India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గడ్డి మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన కొమరాడ మండలం మాదలంగి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై నీలకంఠం తెలిపిన వివరాల ప్రకారం.. మాదలంగి గ్రామానికి చెందిన అధికారి వెంకటేశ్ (32) మద్యానికి బానిసై రోజు మద్యం తాగేవాడు. కుటుంబ సభ్యులు మందలించారని మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు.
వేసవి నేపథ్యంలో సీజనల్ పండ్లకు గిరాకీ పెరిగింది. ఉమ్మడి తూ.గో. జిల్లాలో ప్రధానంగా పుచ్చకాయల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాజానగరం, దివాన్ చెరువు, రావులపాలెం, అమలాపురం, కాకినాడల్లోని ఉపకేంద్రాల్లో ఈ వ్యాపారం జోరందుకుంది. జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారు 2టన్నుల మేర పండ్ల అమ్మకాలు సాగుతుండగా రూ.కోట్లలో టర్నోవర్ లభిస్తోంది. సపోటా, రామాఫలం, గులాబీ జామ్, చింతకాయలపల్లి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.
అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ జిల్లా కేంద్రంలోని పాత ఆర్డీఓ ఆఫీసులో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. శింగనమల, అనంతపురం అర్బన్, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు భద్రపరచనున్న స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, జూనియర్ కళాశాల, సుబీన్ కళాశాలను పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ, డీఎస్పీ పాల్గొన్నారు.
దర్శి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 18వ తేదీన ఉదయం 9 గంటలకు నామినేషన్ వేయనున్నట్లు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. తనపై నమ్మకంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బూచేపల్లి కుటుంబం రుణపడి ఉంటామన్నారు. తనను ఆశీర్వదించేందుకు మహిళలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్నికల విధులకు కేటాయించిన 12,000 మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్టు సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణ లక్ష్యంతో సంబంధిత అధికారులు పనిచేయాలన్నారు.
ఇంటర్మీడియట్ ఫలితాలలో కర్నూలు జిల్లాలో మరోసారి బాలికల హవా కొనసాగింది. ఫస్ట్ ఇయర్ ఫలితాలలో 10,037 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 7,406 మంది ఉత్తీర్ణత సాధించి 74 శాతంతో మొదటి స్థానంలో నిలిచారు. సెకండ్ ఇయర్ ఫలితాలలో 8,826 విద్యార్థినులు పరీక్ష రాయగా.. 7,147 మంది ఉత్తీర్ణత సాధించి 81 శాతంతో మరోసారి విజయకేతనాన్ని ఎగురవేశారు. ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విభాగంలో 70%, సెకండ్ ఇయర్‌లో 74 శాతంతో నిలిచారు.
ఉమ్మడి ప.గో. జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 14న పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ప.గో. జిల్లాలో 2 మండలాల్లో, ఏలూరు జిల్లాలోని 5 మండలాల్లో వడగాలులు ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఉమ్మడి తూ.గో.జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 13, 14వ తేదీల్లో పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. 13న తూ.గో. జిల్లాలోని 6, కాకినాడ జిల్లాలో 5 మండలాల్లో వడగాలులు ఉంటాయని తెలిపింది. 14న తూ.గో జిల్లాలో 18 మండలాలు, కాకినాడ జిల్లాలో 11 మండలాలు, కోనసీమలో 9 మండలాల్లో ఈ ప్రభావం ఉండనున్నట్లు తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఎన్నికల వేళ ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ అమిత్ బర్దర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆత్మకూరు మండలం పంపనూరులో శుక్రవారం కేంద్ర సాయుధ బలగాలచే నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్‌లో ఎస్పీ పాల్గొన్నారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలే తమ లక్ష్యమన్నారు. నిర్భయంగా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంత ఎన్నికలకు అందరూ సహకరించాలని కోరారు. గొడవలు, అల్లర్లకు దూరంగా ఉండాలని సూచించారు.
నంద్యాల జిల్లా కేంద్రంలోని టెక్కే మార్కెట్ యార్డులో భద్రపరిచిన ఈవీఎంల గోడౌన్‌ను నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను అధికారులు చేపట్టారు. నియోజకవర్గాల వారిగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.