India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బాపట్లలో టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ విజయం సాధించారు. ఆయన మొత్తం 15 రౌండ్లు ముగిసేసరికి 26,800 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఆయనకు 88,827 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి కోన రఘుపతికి 62,027 ఓట్లు నమోదయ్యాయి. 1999 తరువాత 2024లో బాపట్లలో టీడీపీ జెండా ఎగరవేశారు. నరేంద్ర మొదటి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు.

ఉమ్మడి ప.గో. జిల్లాలో మొత్తం 15 స్థానాలకు గాను ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో 11 చోట్ల ఘన విజయం సాధించింది. మరో 4 స్థానాల్లో ఫలితం రావాల్సి ఉంది. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ 13 చోట్ల వైసీపీ విజయం సాధించగా.. 2 చోట్ల టీడీపీ పాగా వేసింది. మరి ఈ సారి కూటమి మరో 4 చోట్ల గెలిస్తే క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. పోలవరంలో కొద్దిగా పోటాపోటీ నడుస్తోంది.
– మీ కామెంట్..?

ఏపీలో బీజేపీ పోటీ చేసిన 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఏడింటిలో ఆధిక్యంలో ఉంది. ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులలో విజయవాడ పశ్చిమ MLA అభ్యర్థి సుజనా చౌదరి 10 రౌండ్లు ముగిసేసరికి 31,891 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ.. టాప్‌లో ఉన్నారు. మొత్తం పశ్చిమలో 19 రౌండ్లలో కౌంటింగ్ జరగాల్సి ఉండగా 10 రౌండ్లు పూర్తయ్యేసరికి సుజనా భారీ ఆధిక్యంతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.

సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు. 19 రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఆయన.. అంబటి రాంబాబుపై 25,950 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ మరో రౌండ్ ఓట్ల లెక్కింపు మిగిలి ఉండగా, లెక్కించాల్సిన ఓట్లు మెజారిటీ కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో కన్నా గెలుపు ఖాయమైంది. నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్‌పై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత 33, 629 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరఫున బరిలో దిగిన గంటి హరీష్ మాధుర్ 2,24,164 ఓట్ల మెజార్టీతో దూసుకువెళ్తున్నారు.
ఆయనకు మెత్తం 4,98,610 ఓట్లు పోల్ కాగా.. వైసీపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌కు 2,74,446 పోలయ్యాయి. మొదటి నుంచి గంటి హరీష్ మాధుర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి సర్నాల తిరుపతి రావుపై 42829ఒట్ల మోజారిటితో గెలుపొందారు. కాగా మైలవరంలో ఇప్పటికే టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి జనసేన తరఫున బరిలో దిగిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ 1,48,775 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కలిపి ఉదయ్‌కి మొత్తం 520,192 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌కు 3,71,417 ఓట్లు పోలయ్యాయి. మొదటి నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

ధర్మవరం ఎమ్యెల్యేగా సత్యకుమార్ యాదవ్ విజయం సాధించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డిపై సత్యకుమార్ 5000కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. తొలినుంచి కేతిరెడ్డి మెజారిటీ సాధించగా.. చివర్లో బీజేపీ పుంజుకుంది. కేతిరెడ్డిపై ఉన్న వ్యతిరేకత, కూటమినేతల సపోర్ట్, జాతీయనేత కావడం సత్యకు కలిసివచ్చింది. బీసీ ఓటర్లు సహా అన్ని సామాజికవర్గాల ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో సత్య సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి నూరి ఫాతిమాపై గెలుపొందారు. మొత్తం 19 రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయనకు 99,163 ఓట్లు, నూరీ ఫాతిమాకు 67,812 ఓట్లు వచ్చాయి. దీంతో నజీర్ 31,351 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో నియోజకవర్గ ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.