India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలో ఐఓబీలో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ శంకర్రావు అప్పులు చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఆర్థిక సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు నిర్ధారణకు వచ్చారు. ఇతను క్రికెట్ బెట్టింగ్‌తో పాటు ఇతర వ్యవహారాల కోసం అప్పులు చేసినట్లు విచారణలో వెల్లడైంది. పూర్తి వివరాలను త్వరలో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.
బహుజన సమాజ్ పార్టీకి సంబంధించి జిల్లాలో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి ప్రకటించారు.
* మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి : దేవరపల్లి దేవమణి
* మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థి – సౌడాడ బాలాజీ
* అవనిగడ్డ : గుంటూరు నాగేశ్వరరావు
* గుడివాడ : గుడివాడ బోసు
* పామర్రు : రాయవరపు బాబూ రాజేంద్రప్రసాద్
* పెడన : ఈడే కాశీ సుశేశ్వరరావు
* పెనమలూరు – మహేష్ యాదవ్
* గన్నవరం – సింహాద్రి రాఘవేంద్రరావు
వేసవిలో ప్రజలకు నీటి కొరత లేకుండా సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మందిరంలో సంబంధిత సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మంచినీటి పథకాలు పని చేయలేదనే ఫిర్యాదు ఒక్కటీ ఉండకూడదన్నారు. నీటి నాణ్యతను గురించి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.
ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఈవీఎం రాండమనైజేషన్ ప్రక్రియ నిర్దేశిత వైబ్ సెట్ లో పూర్తి అయిందని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఈ ఎం ఎస్ 2 వ నిర్దేశిత వెబ్ సైట్ లో మొదటి విడత ఈవీఎం రాండమనైజేషన్ ప్రక్రియ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి అయిందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్టు కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం ర్యాండమైజేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివి ప్యాట్స్, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు ర్యాండమైజేషన్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రక్రియపై రాజకీయ పార్టీలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పగడ్భంది ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు, టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, జిల్లా ఎస్సీ సిదార్థ కౌశల్ తో కలసి శుక్రవారం ఈవో ఏర్పాట్లను పరిశీలించారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియకు సంబంధించి పోటీ చేసే అభ్యర్ధులకు అవసరమైన సూచనలు సలహాలను ఇచ్చేందుకు జిల్లాలోని అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఈ నెల 15వ తేదీ నుంచి హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభవుతుందని, ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూల్ జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా ఓర్వకల్లు మండలంలోని అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రమైన పాలకొలను గ్రామాన్ని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రమైన నన్నూరు గ్రామాలను సందర్శించి పరిశీలించారు. అక్కడ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు.
విజయవాడలో సీఎం జగన్ శనివారం బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయ ప్రతినిధులు రూట్ మ్యాప్ విడుదల చేశారు. శనివారం సాయంత్రం 4.30 తాడేపల్లి నుంచి బయలుదేరి కనకదుర్గ వారధి మీదుగా బందర్ రోడ్డు, చుట్టుగుంట, సంగీత కళాశాల, బుడమేరు వంతెన, ప్రకాష్ నగర్, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరులో బస్సు యాత్ర నిర్వహిస్తారన్నారు. అనంతరం రాత్రి 7:30కు కేసరపల్లిలో బస చేస్తారు.
లొంగిపోయిన మావోయిస్టులు ప్రభుత్వం కల్పించిన అన్ని పునరావాస సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని, సమాజంలో ఉన్నత జీవనం సాగించాలని జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఆకాంక్షించారు. శుక్రవారం పాడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో 86 మంది మాజీ మావోయిస్టులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరిగి మావోయిస్టు పార్టీలో చేరడం కానీ, ఆ పార్టీకి సహాయ సహకారాలు అందించడం కానీ చేయమని మాజీ మావోయిస్టులు ప్రతిజ్ఞ చేశారు.
Sorry, no posts matched your criteria.