Andhra Pradesh

News April 13, 2024

కడప: ‘ఓటమి భయంతోనే షర్మిల యాత్రకు అడ్డంకులు’

image

సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల జిల్లాలో చేపట్టిన న్యాయ యాత్రను అడ్డుకుంటున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర విమర్శించారు. జగన్ వైఫల్యాన్ని, వివేకానందరెడ్డి హత్య కేసు వివరాలను షర్మిల ప్రజలకు వివరించడంతో జగన్ లో ఓటమి భయం మొదలైందన్నారు. అందుకే వేంపల్లె, లింగాలలో అల్లరిమూకలతో అడ్డుకోవాలని చూశారన్నారు.

News April 13, 2024

ప్రకాశం: 61 రోజులు చేపల వేట నిషేధం

image

ప్రకాశం జిల్లా సముద్ర జలాల్లో పడవలు, మరబోట్ల ద్వారా నిర్వహించే చేపలవేటపై 61 రోజుల నిషేధం ఈనెల 15 నుంచి అమల్లోకి రానుందని జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సముద్రంలో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిషేధం విధించినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు మత్స్యకారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా వారికి ప్రభుత్వం అందించే రాయితీలను నిలిపివేస్తామన్నారు.

News April 13, 2024

కృష్ణా: 38 మంది పరీక్ష రాస్తే.. అందరూ ఫెయిల్

image

కృష్ణా జిల్లా ఇంటర్ ఫలితాల్లో హైస్కూల్ ప్లస్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఆశించిన మేర రాలేదు. జిల్లాలో ఏకంగా 7 చోట్ల జీరో ఫలితాలు నమోదు అయ్యాయి. పెనుగ్రంచిప్రోలు(3), లింగాలపాడు(19), జగ్గయ్యపేట బాలికలు(4), పెనమలూరు(6), పమిడిముక్కల(6), ఘంటసాలలో ఒకరు చొప్పున పరీక్ష రాస్తే అందరూ ఫెయిలయ్యారు.

News April 13, 2024

శ్రీ సత్యసాయి: ఇంటర్ ఫలితాలలో టాపర్‌గా నిలిచిన రైతు కూలీ బిడ్డ

image

బత్తలపల్లి మండలానికి చెందిన చెలిమి రామ్మోహన్, ఆదెమ్మల కుమార్తె గౌతమి మండల టాపర్‌గా నిలిచింది. ధర్మవరంలోని కళాశాలలో చదువుతూ ఎంపీసీ మొదటి సంవత్సరంలో 465/470 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు రైతు కూలీలుగా జీవనం సాగిస్తూ తమ బిడ్డను చదివిస్తున్నారు. మండల టాపర్‌గా నిలిచిన గౌతమిని కురుబ కార్పొరేషన్ ఛైర్మన్ కోటి బాబు అభినందించారు.

News April 13, 2024

శ్రీకాకుళం: ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

image

శ్రీకాకుళం మండల పరిధిలోని డీసీసీబీ కాలనీలో నివాసం ఉంటున్న కింతలి శ్రీవాణి (30) శుక్రవారం తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ..శ్రీవాణి, ఆమె భర్త హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేసేవారు. కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే ఆమెకు పిల్లలు లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.

News April 13, 2024

గుంటూరు: బీజేపీకి చందు సాంబశివరావు రాజీనామా

image

బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ శాస్త్రవేత్త చందు సాంబశివరావు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. నేడు ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. గుంటూరు పశ్చిమ నుంచి బీజేపీ తరఫున ఈయన ఎమ్మెల్యే సీటు ఆశించారు. అయితే టీడీపీ అభ్యర్థికి సీటు కేటాయించడంతో బీజేపీకి రాజీనామా చేశారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో కాపులకు తగిన ప్రాధాన్యం లేదని గతంలో ఆయన చెప్పారు.

News April 13, 2024

ఇంటర్ ఫలితాలు.. నంద్యాల టాపర్‌గా ఎలక్ట్రీషియన్ కుమారుడు

image

నంద్యాల విశ్వ నగర్‌కు చెందిన గిద్దలూరు సందీప్ ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం ఫలితాల్లో టౌన్ టాపర్‌గా నిలిచాడు. 460/470 మార్కులు సాధించి సత్తా చాటాడు. పదో తరగతిలో కూడా అత్యుత్తమ మార్కులు సాధించాడు. ఇంజినీరింగ్ చదవడం తన కల అని, ఆ కలను నిజం చేసుకుంటానని తెలిపాడు. తన తండ్రి మధు బాబు ఎలక్ట్రీషియన్ పని చేస్తారని పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులను బాగా చూసుకోవడమే తన ముందున్న లక్ష్యం అని తెలిపాడు.

News April 13, 2024

తల్లీ, కుమార్తె మృతదేహాలు లభ్యం

image

ఆర్థిక ఇబ్బందులతో భీమవరానికి చెందిన కిషోర్‌కుమార్‌(32), అతని భార్య యోచన(24) కుమార్తె నిధిశ్రీ(2)తో చించినాడ వశిష్ఠ వంతెనపై నుంచి గోదావరిలో దూకిన విషయం తెలిసిందే. గురువారం కిషోర్‌ మృతదేహం.. శుక్రవారం తల్లీ, కుమార్తె మృతదేహాలు దొరికాయి. పాలకొల్లులో పోస్టుమార్టం చేశారు. మరణంలోనూ పేగు బంధాన్ని వీడలేక యోచన చున్నీతో కుమార్తెను కట్టేసుకొని దూకినట్లు తెలుస్తోంది. వీరు కొద్దిరోజులుగా అమలాపురంలో ఉన్నారు.

News April 13, 2024

తల్లీ, కుమార్తె మృతదేహాలు లభ్యం

image

ఆర్థిక ఇబ్బందులతో భీమవరానికి చెందిన కిషోర్‌కుమార్‌(32), అతని భార్య యోచన(24) కుమార్తె నిధిశ్రీ(2)తో చించినాడ వశిష్ఠ వంతెనపై నుంచి గోదావరిలో దూకిన విషయం తెలిసిందే. గురువారం కిషోర్‌ మృతదేహం.. శుక్రవారం తల్లీ, కుమార్తె మృతదేహాలు దొరికాయి. పాలకొల్లులో పోస్టుమార్టం చేశారు. మరణంలోనూ పేగు బంధాన్ని వీడలేక యోచన చున్నీతో కుమార్తెను కట్టేసుకొని దూకినట్లు తెలుస్తోంది. వీరు కొద్దిరోజులుగా అమలాపురంలో ఉన్నారు.

News April 13, 2024

నెల్లూరు: 15వ తేదీతో ముగియనున్న గడువు

image

15వ తేదీ రాత్రితో ఓట్ల నమోదుకు గడువు ముగియనుంది. 18 ఏళ్లు నిండి ఇంకా ఓటు నమోదు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యంత్రాంగం సూచిస్తోంది. ఇటీవల విడుదలైన జాబితాలో జిల్లాలో 18 నుంచి 19 వయసు ఓటర్లు 36,175 మంది ఉండగా… 40-49 ఏళ్ల వారు అత్యధికంగా 4,29,668 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.