India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు మేయర్ సురేశ్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ తరఫున ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో జరిగిన బస్సు యాత్రలో షర్మిల ముఖ్యమంత్రి జగన్, కడప ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డిపై నోటికి వచ్చినట్లు మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సెక్టర్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్ల పాత్ర ఎంతో కీలకమని జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియోజకవర్గ పరిధిలోని సెక్టార్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, మాస్టర్ ట్రైనర్లకు శనివారం నగర పాలక కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ, కోడ్ అమలు పోలింగ్ రోజు నిర్వహించాల్సిన విధులపై అవగాహన పెంచుకోవాలన్నారు.
మహానంది కోనేరు నీటిలో పీహెచ్ స్థాయి 7.1గా ఉందని.. ఇలా ఉండటం అరుదని ఇంటాచ్ సంస్థ జిల్లా కన్వీనర్ ఎంవీ శివకుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పరిశోధనల సర్టిఫికెట్ పత్రాలను ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డికి అందించారు. మహానంది కోనేరుకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి తమవంతు కృషి చేస్తామన్నారు. కాల్షియం కార్బోనేట్, సల్ఫర్, మెగ్నీషియం తదితర పరీక్షలు చేశామని అన్నింట్లో ప్రథమ స్థానంలో ఉందన్నారు.
నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఆయేషా (2422114695) అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ ఫలితాలలో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఇంటర్మీడియట్ ఫలితాలలో CEC విభాగం నుంచి 500కు గాను 486 మార్కులు సాధించింది. ఆమె నంద్యాలలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు.
భీమవరం, గాజువాకలో ఓడిపోవడంతో పిఠాపురంలో పవన్ కొత్తగా ప్రచారం చేసుకుంటున్నారని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి అక్కడ వంగాగీత బలమైన నేత అని, ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి సూట్ కేసు తీసుకోని బీజేపీలో చేరారని ఎద్దేవా చేశారు. పిఠాపురంలో వంగాగీత గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించింది. మద్యం దుకాణాల్లో రూ.లక్ష విలువగల మద్యం విక్రయం జరగగానే షాపులను మూసివేయాలని ఉత్తర్వులు జారీచేసింది. అలాగే ప్రతి వ్యక్తికి ఒక్క మద్యం క్వార్టర్ బాటిళ్లు మాత్రమే అందజేయాలని ఆదేశాలు జారీచేసింది. గతంలో ఒక వ్యక్తికి మూడు మద్యం బాటిళ్లు ఇచ్చే వెసులుబాటు ఉండింది. ప్రస్తుతం ఒక్క బాటిల్‌కు మాత్రమే కుదించింది.
బ్రహ్మంగారిమఠం మండలంలోని సోమిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన గొల్లపల్లె చరణ్ గుండె పోటుతో శుక్రవారం రాత్రి మరణించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు సాంబశివరెడ్డి, మండల అధ్యక్షుడు సుబ్బారెడ్డి, పూజారి శివ చరణ్ మృతదేహానికి నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చరణ్ అతి చిన్న వయసులో మరణించడం బాధాకరమన్నారు.
స్థానిక ఈవీఎం గోదాములో నిర్వహిస్తున్న ఈవీఎంల కేటాయింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి శనివారం పరిశీలించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఈవిఎంలను వివిధ నియోజక వర్గాలకు ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే. నియోజకవర్గాలకు వచ్చిన ఈవీఎం సీరియల్ నంబర్ల ప్రకారం, వాటిని ఆయా నియోజకవర్గాల వారీగా వేరుచేసి, స్కానింగ్ చేసే కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది.
అనంతపురం నగరంలో ఆదివారం అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రానున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి పట్టణ టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
మండలంలోని ఈపూరుపాలెంలో ఇసుక లోడ్‌లో మృతదేహం బయటపడిన ఘటనపై ట్విటర్(X) వేదికగా శనివారం TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఇది ఇసుక మాఫియా పననే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ఈ ఘటన ఒక నిదర్శనమన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ భర్తలు తిరిగి వస్తారన్న నమ్మకం భార్యలకు లేకుండా పోయిందన్నారు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయని విమర్శించారు.
Sorry, no posts matched your criteria.