Andhra Pradesh

News April 13, 2024

14న పెడనలో జగన్ రోడ్ షో.. షెడ్యూల్ ఇలా 

image

సీఎం జగన్ ఈ నెల 14వ తేదీన పెడనలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం 5గంటలకు నడుపూరు సెంటర్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా తోటమూల సెంటర్ చేరుకుంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం సింగరాయపాలెం, మడక, నందమూరు, ముంజులూరు, బంటుమిల్లి, పెందుర్రు, మునిపెడ మీదుగా బస్సు యాత్ర సాగనుంది. రాత్రికి కృత్తివెన్ను చేరుకుని అక్కడ బస చేస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. 

News April 13, 2024

VZM: ఒకేరోజు 123 మంది వాలంటీర్స్ రాజీనామా

image

పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం ఒక్క రోజు 123 మంది వాలంటీర్స్ రాజీనామా చేశారని అధికారులు తెలిపారు. పాచిపెంట , సీతం పేట, వీరఘట్టం, గరుగుబిల్లి, జియమ్మవలస గ్రామ వాలంటీర్స్ రాజీనామా చేస్తూ ఆయా మండలాలలో సంబంధిత అధికారులకు రాజీనామా పత్రాలను అందజేశారు. ఎన్నికల కోడ్ తో తమను దూరం పెట్టడంతో రాజీనామా చేసినట్లు వాలంటీర్స్ తెలిపారు.

News April 13, 2024

చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన వివరాలు

image

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 15న రాజాంలో సభ నిర్వహించిన అనంతరం టెక్కలి, పలాసలో జరిగే టీడీపీ ‘ప్రజాగళం’ సభకు చంద్రబాబు నాయుడు హాజరవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధినేత ఎన్నికల ప్రచారానికి వస్తుండడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

News April 13, 2024

ప్రకాశం: సముద్రంలో గల్లంతైన యువకుడు మృతి

image

దొనకొండ మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ఇర్ఫాన్ (38) అనే వ్యక్తి ఒంగోలు ఇస్లాంపేటలో నివాసం ఉంటున్నాడు. స్నేహితులతో సరదాగా కొత్తపట్నం కె.పల్లెపాలెం బీచ్ కు వచ్చి సముద్రంలో స్నానం చేస్తూ అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోతుండగా మత్స్యకారులు బయటకులాగారు. కొన ఊపిరితో ఉండగా, స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు.

News April 13, 2024

బాలకృష్ణ నేటి పర్యటన షెడ్యూల్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేపట్టనున్నారు. కదిరిలో ఉదయం 9:30 గంటలకు ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో పూజలు చేయనున్నారు. 11.30 గంటలకు దర్గాలో ప్రార్థనలు, 3 గంటలకు జమ్మిమాను సర్కిల్‌లో ప్రసంగం ఉంటుంది. 5.30 గంటలకు కదిరి నుంచి కొత్తచెరువు మీదుగా పుట్టపర్తికి చేరుకుని 6.30 గంటలకు ప్రసంగించనున్నారు.

News April 13, 2024

తిరుపతి: పోస్టల్ బ్యాలెట్ కు 22న ఆఖరు

image

ఎన్నికల విధుల్లోని ఉద్యోగులతోపాటు అత్యవసర సేవలు అందిస్తున్న విభాగాలకు చెందిన వారు వచ్చే ఎన్నికల్లో తమ ఓటును సద్వినియోగం చేసుకోవడానికి ఫెసిలిటేషన్ సెంటర్‌ని వాడుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిబంధనల మేరకు 18ఏ ప్రకారం ఓటును వినియోగించుకోవాలని కోరారు. ఈ నెల 22వ తేదీలోపు రిటర్నింగ్ అధికారికి 12డీ ఫారం అందజేయాలన్నారు.

News April 13, 2024

ఉరవకొండ మండలంలో రోడ్డు ప్రమాదం

image

ఉరవకొండ మండలం పెన్నహోబిలం సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన బొలెరో వాహనం నిలిపి మధ్యలో రాళ్లు పెట్టడంతో ఉరవకొండ నుంచి మదనపల్లికి బైక్‌పై వెళ్తున్న గిరీష్ బాబు, ఆంజనేయులు వాటిని ఎక్కించి కిందపడ్డారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బోలెరో డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

News April 13, 2024

విశాఖ: 24 వరకు సప్లిమెంటరీ దరఖాస్తులకు అవకాశం

image

ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి 24 వరకు సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని విశాఖ జిల్లా అధికారులు తెలిపారు. అలాగే రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం ఈ నెల 18 నుంచి 24 వరకు సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 1 వరకు జరుగుతాయన్నారు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో విశాఖ జిల్లా నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

News April 13, 2024

తిరుపతిలో సర్దుకున్న కూటమి నాయకులు

image

తిరుపతి అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయించినప్పటి నుంచి నెలకొన్న వివాదం ముగిసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న నాయకులకు భరోసా ఇచ్చారు. దీంతో వారు అలకతీరి శనివారం నుంచి ప్రచారం చేయనున్నారు. సుగుణమ్మ, కిరణ్ రాయల్ తో వ్యక్తిగతంగా మాట్లాడిన పవన్ వారికి భరోసా కల్పించారు. బీజేపీ నాయకులు సమావేశం కాకుండా వెళ్లి పోయారు.

News April 13, 2024

కృష్ణా: 18 నుంచి సప్లిమెంటరీ దరఖాస్తులు

image

ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి 24వరకు సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా అధికారులు తెలిపారు. అలాగే రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం ఈ నెల 18 నుంచి 24వరకు సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 1 వరకు జరుగుతాయన్నారు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.