India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు పటిష్ఠ చర్యలు చేపట్టామని కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జేసీ గోపాలకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఈనెల 11 నాటికి మొత్తం 18,17,162 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.1.30 కోట్ల విలువైన డబ్బు, మద్యం, తదితర వస్తువులను సీజ్ చేసినట్లు చెప్పారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం సమీపంలోని పెన్నానదిలో శుక్రవారం ఓ గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. అక్కడి స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వ్యక్తి వివరాల కోసం విచారణ చేపట్టినట్లు అర్బన్ సీఐ సురేష్ బాబు తెలిపారు.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయని ఆర్ఐఓ మజ్జి ఆదినారాయణ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9నుంచి 12గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు పరీక్ష ఫీజు స్వీకరణ ప్రక్రియ జరుగుతుందన్నారు. మే 1 నుంచి 4వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రయోగపరీక్షలు జరుగుతాయన్నారు.
మహానంది క్షేత్రంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న వీరయ్య ఆచారి రెండో కుమార్తె నాగలక్ష్మి ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటింది. నంద్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న నాగలక్ష్మి ఇంటర్ బైపీసీలో 910/1000 మార్కులు సాధించింది. ఈ మేరకు మహానందీశ్వరస్వామి దేవస్థానం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవిశంకర్ అవధాని, ఆలయ ఈఓ కాపు చంద్రశేఖర్ రెడ్డి, సిబ్బంది విద్యార్థిని నాగలక్ష్మిని అభినందించారు.
ఎంపీ రఘురామను లోక్‌సభ బరిలో నిలుపుదామా..? అసెంబ్లీ సీటు కేటాయిద్దామా..? అంటూ ‘కూటమి’ మల్లగుల్లాలు పడుతోంది. శుక్రవారం చంద్రబాబు, పవన్, పురందీశ్వరి భేటీలో RRR టికెట్‌పై చర్చ జరిగినట్లు సమాచారం. ‘నరసాపురం MP టికెట్ RRRకు కేటాయించి.. అక్కడి BJP ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇద్దాం’ అని చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలిసింది. అధిష్ఠానంతో చర్చిస్తామని BJP నేతలు చెప్పినట్లు సమాచారం.
నెల్లూరు జిల్లాలో ఎన్నికల సందడి ఇప్పటికే ప్రారంభం కాగా… నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభమై.. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి కానుంది. నామినేషన్ల సమయంలో ఆర్వో కార్యాలయ గేట్ నుంచి 100 మీటర్ల వరకే వాహనాలకు అనుమతి ఉంటుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. గేటు నుంచి అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఈనెల 24న టెక్కలి చేరనుంది. ఈ యాత్ర ఆ రోజే ముగియనుంది. ఈ మేరకు వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం జగన్ పర్యటన వివరాలను వెల్లడించారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సీఎం టెక్కలి రానుండడంతో పార్టీ నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
అనపర్తి టికెట్ TDPకి ఇచ్చేందుకు BJP అంగీకరించినట్లు తెలిసింది. శుక్రవారం చంద్రబాబు, పవన్, పురందీశ్వరి సమావేశమైన విషయం తెలిసిందే. అనపర్తి టికెట్ ముందు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే ఇవ్వగా.. తర్వాత BJPకి దక్కింది. అసంతృప్తి వ్యక్తం కావడంతో అనపర్తికి బదులు అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె టికెట్ BJP తీసుకోవాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం చెబుతామని BJP నేతలు అన్నారట.
చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన చైతన్య, ధర్మవరం మండలం నిమ్మలకుంటకు చెందిన మానస అనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేశారు. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వారు ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది సూపర్ వాస్మోల్ ద్రావణాన్ని తాగారు. వారిని కుటుంబ సభ్యులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది.
కమలకూరు TDP నాయకుడు మోపురి బాలకోటయ్య(37) శుక్రవారం రాత్రి గొడుగునూరు చెరువు కట్టపై ప్రమాదవశాత్తు క్రేన్ తగిలి మృతి చెందాడు. కమలకూరు రామాలయంలో శనివారం ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లకు బద్వేలు నుంచి క్రేన్‌కు ముందు దారి చూపుతూ బాలకోటయ్య మరొక వ్యక్తి బైకుపై వస్తున్నారు. దారి మధ్యలో చెరువు కట్టపై బైకు నిలపడంతో వెనుక వస్తున్న క్రేన్ ఢీ కొట్టింది. దీంతో బాలకోటయ్య మృతి చెందారు.
Sorry, no posts matched your criteria.