India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంజనీరింగ్ పనుల నిమిత్తం నేటి నుంచి 30వ తేదీ వరకు విజయవాడ – గుంటూరు 07464, గుంటూరు – విజయవాడ 07465, గుంటూరు – విజయవాడ 07976 రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. హుబ్లీ – విజయవాడ 17329 రైలుని ఈ నెల 29 వరకు, విజయవాడ – హుబ్లీ 17330 రైలును ఈ నెల 30 వరకు విజయవాడ – గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో ఫ్లైయింగ్ స్క్వాడ్, పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. ఈరోజు రాజాం మండలం జెండాల దెబ్బ సమీపంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు చేపట్టిన తనిఖీలలో భారీగా వెండి సామగ్రి పట్టుబడింది. విజయనగరం నుంచి టూ వీలర్ మీద రాజాం వస్తున్న ఒక వ్యక్తి వద్ద సుమారు రూ.5 లక్షల విలువ చేసే 8కిలోల వెండి సామగ్రి లభ్యమైంది. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యాడికి మండలం గుడిపాడులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే వృద్ధురాలు విషపురుగు కుట్టడంతో మృత్యువాత పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. లక్ష్మమ్మ ఇంటి వద్ద అరుగుపై కూర్చొని ఉన్న సమయంలో విషపురుగు కుట్టింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పెదపూడి మండలం గొల్లల మామిడాలో అపర భద్రాద్రిగా ఖ్యాతి గాంచిన కోదండ రామస్వామి వారి ఆలయం ఎంతో ప్రఖ్యాతి గాంచింది. తెలుగు రాష్ట్రాలలోనే అత్యంత ఎత్తైన గాలి గోపురాలు గల రామాలయం ఇది ఒక్కటే. ఈ ఆలయాన్ని 1889వ సంవత్సరంలో నిర్మించారు. మయసభను తలపించేలా ఉండే అద్దాల మండపం
ఈ దేవాలయంలో చెప్పుకోదగ్గ మరో విశేషం.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉదయం వైసీపీలో చేరిన ఎమ్మార్సీ కాలనీకి చెందిన వార్డు మెంబర్ బాలిన శివ గంటల వ్యవధిలోనే తిరిగి టీడీపీలో చేరారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం చింతమనేని మాట్లాడుతూ.. స్వార్థపరులే పార్టీని వీడి పోయారని, అలాంటి వాళ్ల వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు.
ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్‌కు అనుగుణంగా అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఆదేశించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ నోడల్ అధికారులతో కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని, ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టాలన్నారు.
ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పార్వతీపురం మండలం హెచ్ కారడవలస గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పార్వతీపురం రూరల్ ఎస్సై దినకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్ల బురిడీ గ్రామం నుంచి నిడగల్లు గ్రామానికి వెళుతున్న ఆటో కారాడవలస సమీపంలో బోల్తా పడిందన్నారు. ఈ ఘటనలో పైలా సింహాచలం (67) మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించామన్నారు.
చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల సాయంత్రానికే మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో ఒకరోజులో ఎంత మొత్తం మద్యం విక్రయించారో .. ప్రస్తుతం కూడా రోజుకు అంతే విక్రయించాలని అధికారులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఉదయం 11 గంటలకు తెరుచుకుంటున్న షాపుల్లో సాయంత్రానికే టార్గెట్ పూర్తి కావడంతో మూతపడుతున్నాయి. కుప్పం మందుబాబులు కర్ణాటక దుకాణాలకు వెళ్తున్నారు. మీ ఏరియాలో పరిస్థితి ఏంటి?
మాజీ ఎమ్మెల్యే రమేశ్ రెడ్డి తొలిసారి 1999లో లక్కిరెడ్డిపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి గడికోట మోహన్ రెడ్డిపై 10,145 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2004లో మోహన్ రెడ్డి చేతిలో 13,052 ఓట్లతో ఓడిపోయారు. 2014, 19లో రాయచోటిలో పరాజయం పాలయ్యారు. 2019లో 66,128 ఓట్లు, 2014లో 62,109 ఓట్లు సాధించిన ఆయన టీడీపీకి రాజీనామా చేయడం తాజా ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి మరి.
ఈనెల 16న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రచార యాత్రను ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించనున్నారు. నంద్యాల జిల్లాలోని బ్రాహ్మణ కొట్టుకూరు నుంచి కోడుమూరు నియోజకవర్గంలోని గార్గేయపురంలోకి ప్రచార యాత్ర ప్రవేశిస్తుంది. అదే రోజు కర్నూలులో రోడ్ షో నిర్వహించిన అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారు. 17న పాణ్యం, డోన్ నియోజకవర్గాల్లో పర్యటించి, సాయంత్రం 6 గంటలకు కోడుమూరులో రోడ్ షో, బహిరంగ సభను నిర్వహిస్తారు.
Sorry, no posts matched your criteria.