Andhra Pradesh

News September 23, 2025

వర్షం ఎఫెక్ట్.. బాపట్ల బీచ్ ఫెస్టివల్ వాయిదా.!

image

బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో ఈనెల 26-28 తేదీల్లో జరగాల్సిన బీచ్ ఫెస్టివల్‌ను ప్రభుత్వం వాయిదా వేసింది. AP ప్రకృతి విపత్తు నిర్వహణ సంస్థ 26, 27 తేదీల్లో బాపట్ల జిల్లాకు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఫెస్టివల్ వాయిదా వేసినట్లు ప్రకటించారు. జిల్లా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మళ్లీ నిర్వహించే తేదీని ఖరారు చేయాల్సిఉంది.

News September 23, 2025

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ప్రకాశం ఎస్పీ

image

ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతిని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తికి మొక్కను ఎస్పీ అందజేశారు. అనంతరం బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా పోలీస్ శాఖ తరపున కృషి చేయనున్నట్లు జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.

News September 23, 2025

విజయవాడ శాసనసభా ప్రాంగణంలో మహిళా MLAలు

image

అనంతపురం జిల్లా మహిళా MLAలు AP అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. రాప్తాడు MLA పరిటాల, పుట్టపర్తి MLA పల్లె సింధూర రెడ్డి, మంత్రి సవిత శాసనసభ ప్రాంగణంలో జ్ఞాపకంగా ఫోటో తీసుకున్నారు. శింగనమల నియోజకవర్గం MLA బండారు శ్రావణి శ్రీ మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.

News September 23, 2025

నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో విరిగిన కుర్చీలు..

image

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కనీస వసతులు కూడా ఉండడం లేదు. రోగులు, వారి అటెండర్లు కూర్చునేందుకు కుర్చీలు సైతం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులు కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు విరిగిపోయి, నిరుపయోగంగా ఉన్నాయి. ఆసుపత్రి ఓపీ బ్లాక్‌లో నడిచే మార్గంలో ఉన్న చాలా కుర్చీలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. విరిగిన కుర్చీలకు మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు.

News September 23, 2025

కర్నూలు రైల్వే స్టేషన్‌లో తనిఖీలు

image

కర్నూలు రైల్వే స్టేషన్‌లో టౌన్ డీఎస్పీ బాబుప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ప్రయాణికుల బ్యాగుల్లో డ్రగ్స్, మాదకద్రవ్యాలు ఉన్నాయా అని స్నిఫర్ డాగ్స్‌తో తనిఖీలు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల నుంచి డ్రగ్స్ అక్రమంగా రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు తనిఖీలు చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే 1972 టోల్ ఫ్రీకి సమాచారం ఇవ్వాలన్నారు.

News September 23, 2025

అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ నిషేధం తప్పనిసరి: కలెక్టర్

image

ప.గో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ దేవాలయాలలో అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ నిషేధం తప్పనిసరి అని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్‌ను వినియోగించరాదని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలలో ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించకుండా జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

News September 23, 2025

ఎచ్చెర్ల: ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఆందోళన చెందవద్దు

image

ఫీజు రియంబర్స్మెంట్ పై కళాశాలల యజమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, జిల్లా సాంఘిక సంక్షేమ సంచాలకులు మధుసూదన్ రావు అన్నారు. ఈ మేరకు అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్‌తో, ఎచ్చెర్ల‌లోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో సోమవారం సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు విడతల వారిగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు త్వరలో చెల్లింపునకు, రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన ఆయన పేర్కొన్నారు.

News September 23, 2025

ఆపరేషన్ లంగ్స్ 2.O ఎవరికీ వ్యతిరేకం కాదు: కమిషనర్

image

ఆపరేషన్ లంగ్స్ 2.O ఎవరికీ వ్యతిరేకం కాదని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. నగర ప్రజల ఆరోగ్యం, భద్రత సౌకర్యం కోసం దీన్ని ప్రారంభించామన్నారు. వీధి వ్యాపారులకు క్రమబద్ధమైన జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వాటి ద్వారా వారికి ఆదాయం పొందే అవకాశం కల్పిస్తామన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగరాన్ని తీర్చిదిద్దడమే దీని లక్ష్యమని వివరించారు.

News September 23, 2025

VZM: శ్రీ పైడితల్లిని దర్శించుకున్న ఎస్పీ

image

జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎ.ఆర్.దామోదర్ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ అధికారులు, వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం అందించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మూడు లాంతర్లను సందర్శించి సిరిమాను తిరిగే ప్రాంతాన్ని పరిశీలించారు.

News September 23, 2025

రాజమండ్రి: నేరాల కట్టడికి డ్రోన్‌తో నిఘా

image

జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం, గంజాయి వినియోగం వంటి నేరాలను కట్టడి చేయడానికి జిల్లావ్యాప్తంగా నిర్మానుష్య ప్రదేశాలలో ఈ ప్రత్యేక నిఘా కొనసాగుతుందని సోమవారం పోలీసులు తెలిపారు.