Andhra Pradesh

News April 13, 2024

నకిలీ కథనాలపై నిఘా ఉంచుతున్నాం: కలెక్టర్

image

సార్వత్రిక, లోక్ సభ ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగా సోషల్ మీడియాలో ప్రసారమయ్యే కథనాలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించి పర్యవేక్షిస్తోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ కథనాల ప్రచురణ, ప్రసారం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు.

News April 13, 2024

మదనపల్లె: భార్యపై భర్త బండ రాయితో దాడి..

image

పండుగ సరుకులు కొనివ్వడానికి రాలేదని నిలదీసిన భార్య పై భర్త బండరాయితో దాడి చేసిన ఘటన నిమ్మనపల్లి మండలంలో జరిగింది. పోలీసుల కథనం.. మండలంలోని గారబురుజుకు చెందిన శివకుమార్ మదనపల్లెలో మగ్గాలు నేస్తాడు. శుక్రవారం రాత్రి గారబురుజును శివకుమార్‌ వచ్చాడు. ఉగాది పండుగకు ఇంట్లోకి సరుకులు కొనివ్వడానికి ఎందుకు రాలేదని భార్య దీపిక నిలదిసింది. దీంతో ఆగ్రహించిన భర్త.. భార్యపై బండరాయితో దాడిచేసి గాయపరిచాడు.

News April 13, 2024

విజయవాడలో CM జగన్ భారీ బహిరంగ సభ

image

సీఎం జగన్ ఈ నెల 27 లేదా 28న విజయవాడ వెస్ట్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదే రోజు ఆయన మరో 3 బహిరంగ సభల్లో పాల్గొననున్నట్లు సమాచారం. జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఈ నెల 24న టెక్కలిలో ముగియనుంది. 25న జగన్ నామినేషన్ అనంతరం, ఈ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

News April 13, 2024

విశాఖ: రాళ్లతో కొట్టి యువకుడి దారుణ హత్య

image

విశాఖపట్నం అరిలోవ కృష్ణపురంలో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. యువకుడిని రాళ్లతో కొట్టి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. 

News April 13, 2024

గుంటూరు: 14వ రోజు జగన్ బస్సు యాత్ర ప్రారంభం

image

సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 14వ రోజు ప్రారంభమైంది. నంబూరు నుంచి ప్రారంభమైన యాత్ర.. ఇవాళ కాజ టోల్ గేట్, ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్‌కు చేరుకోనున్నారు. అక్కడ చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు.

News April 13, 2024

సామర్లకోట: వాహన తనిఖీళ్లో రూ.12.67 లక్షలు స్వాధీనం

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సామర్లకోట పట్టణంలో ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తుల నుంచి ఎలాంటి ఆధారాలు లేని రూ.12,67,611 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు మొత్తాలను జిల్లా ట్రెజరీకి అప్పగించినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి జాస్తి రామారావు తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీసు అధికారులు, సిబ్బంది, తదితదరులు పాల్గొన్నారు.

News April 13, 2024

వెంకటాచలం: స్కూల్ వ్యాన్ ఢీకొని మహిళ మృతి

image

మండలంలోని ఈదగాలి గ్రామానికి చెందిన వెందోటి సుబ్రహ్మణ్యం, వెంకటలక్ష్మమ్మ దంపతులు. వారిద్దరూ శుక్రవారం సాయంత్రం బైక్‌పై వెళ్తుండగా ఇడిమేపల్లి ప్రాంతంలోని సర్వేపల్లి రైల్వే గేట్ సమీపంలో స్కూల్ వ్యాన్ ఢీ కొట్టింది. దీంతో వెంకటలక్ష్మమ్మ (30) అక్కడికక్కడే మృతిచెందింది. సుబ్రహ్మణ్యంకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 13, 2024

నందిగంలో కారు బోల్తా 

image

నందిగం మండలం జాతీయ రహదారిపై శనివారం ఉదయం కార్ అదుపుతప్పి బోల్తా పడింది. పైడి భీమవరం నుంచి పలాస వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పలాసలో జరుగు శుభకార్యానికి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కారు బుక్ చేసుకుని వెళ్తున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై నందిగం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

News April 13, 2024

రాష్ట్రస్థాయిలో మెరిసిన కాకినాడ విద్యార్థిని.. 991/1000

image

రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించిందో విద్యార్థిని. కాకినాడ PR ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదువుతున్న డి.సాయిలక్ష్మి 1000కి గానూ 991 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ తిరుపతిరెడ్డి తెలిపారు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో సాయిలక్ష్మి స్తతా చాటగా.. గ్రామస్థులతో పాటు అధ్యాపకులు ఆమెను అభినందించారు.

News April 13, 2024

ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచారయత్నం

image

ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం జగ్గవరం గ్రామంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పోలీసుల వివరాల ప్రకారం.. జగ్గవరానికి చెందిన ఏడేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన లక్ష్మణరావు ఇంటికి తీసుకువెళ్లి చీమలు తొలగిస్తానని చెప్పి ఆమె దుస్తులు తీసేసి అత్యాచారానికి యత్నించాడు. ఇంటికి వచ్చిన బాలిక శరీరంపై గాయాలు గుర్తించిన తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు లక్ష్మణరావుపై కేసు నమోదు చేశారు.