Andhra Pradesh

News March 17, 2024

గుంటూరు: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 పరీక్షలు

image

గుంటూరులో ఆదివారం నిర్వహించిన గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో ఉదయం జరిగిన గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షలకు మొత్తం 8,785 మంది హాజరయ్యారు. 6,254 మంది గైర్హజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 8,714 మంది హాజరయ్యారు. 6,325 మంది గైర్హజరయ్యారు. ఈ పరీక్షలను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి
పరిశీలించారు. 

News March 17, 2024

అనుమతులు తప్పనిసరి: భార్గవ తేజ

image

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూలు రావడంతో ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమావళిని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. కాన్వాసింగ్, లౌడ్ స్పీకర్స్, ఊరేగింపులు, మీటింగులు, బ్యానర్లు, పోస్టర్లు, హోల్డింగుల కోసం అనుమతులకు ఆన్‌లైన్‌లో (https://suvidha.eci.gov.in) ఎలా అప్లై చేసుకోవాలో డెమో నిర్వహించి అవగాహన కల్పించారు.

News March 17, 2024

ఉమ్మడి ప.గోలో  ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపు

image

సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి ప.గో వ్యాప్తంగా ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు, కార్యాలయాలపై ఉన్న బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఆదివారం మొగల్తూరు పంచాయతీ సిబ్బంది అధికారుల పర్యవేక్షణలో సచివాలయాల భవానాలు, బహిరంగ ప్రదేశాలలోని బ్యానర్లు, ఫ్లెక్సీలు, పార్టీల జెండాలు తొలగించారు. విగ్రహాలకు ముసుగులు వేశారు.

News March 17, 2024

కృష్ణా: ఎం ఫార్మసీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని ఎం-ఫార్మసీ కోర్స్ 1వ సెమిస్టర్ 2023-24 విద్యా సంవత్సరం థియరీ పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.ఇన్/ చెక్ చేసుకోవాలని వర్శిటీ పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. 

News March 17, 2024

గుంటూరులో కలెక్టర్ స్పందన కార్యక్రమం రద్దు

image

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా గుంటూరు జిల్లాలో ఎలక్షన్ కోడ్ ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి స్పందనలో ఫిర్యాదులు అందించేందుకు సోమవారం కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.

News March 17, 2024

500 కుటుంబాల అభివృద్ధికి రూ.3కోట్లు: ఎంపీ బాలశౌరి

image

ట్రైబల్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ కింద నాగాయలంక, కోడూరు మండలాల్లోని 500 కుటుంబాలకు లబ్ధి చేకూరేలా నాబార్డ్ ఛైర్మన్‌తో మాట్లాడి రూ.3 కోట్లు మంజూరు చేయించినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. ఈ మేరకు ఆదివారం గుంటూరులోని కార్యాలయం నుంచి ప్రకటనలో పేర్కొన్నారు. ఆ నిధులతో ఆ కుటుంబాలకు బోట్లు, చేపలు పట్టే వలలు, మహిళలకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా చేపల ఫీడ్ తయారు చేసే మిషన్లు ఇతర పరికరాలు కొనుగోలు చేసి ఇస్తామని చెప్పారు.

News March 17, 2024

కడప: GATE ఫలితాలలో రాణించిన IIIT విద్యార్థిని నవ్య

image

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE)-2024 ఫలితాలలో మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆర్కేవ్యాలీ IIIT పూర్వ విద్యార్థిని ( R17 బ్యాచ్) ఎస్. నవ్య ఉత్తమ ప్రతిభతో సత్తా చాటింది. 39.67 మార్కులతో రాణించి ఆల్ ఇండియా 538వ ర్యాంకు (AIR-538) కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఎంఎంఈ హెచ్ఓడీ జిలాని, అధ్యాపకులు రమేశ్, అంజిబాబు, విజయ్, అనూష, వెంకీ తదితరులు అభినందించారు.

News March 17, 2024

రావులపాలెంలో జగన్ బహిరంగ సభ వాయిదా!

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఈనెల 19న జరగాల్సిన ముఖ్యమంత్రి జగన్ భారీ బహిరంగ సభ వాయిదా పడింది. ఈ మేరకు కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. పోలింగ్ తేదీకి ఎక్కువ రోజులు సమయం ఉండడంతో వాయిదా వేసినట్లు నాయకులు తెలిపారు. తిరిగి సభ ఎప్పుడనేది త్వరలో తెలియజేస్తామని అన్నారు. ప్రజలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గమనించాలని కోరారు.

News March 17, 2024

గుర్ల: గుర్తు తెలియని మృతదేహం కలకలం

image

మండలంలోని జమ్ము గ్రామంలో రైలు పట్టాలపై గుర్తుతెలియని మృత దేహం లభ్యమయిందని రైల్వే హెచ్సీ చక్రధర్ ఆదివారం తెలిపారు. మృతుడి వయసు 50ఏళ్లు ఉంటుందన్నారు. జేబులో హౌరా నుంచి విజయవాడకు వెళ్తున్నట్లు టికెట్ ఉందన్నారు. బహుశా ట్రైన్ నుంచి జారి పడి 3రోజుల కిందట మరణించి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీపురుపల్లి పీహెచ్సీకి తరలించామని తెలియజేశారు.

News March 17, 2024

పల్నాడు: ఎన్నికల కోడ్ అమలుపై ఆదేశాలు 

image

ఎన్నికల సంసిద్ధత, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి శివ శంకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోసం అన్ని విధాలా సంసిద్ధత ఎంతో కీలకమైనదన్నారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై అందరు ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

error: Content is protected !!