India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాధారణ ఎన్నికల నిర్వహణలో లోపాలు, నిర్లక్ష్యం లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు శిక్షణను సద్వినియోగం చేసుకోని సమర్ధంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రిసైడింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్వతీపురం నియోజకవర్గ ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం సందర్శించారు.
తాగునీటి చెరువులను నాగర్జున సాగర్ కుడి కాలువ, కృష్ణ వెస్ట్రన్ డెల్టా కాలువకు విడుదల చేసిన నీటి ద్వారా 100% నింపాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం అధికారులతో తాగునీటి సరఫరాపై కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉంటే ముందుగానే తెలియజేయాలన్నారు.
జిల్లా ప్రజలందరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఓటు అనే రెండక్షరాలు దేశ చరిత్రనే మార్చేస్తుందని, ఓటు వేయడం మీ హక్కు మాత్రమే కాదని, మీ బాధ్యత కూడా అని జిల్లా కలెక్టర్ డా జి.సృజన పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆధ్వర్యంలో ‘నేను తప్పక ఓటు వేస్తాను’ అనే స్లోగన్‌తో పాటు మోడల్ ఈవిఎమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
గుడివాడలో ఈ నెల 14న సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఇందుకోసం ఏలూరు రోడ్ నాగవరప్పాడు వైఎస్సార్ కాలనీకి సమీపంలో సభ ఏర్పాటు చేస్తున్నారు. 2 రోజులుగా పనులు వేగంగా సాగుతున్నాయి. సిద్ధం సభలో జగన్ ప్రసంగించనున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు జనసమీకరణ చేస్తున్నారు.
సూళ్లూరుపేటలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన బస్సు, కంటైనర్ లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఇవాళ రాత్రి మల్లం గ్రామం నుంచి మాంబట్టు సెజ్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో నైట్ డ్యూటీకి ఉద్యోగులతో వెళ్తున్న బస్సు టర్నింగ్ తిరిగే క్రమంలో వెనక నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఘటనలో బస్సులోని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూళ్లూరుపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి రోజు వారి నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు పంపించాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఎన్నికల నివేదికల సమర్పణ, సీ విజిల్, సువిధ యాప్, కంట్రోల్ రూమ్ నిర్వహణ, తదితర అంశాలపై కంట్రోల్ రూమ్ నుంచి రోజు వారి నివేదికలను కమిషన్‌కు పంపించాలని తెలిపారు.
పలాస మండలం కిష్టుపురం గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బుర్లె జగ్గారావు శుక్రవారం ఉదయం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. దివంగత నేత అప్పయ్య నుంచి నేటి తరం రాజకీయ నాయకులతో పాటు పరోక్ష రాజకీయాల్లో పాలు పంచుకుంటూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన మరణ వార్త విన్న సమీప గ్రామ ప్రజలు, ఆయన వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు వేలాదిమంది తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
2024వ సంవత్సరం మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలలో పార్వతీపురం మన్యం జిల్లాలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని జిల్లా వృత్తి విద్యాధికారిని డి. మంజులవీణ తెలిపారు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులు విభాగంలో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో” ప్రథమ స్థానం”లో నిలిచిందని, జనరల్ కోర్సులలో 11వ స్థానంలో ఉందని తెలిపారు.
ఇంటర్మీడియట్ ఫలితాలలో నంద్యాల జిల్లాలో బాలికల హవా కొనసాగింది. ఫస్ట్ ఇయర్ ఫలితాలలో 6,547 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 4,252 మంది ఉత్తీర్ణత సాధించి 66 శాతంతో మొదటి స్థానంలో నిలిచారు. సెకండ్ ఇయర్‌లో 5,211 విద్యార్థినులు పరీక్ష రాయగా.. 3,947 మంది ఉత్తీర్ణత సాధించి 76 శాతంతో మరోసారి విజయకేతనాన్ని ఎగురవేశారు. రాష్ట్రస్థాయి ఫలితాల పట్టికలో నంద్యాల జిల్లా 19వ స్థానంలో నిలిచింది.
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం కుర్లపల్లి మిద్దెలలో శుక్రవారం ఫుడ్ పాయిజన్‌తో 90 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో రాముడి గుడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదానంలో ఫుడ్ పాయిజన్‌తో 50 మంది విద్యార్థులతో పాటు మరో 40 మందికి పైగా గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.