India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం ఎనిమిది నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

చిత్తూరు జిల్లా ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పలువురు వైసీపీ నాయకులు, అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తిరుపతిలోని తన నివాసంలో ఉన్నారు. ప్రస్తుతం అక్కడి నుంచే ఆయన ఫలితాలపై ఆరా తీస్తున్నారు. ఈక్రమంలో పలువురు నాయకులు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు.

ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధి ఈసీఈ బ్లాక్‌లో ఏర్పాటుచేసిన పార్లమెంటు పోస్టల్ బ్యాలెట్ల స్ట్రాంగ్ రూమ్ ను నిబంధనల ప్రకారం మంగళవారం ఉదయం 6.30 గంటలకు తెరిచారు. అందులో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులు ప్రత్యేక వాహనం ద్వారా ఎస్కార్ట్ సాయంతో ఈసీఈ బ్లాక్‌లో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. అభ్యర్థులు, ఏజెంట్లు, ఇతర అధికారుల సమక్షంలో కలెక్టర్ మల్లికార్జున ఈ ప్రక్రియ నిర్వహించారు.

విడవలూరులో రెండు వర్గాలు బాహాటంగా కత్తులతో దాడి చేసుకున్న ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఘర్షణలో పులి శ్రీకాంత్ అనే యువకుడిని గౌతం అనే వ్యక్తి కత్తితో పొడిచారు. తీవ్ర రక్తస్రావం కావడంతో గాయపడిన పులి శ్రీకాంత్ ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరిస్తూ మంగళవారం ఉదయం 5.00 గంటలకు టేబుళ్ల వారీ కౌంటింగ్ సిబ్బందిని కేటాయిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ పరిశీలకులు అమిత్ శర్మ, ఇతర పరిశీలకుల సమక్షంలో ఏయూ పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్వో రూమ్ నుంచి ఆయన మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు.

శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు మొత్తం 49,176 గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక పోస్టల్ బ్యాలెట్లు నమోదైన జిల్లాగా సిక్కోలు పేరు నమోదు చేసుకుంది. మరో అరగంటలో ప్రారంభంకానున్న కౌంటింగ్ ప్రక్రియకు మొత్తం 1996 మంది శ్రమించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగకుండా జిల్లా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు.

తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటలకు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూము తలుపులు తెరుచుకున్నాయి. పూర్తిస్థాయి సీసీ కెమెరాలు, వీడియో, ఫోటో రికార్డింగ్ నడుమ ఓపెన్ చేశారు. మరికాసేపట్లో ఈవీఎంలను ఓపెన్ చేసి ఓట్లు లెక్కిస్తారు.

విజయవాడ డివిజన్ పరిధిలో నిర్వహణ పనులు జరుగుతున్నందున కింది రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు జూలై 14 వరకు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది.
*నం.07464 విజయవాడ- గుంటూరు
*నం.07465 గుంటూరు- విజయవాడ
*నం.07976 గుంటూరు- విజయవాడ

సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు మరికొద్ది సేపట్లో తెలియనున్నాయి. ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు 9 మంది రిటర్నింగ్ అధికారులు, 77 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 492 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 582 మంది కౌంటింగ్ అసిస్టెంట్‌లు, 397మంది మైక్రో అబ్జర్వర్లు, 439 మంది క్లాస్-4 ఉద్యోగులు మొత్తం 1996 మంది సిబ్బంది ఎటువంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 3 పార్లమెంటు స్థానాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 42 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలోని కాకినాడ, అమలాపురం పార్లమెంటు నుంచి 15 మంది వంతున మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ స్థానానికి 12 మంది పోటీలో నిలిచారు.
Sorry, no posts matched your criteria.