారు.

రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందీశ్వరి ఘన విజయం సాధించారు. 7 నియోజకవర్గాల్లో కలిపి కూటమికి మొత్తం 7,26,515 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్‌కు 4,87,376 ఓట్లు పోలయ్యాయి. దాదాపు 2,39,139 ఓట్ల మెజార్టీతో పురందీశ్వరి గెలుపొందారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. గెలుపు వీరులు వీరే.. ఎచ్చెర్ల నడుకుదిటి ఈశ్వరరావు, పలాస గౌతు శిరీష, పాతపట్నం- మామిడి గోవిందరావు, ఆమదాలవలస -కూన రవికుమార్, నరసన్నపేట -బగ్గు రమణమూర్తి, శ్రీకాకుళం- గొండు శంకర్, టెక్కలి – కింజరాపు అచ్చెన్నాయుడు, పాలకొండ -నిమ్మక జయకృష్ణ, ఇచ్ఛాపురం, బెందాళం అశోక్ గెలుపొందారు.

నారా లోకేశ్ 85,140 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 22 రౌండ్లకు గానూ, 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పటి వరకు లోకేశ్‌కు 155462 ఓట్లు, వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యకు 70322 ఓట్లు వచ్చాయి. నారా లోకేశ్ గెలుపు ఖాయమైందని ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

నరసాపురం పార్లమెంట్ ఎంపీగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు పశ్చిమగోదావరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ MPగా ధ్రువీకరణ పత్రాన్ని ఆయనకు అందజేశారు. కాగా ప్రత్యర్థి పార్టీ వైసీపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాలపై 2,76,802 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
Sorry, no posts matched your criteria.