Andhra Pradesh

News December 18, 2025

AMCల రాబడి పెంచాలి: JDM రామాంజనేయులు

image

AMCల రాబడిని పెంచాలని రాయలసీమ JDM రామాంజనేయులు కార్యదర్శులకు సూచించారు. గురువారం కడపలోJDM రామాంజనేయులు అధ్యక్షతన కడప, అన్నమయ్య జిల్లాల AMCలపై సమీక్ష నిర్వహించారు. వంద శాతం లక్ష్యాలు సాధించాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల మిల్లులకు వెళ్లి పరిశీలించాలన్నారు. చెక్ పోస్టుల వద్ద నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో DDM లావణ్య, ADM అజాద్, 20 మంది AMCల కార్యదర్శులు పాల్గొన్నారు.

News December 18, 2025

కృష్ణా: 22కి ఉద్యోగుల గ్రీవెన్స్ మార్పు- కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 19న జరగాల్సిన ఉద్యోగుల గ్రీవెన్స్ సమావేశం 22వ తేదీకి వాయిదా పడిందని కలెక్టర్ డి.కె. బాలాజీ తెలిపారు. అధికారిక కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశానికి పూర్తి నివేదికలతో హాజరుకావాలని ఆయన ఆదేశించారు.

News December 18, 2025

పలమనేరు: రూ.40 కోట్ల భూమి కబ్జా.?

image

పలమనేరు నియోజకవర్గంలో మరో భారీ భూ స్కాం ఇది. గంగవరంలోని డ్రైవర్స్ కాలనీ సమీపంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు అప్పనంగా కబ్జా చేసినట్లు తెలుస్తోంది. చెన్నై-బెంగళూరు బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న వంక పోరంబోకు భూమిపై అధికారికంగా నిషేధం ఉన్నప్పటికీ, దానిని ప్రైవేట్ భూమిగా మార్చినట్లు సమాచారం. దీని విలువ దాదాపు రూ.40 కోట్లుగా ఉంటుందట. దీనిపై మరింత సమాచారం తెలియాలి.

News December 18, 2025

అమరావతి: పేరుకే రాజధాని.. అంబులెన్స్ రావాలంటే కష్టమే!

image

అమరావతి రాజధాని ప్రాంతంలో అంబులెన్స్ కొరత తీవ్రంగా వెంటాడుతుంది. రాజధాని ప్రాంతంలో రోజూ ఏదొక ప్రమాదం జరుగుతూ ఉన్నా అంబులెన్స్ మాత్రం అందుబాటులో ఉండకపోవడంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. దీనికి ఉదాహరణ బుధవారం రాత్రి రాయపూడిలో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి సరైన సమయంలో వైద్యం అందక మృతి చెందడం. అంబులెన్స్‌కి ఫోన్ చేస్తే గుంటూరు, మంగళగిరి నుంచి రావడానికి గంటకు పైగా పడుతుందని స్థానికులు అంటున్నారు.

News December 18, 2025

కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న చిత్తూరు కలెక్టర్, ఎస్పీ

image

అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ప్రగతిపై సీఎం సదస్సులో చర్చించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించి పలు అంశాలపై కలెక్టర్, ఎస్పీకి దిశా నిర్దేశం చేశారు.

News December 18, 2025

కలెక్టర్ల సదస్సులో సిరి, ఎస్పీ

image

రాష్ట్ర సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కొనసాగుతున్న 5వ జిల్లా కలెక్టర్ల సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సదస్సులో కర్నూలు జిల్లా నుంచి కలెక్టర్ డా. ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న పరిపాలనా కార్యక్రమాలు, శాంతిభద్రతల అంశాలపై చర్చించారు. జిల్లాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలు అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

News December 18, 2025

కలెక్టర్ల సద్దస్సులో పాల్గొన్న విశాఖ కలెక్టర్, సీపీ

image

రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు సమావేశంలో విశాఖపట్నం కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, సీపీ శంకబ్రత బాగ్చి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి పనులపై చర్చించారు.

News December 18, 2025

‘ఛాంపియన్ ఫార్మర్’పై నెల్లూరు కలెక్టర్‌కు ప్రశంసలు

image

నెల్లూరు జిల్లా వ్యవసాయ రంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో వినూత్నంగా ‘ఛాంపియన్ ఫార్మర్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. ఈ కార్యక్రమం వివరాలను ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లడంతో సీఎం చంద్రబాబు అభినందించారు. నీటి నిల్వల పరిస్థితి, పంటల మార్పు , రైతుల ఆదాయం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.

News December 18, 2025

విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై పునరాలోచన?

image

TDP జిల్లా అధ్యక్ష పదవిపై అధిష్ఠానం పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడిగా ఇటీవల కిమిడి నాగార్జున పేరును అధిష్ఠానం ఖరారు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం DCCB ఛైర్మన్‌గా నాగార్జునకు ఆ బాధ్యతలు నిర్వహించడమే సవాల్ అని, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో.. ఈ రెండు బాధ్యతల్ని నెగ్గుకురావడం సులభం కాదని కొందరు నేతలు అధిష్ఠానంకు తెలిపినట్లు సమాచారం.

News December 18, 2025

నెల్లూరు: ఎక్కువ రేటుకు యూరియా ఇస్తున్నారా?

image

నెల్లూరు జిల్లాలో హోల్ సేల్, రిటైల్ డీలర్లు అధిక ధరలకు యూరియా విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని అగ్రికల్చర్ జేడీ సత్యవాణి హెచ్చరించారు. బ్లాక్‌లో <<18592684>>యూరియా అమ్మకాలపై <<>>Way2Newsలో వార్త రావడంతో ఆమె స్పందించారు. అధిక ధరలకు ఎవరైనా విక్రయిస్తే 83310 57285కు కాల్ చేయాలని రైతులకు సూచించారు. ఈనెలాఖరున మరో 6వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వస్తుందన్నారు.