Andhra Pradesh

News June 3, 2024

3000 మంది సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు: సీపీ రామకృష్ణ

image

3000 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ సీపీ రామకృష్ణ తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో రేపు ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ అధికారులకి, సిబ్బందికి సీపీ దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం జారీ చేసిన కౌంటింగ్ పాసులు ఉన్నవారికి మాత్రమే లోపలకి అనుమతిస్తామని స్పష్టం చేశారు.

News June 3, 2024

ఏలూరు జిల్లాలో రేపు లోకల్ హాలిడే

image

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏలూరు కలెక్టర్ వై.ప్రసన్న వెంకటేష్ జిల్లాలో రేపు లోకల్ హాలిడే ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా ఎటువంటి అసాంఘిక సంఘటనలు, అల్లర్లకు తావు లేకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమని.. ఎదుటి పార్టీపై కవ్వింపు చర్యలు, దుష్ప్రచారాలు చేస్తే చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News June 3, 2024

రైల్వేకోడూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేటకు చెందిన అన్నమయ్య(32) బైక్‌ అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మరణించారు. పుల్లంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News June 3, 2024

చిత్తూరు: కౌంటింగ్ ఏర్పాట్లు సమీక్షించిన ఐజి

image

ఎస్వి సెట్‌లో మంగళవారం జరగనున్న కౌంటింగ్ ఏర్పాట్లను చిత్తూరు, తిరుపతి జిల్లాల కౌంటింగ్ ఇన్చార్జి, ఐజి మోహన్ రావు సమీక్షించారు. కౌంటింగ్ గదులను అధికారులతో కలిసి పరిశీలించి పరిస్థితులను తెలుసుకున్నారు. కాలేజీ పరిసరాలు, పార్కింగ్, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్ రూములు, మీడియా పాయింట్ పరిశీలించారు. ఆయన వెంట ఎస్పీ మణికంఠ ఉన్నారు.

News June 3, 2024

గూడూరులో బాలికపై యువకుడి అత్యాచారయత్నం

image

ఓ బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేసిన ఘటన గూడూరులో చోటు చేసుకుంది. స్థానికులు వివరాలు ప్రకారం.. గూడూరుకు చెందిన ముస్లిం బాలిక(9)పై ఓ యువకుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 3, 2024

విజయవాడ మీదుగా ప్రయాణించే రైళ్ల దారి మళ్లింపు 

image

ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ కారణంగా చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వచ్చే జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను(నం.12077) దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారాలు మినహా జూలై 14 వరకు ఈ ట్రైన్ న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా కాక తెనాలి, దుగ్గిరాల, కృష్ణా కెనాల్ స్టేషన్ల మీదుగా విజయవాడ చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరుతూ.. తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News June 3, 2024

అనంత: విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా

image

మండల కేంద్రమైన నార్పల కొండ వంక ప్రాంతంలో నివాసం ఉంటున్న నారాయణస్వామి మనవడు రాజేశ్, గ్రామానికి సమీపంలో తోటలోకి సోమవారం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడు రాజేశ్ ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి అయిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు దుఃఖంతో ఆవేదన చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 3, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనులు జరుగుతున్నందున కింది రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు జూన్ 30 వరకు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని తెలియచేస్తూ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
*నం.07767 రాజమండ్రి- విజయవాడ
*నం.07459 విజయవాడ- రాజమండ్రి

News June 3, 2024

కడప: రేపు మద్యం దుకాణాలు బంద్

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మంగళవారం కడప జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్లను మూసివేస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గోపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ సిబ్బంది గ్రామాలపై నిరంతరం నిఘా ఉంచారని తెలిపారు.

News June 3, 2024

ఘోరం.. మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని చంపేశాడు

image

గంగవరం మండలం నూగుమామిడిలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లి తలను గోడకు కొట్టడంతో ఆమె మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆదమ్మ(51) అకౌంట్‌లో డబ్బులు ఉండగా, అవి విత్‌డ్రా చేసి ఇవ్వాలని కొడుకు కృష్ణ ఆమెతో గొడకు దిగాడు. తల్లి ఒప్పుకోకపోవడంతో ఆమె బలంగా గోడకు నెట్టేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. తాగుడుకు బానిసై తరచూ తల్లితో గొడవ పడుతూ ఉండేవాడని తెలిపారు.