India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బుక్కరాయసముద్రం (మం) భద్రంపల్లిలో ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి పాల్గొన్నారు. స్మశాన వాటిక లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఏళ్ల నుంచి స్మశాన వాటిక సమస్య పరిష్కారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదని గ్రామస్థులు వాపోయారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భద్రంపల్లి ప్రజలకు స్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ శ్రీనివాస్ చక్రవర్తి అన్నారు. రేగిడి ఆమదాలవలస మండల పరిధిలో సోమరాజుపేట గ్రామంలో ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలకు ఎన్నికల నిబంధనలు, ప్రవర్తన నియమావళి, సి-విజిల్ యాప్, బైండోవర్ షరతుల గురించి వివరించారు. ఎన్నికల సమయంలో తగాదాలు పడవద్దని, పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్‌జీఎస్‌పీ తదితర మార్గాల ద్వారా 1,156 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు గురువారం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వీటిలో 1,142 ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ పూర్తయిందన్నారు. ఓటరు హెల్ప్‌లైన్ ద్వారా 186 ఫిర్యాదులు రాగా 184 ఫిర్యాదుల పరిష్కారం పూర్తయిందన్నారు. కాల్ సెంటర్ ద్వారా 22 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు.
విశాఖపట్నం- బెనారస్ రైళ్ల మార్గం మళ్లింపు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
ఈ నెల 21న విశాఖపట్నం నుంచి బయలుదేరే (18311) విశాఖపట్నం-బెనారస్ ఎక్స్ ప్రెస్, ఈ నెల 22న బెనారస్ నుంచి బయలుదేరే (18312) బెనారస్- విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ రైళ్లు విజయనగరం- ఖుర్దా రోడ్- అంగుల్-సంబల్పూర్ సిటీ-జార్సుగూడ మీదుగా మళ్లించిన మార్గంలో ప్రయాణిస్తాయని తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా ప్రకాశం జిల్లాలో గురువారం మధ్యాహ్నం పర్యటించారు. తొలుత గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ సమీపంలో ఉన్న చెక్ పోస్టును ఆయన తనిఖీ చేశారు. రోజువారి నిర్వహిస్తున్న రిజిస్టర్‌ను పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్, జేసీ గోపాలకృష్ణ పాల్గొన్నారు.
సామాజిక సంస్కరణల రూపకర్త మహాత్మ జ్యోతిరావు ఫూలే అని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, ఇతర అధికారులు పాల్గొని ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు పూలే అని కొనియాడారు.
విజయనగరం కలెక్టరేట్‌లోని ఎన్నికల కంట్రోల్ రూమ్‌ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి గురువారం సందర్శించారు. వివిధ విభాగాల కార్యకలాపాలను పరిశీలించారు. నమోదు చేసిన కేసులను, తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్‌కు సీపీఓ పి.బాలాజీ, నోడల్ అధికారి డాక్టర్ సత్య ప్రసాద్ వివరించారు. జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, డిఆర్ఓ ఎస్‌డి అనిత పాల్గొన్నారు.
వెంకటాచలంలోని సర్వేపల్లి క్రాస్ రోడ్ సమీపంలో జెండా వీధిలో ఉంటున్న ఆర్టీసీ ఉద్యోగి షేక్ నసురుద్దీన్ ఇల్లు గురువారం పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.6 లక్షల నష్టం జరిగిందని బాధితుడు నసురుద్దీన్ వాపోయాడు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఎలక్ట్రికల్ పరికరాలు, బంగారం, నగదు, ఖరీదైన దుస్తులు, వస్తువులు బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో నిర్వహిస్తున్న తనిఖీల్లో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు లభిస్తే సీజ్ చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తంగా రూ.1291.96 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం, ఇతర వస్తువులు సీజ్ చేశామన్నారు.
కడుపు నొప్పితో బాధపడుతూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పుంగనూరు మండలంలో గురువారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. రాంపల్లికి చెందిన కుమార్(33) కడుపు నొప్పితో ఇంట్లో ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.