India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నియోజకవర్గం మారడంపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ చేసిన వ్యాఖ్యలపై గంటా శ్రీనివాసరావు స్పందించారు. రాజకీయాల్లో పార్టీ అధిష్ఠీన వర్గం చెప్పినట్లు నడుచుకోవాలనే కనీస పరిజ్ఞానం సుబ్బారెడ్డికి లేదా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. వైసీపీలో ఎంతమంది ఎమ్మెల్యేలను స్థానాలు మార్చి పోటీ చేయిస్తున్నారో ఆయనకు తెలియదా అన్నారు. YCP నేతలు ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే డిపాజిట్లు రాకుండా ఓడిపోతారని కౌంటర్ ఇచ్చారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎస్ఎంవి బెంగళూరు ఖరగ్ పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ రైల్వే డీసీఎం త్రిపాఠి తెలిపారు. ఈనెల 12 నుంచి 17 వరకు నడిచే ఈ రైలు మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి దువ్వాడ మీదుగా ఖరగ్ పూర్ చేరుకుంటుందన్నారు. ఈనెల 15 నుంచి 20 వరకు నడిచే ఖరగ్ పూర్-ఎస్ఎంవి బెంగళూరు ప్రత్యేక రైలు సాయంత్రం నాలుగు గంటలకు ఖరగ్ పూర్‌లో బయలుదేరుతుందన్నారు.
నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో విద్యార్థిని మనస్తాపం చెంది ఉరేసుకుంది. మృతురాలు ఇంటర్ సెకండియర్ చదువుతున్న అర్చనగా గుర్తించారు.
శ్రీశైలం మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. మండల అధ్యక్షుడు, బీసీ సంఘం కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు, బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జింకా గుండయ్య యాదవ్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం ఆయన గృహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సమక్షంలో తన అనుచర గణంతో టీడీపీలో చేరారు. నియోజకవర్గం నుంచి రాజన్న భారీ మెజార్టీతో గెలుస్తారని గుండయ్య ధీమా వ్యక్తం చేశారు.
వడదెబ్బపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో వడగాలులు- వేసవి యాక్షన్ ప్రణాళిక -నీటి సరఫరా, తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వడదెబ్బ నేపథ్యంలో ఏం చేయాలో ఐఈసీ మెటీరియల్‌పై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా.. అంగన్వాడీ కేంద్రాలలో కుండలు ఏర్పాటు చేయాలన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల మన పార్టీ కార్యకర్తలని అన్నారు. నామినేషన్ రోజు 25 మంది వాలంటీర్లను తీసుకురావాలని కోరారు. వాలంటీర్లను రాజీనామాలు చేయించండి అని కార్యకర్తలకు సూచించారు. వాలంటీర్లతో పని చేయించాలని జిల్లాలోని ఆ పార్టీ కేడర్‌కు సూచించారు. మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు రోడ్డులో ఉన్న బాలికల ప్రభుత్వ బీసీ హాస్టల్ భవనం పైకప్పు గురువారం రాత్రి 11 గంటలకు కుప్పకూలింది. అయితే విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ హాస్టల్లో సుమారు 42 మంది విద్యార్థినులు ఉంటున్నారు. పాత చౌడు మిద్దెలో హాస్టల్‌ను అధికారులు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ మురళీధర్, త్రీ టౌన్ సీఐ వెంకటరమణ అక్కడికి చేరుకుని ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలోని కొడవలూరు మండలం నార్త్ రాజు పాలెంకు చెందిన భయ్యా రాణి అనే యువతిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9వ తేదీ ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఊచగుంటపాలెంకు చెందిన కొత్తూరు అనుప్ అనే వ్యక్తి ఆమెను బంగారం కోసం పెట్రోల్ పోసి తగలబెట్టాడని పోలీసులతో చెప్పారు. జువ్వలదిన్నె తిప్పలేరు కాలువ వద్ద ఆమె శవం లభించింది.
మండపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థిని మారుస్తారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో అమలాపురంలోని కిమ్స్‌లో మండపేట జనసేన ఇన్‌ఛార్జి వేగుళ్ళ లీలాకృష్ణ, ఎమ్మెల్యే జోగేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారితో మాట్లాడారు. మండపేట కూటమి అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావే ఉంటారని స్పష్టం చేశారు. లీలాకృష్ణ రాజకీయ భవిష్యత్తును అధికారంలోకి రాగానే చూసుకుంటామన్నారు.
మాజీ ఎంపీపీ, సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, వైసీపీ నాయకుడు అడబాల సూర్యనారాయణ (బాబ్జీ)కి సతీవియోగం కలిగింది. ఆయన భార్య రామలక్ష్మి అనారోగ్యంతో (45) గురువారం రాత్రి మృతి చెందారు. ఆమె మృతి పట్ల ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.