India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మైదుకూరు నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 1000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2642 ఓట్లకు గాను పుట్టా సుధాకర్ యాదవ్ 1600 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్. రఘురామిరెడ్డి పోస్టల్ బ్యాలెట్‌లలో వెనుకంజలో పడ్డారు.

విజయవాడలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి కేశినేని నాని కంటే ముందంజలో ఉన్నారు.

రాజమండ్రి సిటీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్‌పై 3వేలకు పైగా ఓట్లతో ముందంజలో ఉన్నారు. అమలాపురంలో అయితాబత్తుల ఆనందరావు ముందంజలో కొనసాగుతున్నారు.

కడప జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో కడప పార్లమెంట్ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి 2,274 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

పల్నాడులో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కంటే 509 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. మొత్తంగా లావుకు 4,103 ఓట్లు, అనిల్‌కు 3,594 ఓట్లు పోలయ్యాయి.

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందీశ్వరి లీడ్‌లో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో పురందీశ్వరి 1973 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి గూడురు శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి గుడిగు రుద్రరాజు తదితరులు పోటీలో ఉన్నారు.
➠ 1వ రౌండ్‌లో ఓట్లు ఇలా..
➢ పురందీశ్వరి: 1973
➢ చెల్లుబోయిన: 4195
➢ మురళీధర్: 371
➠ 2వ రౌండ్ ముగిసే సరికి పురందీశ్వరి 1973 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌లో భాగంగా నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ముందంజలో కొనసాగుతున్నారు. 113 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. నంద్యాలలోని శాంతిరాం, ఆర్జీఎం కాలేజీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన స్వర్గీయ జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ బాలయోగి అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా పనిచేసిన యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఇద్దరిలో విజయం ఎవరిని వరిస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

పిఠాపురంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువగా చెల్లని ఓట్లు నమోదైనట్లు తెలుస్తుంది. ఇక్కడ వంగా గీత వైసీపీ నుంచి బరిలో ఉండగా.. రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గంపైనే ఫోకస్ ఉంది.

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి చెల్లుబోయిన గోపాలకృష్ణ కాంగ్రెస్ నుంచి మురళీధర్ తదితరులు పోటీలో ఉన్నారు.
➠ 1వ రౌండ్‌లో ఓట్లు ఇలా..
➢ గోరంట్ల బుచ్చయ్య: 5795
➢ చెల్లుబోయిన: 4885
➢ మురళీధర్: 127
➠ 1వ రౌండ్ ముగిసే సరికి గోరంట్ల 910 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.