India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు జిల్లాను పట్టిపీడిస్తున్న సమస్యలెన్నో. గుంతల రోడ్లు, పొంగే డ్రైనేజీలు, తాగునీటి కష్టాలు, ట్రాఫిక్ నరకం.. జనం నిత్యం అవస్థలు పడుతున్నారు. మరి మీకు ఒక్కరోజు సమస్య పరిష్కరించే అధికారం దక్కితే.. వీటిలో ఏ సమస్యను అత్యవసరంగా పరిష్కరిస్తారు? మీ ప్రాధాన్యత ఏంటి? రోడ్లా? నీళ్లా? డ్రైనేజీనా? మీ మనసులో మాట చెప్పండి! ఈ ఒక్కరోజు ఛాన్స్ మీకైతే.. పట్టణ రూపురేఖలు ఎలా మారుస్తారు? కామెంట్ చేయండి.

వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో తిరుపతి స్థానికులకు అన్యాయం జరిగిందని.. మొదటి మూడు రోజులు దర్శనాలు కల్పించి ఉంటే బాగుండేదని తిరుపతికి చెందిన చంద్రశేఖర్ డయల్ యువర్ TTD ఈవోలో కోరారు. ‘వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు పవిత్రమైనవే. అందరినీ దృష్టిలో పెట్టుకుని, స్థానికులకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతోనే చివరి మూడు రోజులు దర్శనాలకు కేటాయించాం. స్థానికులపై చిన్న చూపు లేదు’ అని ఈవో అనిల్ సింఘాల్ సమాధానమిచ్చారు.

కడప జిల్లాలో 51,961 మంది రేషన్ కార్డుదారుల ఆచూకీ లేదు. దీంతో వారికి పంపిణీ చేయాల్సిన కార్డులు మిగిలిపోయాయి. జిల్లాకు 5,73,675 స్మార్ట్ కార్డులు రాగా వీటిలో 5,21,714 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. కడపలో 15,732, బద్వేల్‌లో 12,223, జమ్మలమడుగులో 18,906, పులివెందుల డివిజన్‌లో 5,100 కార్డులు మిగిలిపోయాయి. కార్డుల్లో ఉన్న అడ్రస్సుల్లో లబ్ధిదారులు లేకపోవడంతో వాటిని అధికారులు పంపిణీ చేయలేదు.

జిల్లాలో స్క్రబ్ టైఫస్‌పై ప్రజల్లో భయం అవసరం లేదని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. వైద్యశాఖ అధికారులు, సిబ్బందితో శుక్రవారం తన ఛాంబర్‌లో టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఇది పూర్తిగా నయం అయ్యే వ్యాధని, లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ప్రజలు భయపడకుండా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం ఒంగోలు జిల్లా కాస్త ప్రకాశం జిల్లాగా మారింది నేడే. 1970లో జిల్లా ఏర్పడగా, 1972 డిసెంబర్ 5న స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి CM టంగుటూరి ప్రకాశం పంతులు పేరున జిల్లాకు నామకరణం చేశారు. నాగులుప్పలపాడు(M) వినోదరాయునిపాలెంలో జన్మించిన ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ మహనీయుడి పేరున ఏర్పడ్డ జిల్లా వాసులుగా గర్విద్దాం.. ఆయన సేవలను కొనియాడుదాం!

కృష్ణా విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్ధుల కోసం ఈ నెల 8వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఎల్. సుశీల ఓ ప్రకటనలో తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షకు హాజరు కానీ వారు, అర్హత సాధించని వారు కూడా అర్హులేనని తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో తమ సర్టిఫికెట్లతో ఈ నెల 8వ తేదీన అభ్యర్ధులు స్వయంగా రిపోర్ట్ చేయాలన్నారు.

తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన మెగా PTM 3.0ను కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అన్నదేవరపేట ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్, అన్నదేవరపేట ప్రభుత్వ హైస్కూల్, వేగేశ్వరపురం ప్రభుత్వ హైస్కూల్‌లను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్.. ఒత్తిడికి లోనుకాకుండా చదవాలని, వెనుకబడిన సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యువజన ఉత్సవాలను ఈ నెల 8, 9, 10 తేదీలలో జరుగుతాయని యువజన ఉత్సవాల కోఆర్డినేటర్ మురళీమోహన్ తెలిపారు. 6వ తేదీ నుంచి ప్రారంభించాల్సిన ఉత్సవాలను విద్యార్థుల అభ్యర్థన మేరకు 8వ తేదీకి మార్చినట్లు తెలిపారు. మ్యూజిక్, డాన్స్, లిటరరీ ఈవెంట్స్, థియేటర్, ఫైన్ ఆర్ట్స్ వంటి అంశాలలో పోటీలు ఉంటాయని చెప్పారు. వర్సిటీలోని కళాశాలలతో పాటు, అనుబంధ కళాశాల విద్యార్థులు పాల్గొనాలని కోరారు.

జిల్లాలో వేసవికాలంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. చేతి పంపులు, రక్షిత నీటి పథకాలు, పైపులైన్ల లీకేజీలు తదితర మరమ్మత్తులను డిసెంబర్ 20 లోపు పూర్తి చేయాలని ఆమె స్పష్టంచేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పూర్తిగా నింపాలన్నారు. గ్రామాలలో చిన్నపాటి మరమ్మతులను చేయాలని ఆదేశించారు.

రణస్థలం మండలం పైడిభీమవరం మెగా పీటీఎం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని అన్నారు. అనంతరం వల్లభరావుపేట, సంచాం, కొండములగాం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. స్థానిక రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారానే మిల్లర్లకు ధాన్యం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఏఓ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.