India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప.గో. జిల్లా తణుకు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ 72121 భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో రాష్ట్రంలోనే ఇదే అత్యధికం కావడం విశేషం. ఆరిమిల్లికి మొత్తం ఓట్లు 1,29,547 ఓట్లు రాగా.. ప్రత్యర్థి పార్టీ వైసీపీ నుంచి బరిలో నిలిచిన కారుమూరి వెంకట నాగేశ్వర రావుకు 57426 ఓట్లు వచ్చాయి.

చిలకలూరిపేటలో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కావటి మనోహర్ నాయుడిపై 32,098 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కిషోర్ రెడ్డిపై 11,950 మెజార్టీతో విజయం సాధించారు. ఫరూక్ గెలవడంతో టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు, అభ్యర్థి కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. దీంతో నంద్యాల పట్టణం పసుపు మయంగా మారింది.

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలోని పరిస్థితులను మంగళవారం జిల్లా ఎస్పీ తుషార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ అనంతరం జిల్లాలోని పరిస్థితులను నాగార్జున యూనివర్సిటీలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం ఆవరణతోపాటు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహించాలన్నారు.

గురజాల కూటమి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు సమీప ప్రత్యర్థి కాసు మహేశ్ రెడ్డిపై 25వేల + ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1994 నుంచి రాజకీయాలలో ఉన్న యరపతినేని గురజాల కు ఒకే పార్టీ నుండి నుంచి ఏడు సార్లు పోటీ చేసి రికార్డ్ సృష్టించారు. తాజా గెలుపుతో ఆయన నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. దీంతో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

హిందూపురం బిట్ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్ ఎనిమిదో రౌండ్ పూర్తైంది. 8వ రౌండ్ పూర్తయ్యేసరికి హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే.పార్థసారథి 47,143 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఎనిమిదో రౌండ్‌లో టీడీపీకి 47,143 ఓట్లు, వైసీపీకి 28,990 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు ఘన విజయం సాధించారు. 44,107 ఓట్లతో ప్రత్యర్థి వాసుబాబుపై గెలుపొందారు. కాగా ఉమ్మడి ప.గో.లోని 15 స్థానాల్లో 12 చోట్ల గెలిచినట్లయింది. ఇక పోలవరం, దెందులూరు, నిడదవోలు ఫలితాలు రావల్సి ఉంది.

సర్వేపల్లి నియోజకవర్గంలో 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగురవేసింది. 2004 ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గంలో వరుస ఓటములు ఎదుర్కొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో 16 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద బాబు విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై గెలిచారు. 18 రౌండ్లు పూర్తి అయ్యేసరికి, 22 వేల + ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతున్నారు. పలాసలో గౌతు శిరీష 32,087 ఓట్లు, టెక్కలిలో అచ్చెన్న 32,802 ఆధిక్యంలో ఉన్నారు. కాగా మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాద్ పలాస, శ్రీకాకుళం నియోజకవర్గాలలో ఓటమి బాటలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.