Andhra Pradesh

News June 4, 2024

కదిరి గెలుపుతో అనంత టీడీపీ క్లీన్ స్వీప్

image

కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ గెలుపుతో ఉమ్మడి అనంతపురం జిల్లాను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొదటి రౌండ్ నుంచి హోరాహోరీగా సాగిన కౌంటింగ్ ఫలితాల్లో కందికుంట విజయాన్ని సొంతం చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థి బీఎస్ మక్బూల్‌పై 21 రౌండ్లు పూర్తయ్యేసరికి 6265 ఓట్ల తేడాతో గెలుపొందారు. కందికుంట ప్రసాద్‌కు 103610 ఓట్లు, బీఎస్ మక్బూల్ 97345 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

యర్రగొండపాలెంలో గెలిచిన వైసీపీ

image

ప్రకాశం జిల్లాలో వైసీపీ ఖాతా తెరిచింది. యర్రగొండపాలెం నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి ఎరిక్షన్ బాబుపై తాటిపర్తి చంద్రశేఖర్ 5,200 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు వైసీపీ గెలిచిన స్థానం ఇదే కావడం విశేషం.

News June 4, 2024

బొబ్బిలి అడ్డా.. బేబినాయనదే

image

బొబ్బిలికి సంబంధించి 19 రౌండ్‌లలో లెక్కింపు పూర్తి కాగా TDP అభ్యర్థి బేబి నాయన ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచే తన ఆధిపత్యం చూపించిన బేబినాయన చివరి రౌండ్ వరకు అదే జోరును కొనసాగించారు. తన ప్రత్యర్థి శంబంగి చిన అప్పలనాయుడిపై 43,845 ఓట్ల తేడాతో గెలుపొందారు. YCP అభ్యర్థి అప్పలనాయుడికి 56,114 ఓట్లు పడగా.. బేబినాయనకి 99,959 ఓట్లు పడ్డాయి. దీంతో బొబ్బిలి కోటలో టీడీపీ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టారు.

News June 4, 2024

కొండపిలో ఎగిరిన టీడీపీ జెండా

image

ప్రకాశం జిల్లాలోని మరో నియోజవర్గంలో టీడీపీ గెలిచింది. తాజాగా కొండపి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బాల వీరాంజనేయస్వామి సమీప ప్రత్యర్థి మంత్రి ఆదిమూలపు సురేశ్‌పై 23,511 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో ఉమ్మడి ప్రకాశ జిల్లాలో టీడీపీ మరో స్థానాన్ని గెలిచింది.

News June 4, 2024

కూటమికి చరిత్రాత్మకమైన విజయం: కలమట

image

కూటమికి చరిత్రాత్మకమైన విజయాన్ని రాష్ట్ర ప్రజలు ఇచ్చారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ మూర్తి అన్నారు. గతంలో ప్రజలు చేసిన పొరపాటుకు ఐదేళ్లుగా పడిన ప్రతిఒక్కరూ ఇబ్బంది పడ్డారని అన్నారు. ఈరోజు ఈ విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీను చంద్రబాబు అమలు చేసి ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తారని అన్నారు.

News June 4, 2024

విశాఖ: వంశీకృష్ణకు గుర్తింపు పత్రం 

image

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విజయాన్ని అధికారంగా ప్రకటించిన అధికారులు గుర్తింపు పత్రం అందజేశారు. గుర్తింపు పత్రం అందజేశారు. జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌కు ఎన్నికల పరిశీలకులు అమిత్ శర్మ, ఆర్వో సీతారామ మూర్తి లాంఛనంగా అందజేశారు.

News June 4, 2024

రైల్వే కోడూరు: అరవ శ్రీధర్ విజయం

image

రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ విజయం సాధించారు. ఈయనకు మొత్తం 77701 ఓట్లు పోలవ్వగా.. వైసీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసుకి 67002 ఓట్లు సాధించారు. దీంతో శ్రీధర్ 10699 ఓట్లతో ఘన విజయం సాధించారు. మొదటి సారి ఆయన విజయం సాధించారు. అంతేకాకుండా ఉమ్మడి కడప జిల్లాలో జనసేన జెండా ఎగురవేశారు.

News June 4, 2024

కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ ఘన విజయం

image

కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి మంచి ఆధిక్యంతో కొనసాగిన ఉదయ్.. వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌పై గెలుపొందారు. ఉమ్మడి తూ.గో జిల్లాలోని 3 ఎంపీ స్థానాల్లో కాకినాడ ఎంపీ స్థానం నుంచి ఉదయ్‌దే తొలి గెలుపు. దీంతో కూటమి నేతలు సంబరాల్లో మునిగారు.

News June 4, 2024

ఒంగోలులో టీడీపీ భారీ విజయం

image

ప్రకాశం జిల్లాలో 6వ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. తాజాగా ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డిపై 34,100 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు టీడీపీ ఆరు స్థానాలు గెలిచింది. మిగిలిన స్థానాల్లో కూడా టీడీపీ ముందంజలో ఉండటంతో మరిన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది.

News June 4, 2024

నరసాపురం MPగా కూటమి అభ్యర్థి ఘనవిజయం

image

నరసాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మ విజయం సాధించారు. మొత్తం ఆయనకు 7,07,343 ఓట్లు రాగా.. 2,76,802 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక వైసీపీ నుంచి బరిలో నిలిచిన గూడూరి ఉమాబాలకు 4,30,541 ఓట్లు వచ్చాయి.