Andhra Pradesh

News April 14, 2024

సర్‌బుజ్జిలి యువకుడి కిడ్నాప్ కలకలం

image

వ్యక్తి కిడ్నాప్‌కు యత్నించిన ఘటన విశాఖ ఎంవీపీ స్టేషన్ పరిధిలో జరిగింది. సరుబుజ్జిలి మండలానికి చెందిన యుగంధర్ శనివారం విశాఖలో క్యాబ్‌ బుక్ చేసుకొని బీజేపీ కార్యాలయం వద్ద ఉండగా అప్పుడే కారులో ఐదుగురు అతడిని బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారు. గమనించిన డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా విశాఖకు చెందిన యువతితో వివాహేతర సంబంధం ఉంటటంతో ఆమె భర్త కిడ్నాప్‌నకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

News April 14, 2024

నెల్లూరు: సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడిన మెరైన్ పోలీస్

image

సైదాపురం మండలం తూర్పుపూండ్లకు చెందిన హుస్సేన్ బాషా స్నేహితులతో కలిసి శనివారం కోడూరు బీచ్ కు వచ్చాడు. సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో అలల తాకిడికి లోనికి వెళ్లిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన మెరైన్ కానిస్టేబుల్ పోలయ్య వెంటనే అప్రమత్తమై ఆ యువకుడిని బయటకు తీసుకొచ్చాడు. సీపీఆర్ చేసిన అనంతరం చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. సకాలంలో స్పందించిన పోలయ్యను పలువురు అభినందించారు.

News April 14, 2024

తూ.గో జిల్లాలో మొత్తం ఓటర్లు 16,16,918 మంది

image

తూర్పు గోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 16,16,918 ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 7,89,443, మహిళలు 8,27,380, ఇతరులు 95 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 19,726 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 11,533 మంది కాగా.. మహిళలు 8,192 మంది ఇతరులు ఒకరు ఉన్నారు. ఏడు నియోజకవర్గాల పరిధిలో 85 ఏళ్లు వయస్సు దాటిన వారు మొత్తం 8,284 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 3,536 మంది కాక మహిళలు 4,748 మంది ఉన్నారు.

News April 14, 2024

విశాఖ: జూన్ 14 వరకు చేపల వేట నిషేధం

image

విశాఖ జిల్లాలో ఈనెల 14 అర్ధ రాత్రి నుంచి జూన్ 14 వరకు చేపల వేటకు ప్రభుత్వం విరామం ప్రకటించింది. చేపల పునరుత్పత్తి సమయంలో వాటి సంరక్షణకు ఏటా 61 రోజుల పాటు వేటను నిలిపివేస్తుంది. ఈ కారణంగా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఈ సమయంలో చేపలు వేటకు వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News April 14, 2024

ఇంటర్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని

image

దేవనకొండ మండలం తెర్నెకల్‌లోని పేద కుటుంబానికి చెందిన కిరణ్, జయలక్ష్మి దంపతుల కూతురు అనూష ఆరెకల్‌లోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 965 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. మంచి మార్కులు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

News April 14, 2024

VZM: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా..!

image

విజయనగరంలో ఈనెల 16న జరగాల్సిన ప్రజాగళం కార్యక్రమం వాయిదా పడినట్లు టీడీపీ కార్యాలయం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉండగా.. అనివార్యకారణాలు వలన రావడం లేదని పేర్కొంది. అయితే రేపు రాజాంలో జరిగే సభలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు.. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో రాజాం వస్తారు. అంబేడ్కర్ కూడలిలో సా.3గంటలకు జరిగే సభలో పాల్గొంటారు.

News April 14, 2024

అనంత: విషాదం.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

తాడిపత్రి మండలంలో ఇంటర్ విద్యార్థి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని ఇందు ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఫెయిల్ అవుతాననే ఉద్దేశంతో ఫలితాలు వచ్చే రోజు ఉదయమే పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 14, 2024

ప్రకాశం: ఎన్నికల విధుల్లో VRO ఆకస్మిక మృతి

image

యద్దనపూడి మండలంలోని జాగర్లమూడికి చెందిన వీఆర్వో కాలేషావలి(46) ఆకస్మికంగా మృతిచెందాడు. ఎన్నికల నేపథ్యంలో బాపట్లలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూం వద్ద విధులకు హాజరయ్యారని సహచర వీఆర్వోలు వెల్లడించారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురవ్వడంతో వైద్య సేవల కోసం చీరాలకు తరలించినట్లు చెప్పారు. వైద్యులు వచ్చి సేవలందించే సరికి అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు.

News April 14, 2024

అన్నపై దాడిని ఖండించిన చెల్లి షర్మిల

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జరిగిన రాయి దాడిని తన సోదరి వైఎస్ షర్మిల ఖండించారు. ప్రొద్దుటూరులో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రిపై జరిగిన రాయి దాడిని ఆమె దురదృష్టకరమైన ఘటన అంటూ ఖండిస్తూ ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని భావిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు లేదని స్పష్టం చేశారు.

News April 14, 2024

నేడు విశాఖలో చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే

image

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదివారం పాయకరావుపేట, గాజువాకల్లో ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. ప్రత్యేక విమానంలో బయలుదేరి 2.05కు విశాఖ చేరుకుంటారు. అక్కడ నుంచి 2.10కు హెలికాప్టర్‌లో బయలుదేరి 2.35కు పాయకరావుపేట సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.40కు హెలికాప్టర్‌లో విశాఖ ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన 5.35కు పాతగాజువాక చేరుకుంటారు. సా. 6 నుంచి 7.30 వరకు ఎన్నికల సభలో పాల్గొంటారు.