Andhra Pradesh

News April 13, 2024

ఏలూరు: ఇంటర్ బాలికకు పెళ్లి.. అడ్డగింత

image

ఏలూరు జిల్లా భీమడోలులో బాల్యవివాహాన్ని అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలికకు భీమవరానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరుగుతుందన్న సమాచారం మేరకు జిల్లా డీసీపీయూ అధికారులు, భీమడోలు అంగన్వాడీ, ఐసీడీఎస్ సిబ్బంది రంగంలోకి దిగారు. శుక్రవారం బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికను ఏలూరు ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తరలించామని శనివారం వెల్లడించారు.

News April 13, 2024

తిరుపతి: గ్రీన్ ఛానల్ ద్వారా హార్ట్‌, లివర్‌ తరలింపు

image

తాను మరణించినా అవయవదానంతో మరికొందరికి ప్రాణం పోయాలనే ఆలోచన ఈరోజుల్లో కొంతమందికే కలుగుతోంది. తమ వాళ్లు మరణించినా అంత దు:ఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చే వాళ్లకు నిజంగా హ్యాట్సాఫ్‌. శనివారం ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు నుండి గుండె, లివర్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. అనంతరం అక్కడ నుండి పోలీసుల భద్రత నడుమ ప్రత్యేక ఆంబులెన్స్ లలో గుండెను శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారు.

News April 13, 2024

‘చిట్టిబాబు’తో కాంగ్రెస్‌కు కలిసొచ్చేదెంత..? వైసీపీకి నష్టమెంత?

image

పి.గన్నవరం MLA కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్‌లో చేరారు. మామిడికుదురు మండలం నగరంలో జన్మించిన చిట్టిబాబు.. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్‌లో ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడగా.. 2019లో TDP అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబుపై గెలిచారు. ఈసారి వైసీపీ టికెట్ దక్కక అసంతృప్తిగా ఉన్న చిట్టిబాబు.. ఈరోజు హస్తం గూటికి చేరారు. చిట్టిబాబు నిర్ణయంతో వైసీపీకి నష్టమెంత..? కాంగ్రెస్‌కు కలిసొచ్చేదెంత.? కామెంట్..

News April 13, 2024

రాజాంలో రూ.20 లక్షలు విలువ చేసే నగలు స్వాధీనం

image

రాజాం మండలం పొగిరి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ఎలక్షన్ చెక్ పోస్ట్ వద్ద రాజాo సిఐ దాడి మోహన్ రావు రూ.20 లక్షలు విలువచేసే 25 కేజీల వెండిని స్వాధీనం చేసున్నారు. విశాఖ నుంచి పాలకొండ వైపు వస్తున్న బస్సులో తనిఖీ చేయగా.. వారి వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.

News April 13, 2024

నెల్లూరు: 43 మందిలో ఒక్కరే పాస్..

image

చేజర్ల మండల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మెుదటి సంవత్సరంలో 43 మంది విద్యార్థులు చదువుతున్నారు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో ఒక్క విద్యార్థి మాత్రమే పాసయ్యారు. 42 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ప్రభుత్వ అధ్యాపకుల నిర్లక్ష్యమని విమర్శలు వస్తున్నాయి. సీనియర్ ఇంటర్ లో 27 మందికి గాను 13 మంది ఫెయిల్ అయ్యారు.

News April 13, 2024

ఇంటర్ ఫలితాలు.. పామిడి విద్యార్థికి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు

image

అనంత జిల్లా పామిడికి చెందిన రామచంద్ర నాయక్, రమాదేవి దంపతుల కుమార్తె గీతాంజలి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాలలో 433/440 (బైపీసీ) మార్కులు పొంది రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. ఆమె మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఫలితం సాధించగలిగానని తెలిపింది. ఆమెకు కుటుంబసభ్యులు, పట్టణ ప్రజలు అభినందనలు తెలిపారు.

News April 13, 2024

‘పర్చూరులో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నా’

image

పర్చూరు ఇందిరా కాలనీకి చెందిన షేక్ ఖాసిం సైదా రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని శనివారం స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా పర్చూరులో తిష్ట వేసిన సమస్యలను పట్టించుకోవడం లేదని, పేదలకు చేస్తున్నది ఏమీ లేదని ఆరోపించారు. స్థానికుడైన తనకు నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉందని, పేదల బాధలు తనకు తెలుసునని చెప్పారు. అందుకే పేదల ప్రతినిధిగా పోటీకి దిగుతున్నానన్నారు.

News April 13, 2024

మాచర్ల: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

మాచర్ల మండల పరిధిలోని కంభంపాడులో శనివారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఈర్ల మహేందర్ నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇతను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 13, 2024

కర్నూలు జిల్లా KGBVలలో ఉత్తమ ఫలితాలు

image

కర్నూలు జిల్లాలో 26 KGBVలలో ప్రథమ సంవత్సరంలో 588 మంది విద్యార్థినులకు గాను 372, ద్వితీయ సంవత్సరంలో 488 మందికి గాను 358 మంది పాసయ్యారు. ఆస్పరి, దేవనకొండ, కల్లూరు, నందవరం KGBVలో 100% ఉత్తీర్ణత సాధించారు. గూడూరు KGBVలో విజయలక్ష్మి 956(MPC), కోడుమూరు KGBVలో సుమలత 963(BiPC) ప్రథమ స్థానంలో నిలిచారు. ఆస్పరి KGBVలో BiPC చదువుతున్న నిర్మల 421 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా కలెక్టర్ సృజన అభినందించారు.

News April 13, 2024

విశాఖ: రాళ్లతో కొట్టి యువకుడి దారుణ హత్య

image

విశాఖపట్నం అరిలోవ కృష్ణపురంలో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. యువకుడిని రాళ్లతో కొట్టి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.