India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూర్పు గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. రాజానగరానికి చెందిన హోంగార్డు కెల్లా సురేంద్ర(33) గుండెపోటుతో శనివారం మృతి చెందారు. ఉదయమే విధుల నిమిత్తం రాజమండ్రికి వెళ్లిన ఆయన.. హాజరు పట్టికలో సంతకం పెట్టే సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలారు. ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే సురేంద్ర మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా.. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
విజయవాడలో సీఎం జగన్ మీద జరిగిన దాడి పూర్తిగా ప్రతిపక్షాల కుట్రేనని హోంమంత్రి వనిత ఆరోపించారు. శనివారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దాడికి కారణం అయిన ఏ ఒక్కరిని విడిచి పెట్టబోమని, ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని, దేవుడి ఆశీసులు జగన్‌కు, వైస్సార్సీపీ ప్రజా ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి నియోజవర్గ కేంద్రాలకు నియోజవర్గ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. మే 13న జిల్లాలో పోలింగ్ జరుగనుండగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎంలను జీపీఎస్ ట్రాకింగ్ వాహనాల ద్వారా పోలీస్ బందోబస్తు మధ్య తరలిస్తున్నామన్నారు.
సీఎం జగన్ పెడన పర్యటన వాయిదా పడింది. శనివారం రాత్రి విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తి రోడ్ షోలో ఉన్న సీఎం జగన్ పై రాయితో దాడి చేయగా జగన్ గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచనల మేరకు సీఎం జగన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో పెడనలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 15న జగన్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
విశాఖ జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు విధిగా ఓటు హక్కును పొందాలని కలెక్టర్ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు. ఆఫ్ లైన్‌లో ఆదివారం అర్ధరాత్రిలోగా ఆన్లైన్‌లో, 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని పేర్కొన్నారు. 15 తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటామని అయితే అవి ఓటరు జాబితాలో ఉండే అవకాశం లేదన్నారు.
కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి డాక్యుమెంటేషన్ సరిగా లేనందున ప్రచార అనుమతుల కోసం వచ్చిన వాటిలో 27 దరఖాస్తులను తిరస్కరించినట్లు నోడల్ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. మొత్తం 54 దరఖాస్తులు వచ్చాయని, 27 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. పబ్లిక్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, కరపత్రాల పంపిణీ, హోల్డింగ్‌ల ఏర్పాటు.. ఇలా 20 రకాల కార్యక్రమాలకు అనుమతులు తప్పనిసరని అన్నారు.
సోంపేట మండలం బారువా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజాం గ్రామం నుంచి బెంకిలి గ్రామానికి టీవీఎస్ మోటార్ సైకిల్‌పై డొక్కరి నరేష్ తన మిత్రులతో కలిసి వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో డొక్కరి నరేష్ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి గాయాలతో బయటపడడంతో.. హైవే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.
రేపల్లె తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్స్ వింగ్ టీం ఫీల్డ్ వర్క్‌లో భాగంగా.. ఈనెల 13వ తేదీ నుంచి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో చేపట్టిన భారీ సైకిల్ యాత్రను టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం జెండా ఊపి ప్రారంభించారు.ఈ యాత్రలో భాగంగా టీడీపీ అమలు చేయబోయే హామీలను ప్రజలకు తెలియజెప్పటమే యాత్ర ముఖ్య ఉద్దేశం అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
కాకినాడ జిల్లా శంఖవరం శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కె.దొరబాబు(35) అనే వ్యక్తి కత్తిపూడి వైపు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. అతనికి భార్య, మూడేళ్ల లోపు వారు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇంటర్‌లో అనుకున్న మార్కులు రాలేదని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ప.గో జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. యలమంచిలి మండలం దొడ్డిపట్ల శివారు కుమ్మరిపాలెంకు చెందిన విద్యార్థిని(16) పాలకొల్లులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసింది. 450 మార్కులు వస్తాయని భావించిన ఆమె.. 380 రావడంతో మనస్తాపానికి గురైంది. పేరెంట్స్ ధైర్యం చెప్పినా పట్టించుకోకుండా ఉరేసుకుంది. చికిత్స పొందుతూ మృతి చెందింది.
Sorry, no posts matched your criteria.