Andhra Pradesh

News June 4, 2024

MPగా ధ్రువీకరణ పత్రం అందుకున్న శ్రీనివాస్ వర్మ 

image

నరసాపురం పార్లమెంట్ ఎంపీగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు పశ్చిమగోదావరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ MPగా ధ్రువీకరణ పత్రాన్ని ఆయనకు అందజేశారు. కాగా ప్రత్యర్థి పార్టీ వైసీపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాలపై 2,76,802 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

News June 4, 2024

చీరాల గడ్డపై టీడీపీ జెండా

image

ప్రకాశం జిల్లాలోని మరో నియోజవర్గంలో టీడీపీ గెలిచింది. తాజాగా చీరాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎం.మాలకొండయ్య సమీప ప్రత్యర్థి కరణం వెంకటేశ్, 20,558 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ మరో స్థానాన్ని గెలిచింది. కాగా వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేశ్ కు 50,802 ఓట్లు రాగా, ఆమంచి కృష్ణమోహన్ కు41,295 ఓట్లు వచ్చాయి. మాలకొండయ్యకు 71,360 ఓట్లు నమోదయ్యాయి.

News June 4, 2024

రాయచోటి ఫలితంపై ఉత్కంఠ

image

రాయచోటి నియోజకవర్గ ఫలితం అభ్యర్థుల మధ్య దోబూచులాడుతోంది. మొదట్లో గడికోట ముందంజలో ఉండగా.. చివర్లో అనూహ్యంగా మండిపల్లి ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. 20 రౌండ్లు ముగిసేసరికి 871 ఓట్ల మెజార్టీతో కూటమి అభ్యర్థి మండిపల్లి ముందంజలో ఉన్నారు. మరో రౌండ్ ఫలితం లెక్కించాల్సి ఉంది.

News June 4, 2024

TTD ఛైర్మన్ పదవికి భూమన రాజీనామా

image

వైసీపీ ఘోర ఓటమితో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వెంటనే తన రిజైన్ ఆమోదించాలని కోరారు. ఈ మేరకు ఆయన టీటీడీ ఈవోకు లేఖ రాశారు. వైవీ సుబ్బారెడ్డి తర్వాత గత ఆగస్టు నెలలలో ఆయన ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

News June 4, 2024

మరపురాని గెలుపును సొంతం చేసుకోనున్న శ్రీభరత్

image

విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.శ్రీ భరత్ మరపురాని గెలుపును సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో శ్రీభరత్‌కు 8,20,427 ఓట్లు లభించాయి. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి కేవలం 3,65,190 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో శ్రీభరత్ మెజారిటీ 4,55,231కి చేరింది. విశాఖ వేదికగా ఒక చారిత్రాత్మక విజయాన్ని శ్రీభరత్ సొంతం చేసుకోనున్నారు.

News June 4, 2024

రాజంపేట: ఆకేపాటి విజయం

image

రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు. ఈయనకు మొత్తం 92609 ఓట్లు పోలవ్వగా.. టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యానికి 85593 ఓట్లు సాధించారు. దీంతో ఆకేపాటి 7016 ఓట్లతో విజయం సాధించారు.

News June 4, 2024

కందుకూరులో టీడీపీ గెలుపు

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ మరో స్థానాన్ని కైవసం చేసుకుంది. కందుకూరు నియోజకవర్గంలో ఇంటూరి నాగేశ్వరరావు గెలిచారు. సమీప ప్రత్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ పై 17,813 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాగా టీడీపీ ఇప్పటివరకు 7 స్థానాలు గెలుపొందిన విషయం తెలిసిందే.

News June 4, 2024

కదిరి గెలుపుతో అనంత టీడీపీ క్లీన్ స్వీప్

image

కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ గెలుపుతో ఉమ్మడి అనంతపురం జిల్లాను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొదటి రౌండ్ నుంచి హోరాహోరీగా సాగిన కౌంటింగ్ ఫలితాల్లో కందికుంట విజయాన్ని సొంతం చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థి బీఎస్ మక్బూల్‌పై 21 రౌండ్లు పూర్తయ్యేసరికి 6265 ఓట్ల తేడాతో గెలుపొందారు. కందికుంట ప్రసాద్‌కు 103610 ఓట్లు, బీఎస్ మక్బూల్ 97345 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

యర్రగొండపాలెంలో గెలిచిన వైసీపీ

image

ప్రకాశం జిల్లాలో వైసీపీ ఖాతా తెరిచింది. యర్రగొండపాలెం నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి ఎరిక్షన్ బాబుపై తాటిపర్తి చంద్రశేఖర్ 5,200 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు వైసీపీ గెలిచిన స్థానం ఇదే కావడం విశేషం.

News June 4, 2024

బొబ్బిలి అడ్డా.. బేబినాయనదే

image

బొబ్బిలికి సంబంధించి 19 రౌండ్‌లలో లెక్కింపు పూర్తి కాగా TDP అభ్యర్థి బేబి నాయన ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచే తన ఆధిపత్యం చూపించిన బేబినాయన చివరి రౌండ్ వరకు అదే జోరును కొనసాగించారు. తన ప్రత్యర్థి శంబంగి చిన అప్పలనాయుడిపై 43,845 ఓట్ల తేడాతో గెలుపొందారు. YCP అభ్యర్థి అప్పలనాయుడికి 56,114 ఓట్లు పడగా.. బేబినాయనకి 99,959 ఓట్లు పడ్డాయి. దీంతో బొబ్బిలి కోటలో టీడీపీ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టారు.