India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మొదటి విడత ఇవిఎం రెండమనైజేషన్ ప్రక్రియ నిర్దేశిత వెబ్సైట్లో పూర్తి అయిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జీలాని సమూన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఈ.యమ్.ఎస్ 2.ఓ నిర్దేశిత వెబ్సైట్లో మొదటి విడత ఇవిఎం రెండమనైజేషన్ ప్రక్రియ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు..
వావిలాల గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గ్రంథాలయ శాస్త్ర సర్టిఫికెట్ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ ప్రిన్సిపల్ డి.రాంబాబు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై 18 ఏళ్ల వయసు నిండిన అభ్యర్థులు కోర్సులో చేరేందుకు అర్హులని తెలిపారు. దరఖాస్తు కోసం గుంటూరులోని అరండల్ పేట 12/3లోని సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
నెల్లూరులో గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 25,535 మందికి 17042 మంది పాసయ్యారు. 67 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. ఈసారి 24,620 మందికి 17,100 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం(69) పెరిగినా 8వ స్థానానికి పడిపోయింది. అలాగే సెకండ్ ఇయర్‌లో గతేడాది 22,789 మందికి 17,438 మంది పాసయ్యారు. 77 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానంలో ఉండగా.. ఇవాల్టి ఫలితాల్లో 81 శాతంతో 6వ స్థానానికే పరిమితమైంది.
☛ 2020లో ఇంటర్ మొదటి సంవత్సరం 47 శాతం.. ☛ 2020లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 53 శాతం ఉత్తీర్ణత ☛ 2021 అకడమిక్ ఇయర్‌లో కరోనా కారణంగా 100 శాతం ఉత్తీర్ణత ☛ 2022లో ఇంటర్ మొదటి సంవత్సరం 41 శాతం.. ☛ 2022లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 50 శాతం ఉత్తీర్ణత ☛ 2023లో ఫస్టియర్ 46 శాతం, సెకండియర్ 60 శాతం ఉత్తీర్ణత ☛ 2024లో ఫస్టియర్ 55 శాతం, సెకండియర్ 69 శాతం ఉత్తీర్ణత
ఇంటి నిర్మాణానికి తెప్పించుకున్న ఇసుక లోడ్‌లో మృతదేహం రావడం కలకలం రేపింది. చీరాల మండలం ఈపూరుపాలెంలో మాజీ ప్రజా ప్రతినిధి పద్మనాభునిపేటలో నిర్మిస్తున్న కొత్త ఇంటికి అవసరమైన ఇసుకకు ఆర్డర్ ఇవ్వగా శుక్రవారం ఉదయం లోడ్ వచ్చింది. ఇసుకను దింపుతుండగా అందులో తల లేని ఒక యువకుడి మృతదేహం బయటపడడంతో అందరూ భయభ్రాంతులయ్యారు. ఎలా ఇసుకలోకి ఈ మృతదేహం వచ్చిందో ఎవరికి అంతు పట్టడం లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ఉభయ గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారిన అనపర్తి, ఉండి టికెట్లపై త్వరలో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో లోకేశ్, జనసేన అధినేత పవన్, బీజేపీ స్టేట్ చీఫ్ పురందీశ్వరి, సిద్ధార్థ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ప్రచార శైలి, భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. వీటితో పాటు అనపర్తి, ఉండి టికెట్లపైనా ఈ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఉభయ గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారిన అనపర్తి, ఉండి టికెట్లపై త్వరలో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో లోకేశ్, జనసేన అధినేత పవన్, బీజేపీ స్టేట్ చీఫ్ పురందీశ్వరి, సిద్ధార్థ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ప్రచార శైలి, భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. వీటితో పాటు అనపర్తి, ఉండి టికెట్లపైనా ఈ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
VZM : వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎంతో విలువైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి కోరారు. మే 13న జరిగే ఎన్నికలకు జిల్లాలో ఏర్పాట్లు వేగవంతం చేసినట్లు ఆమె తెలిపారు. కలెక్టరేట్ పోర్టికోవద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను కలెక్టర్ నాగలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్బంగా కొత్తగా ఓటు హక్కు పొందేందుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉందన్నారు.
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఐ దాడి మోహన్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం రాజాం మండలం పొగిరి చెక్ పోస్ట్ వద్ద పాలకండ్యం నుంచి రాజాం వెళ్తున్న కారులో తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.5,23,300 గుర్తించారు. సంబంధిత నగదుకు ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హోం ఓటింగ్ కు సానుకూలంగా ఉన్న 85 సంవత్సరాలు పైబడిన, అలాగే దివ్యాంగ ఓటర్ల వివరాలను ఆయా ఆర్వోలకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఏ ఒక్కరు కూడా ఓటు వేయలేక పోయామని బాధపడే పరిస్థితి ఉండకూడదన్నదే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం సంబంధిత అధికారులకు ఒరియంటేషన్ కార్యక్రమం నిర్వహించి, అవగాహన కల్పించారు.
Sorry, no posts matched your criteria.