Andhra Pradesh

News April 11, 2024

టీడీపీలో చేరిన మేకపాటి మేనల్లుడు

image

మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మేనల్లుడు బిజవేముల సురేంద్ర నాధ్ రెడ్డి గురువారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరులోని ఆనం నివాసంలో ఆత్మకూరు టీడీపీ MLA అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఆయనతో పాటు మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు.

News April 11, 2024

తిరుపతి: సీజ్ చేసిన నగదు విడుదల

image

జిల్లా గ్రీవెన్స్ త్రిసభ్య కమిటీ ద్వారా సామాన్య ప్రజల నుంచి సీజ్ చేసిన రూ.26.07 లక్షలను విడుదల చేసినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రింట్ మీడియా నుంచి 223 ఫిర్యాదులు రాగా 213 పరిష్కరించామన్నారు. కంప్లైంట్ మానిటరింగ్ యాప్ ద్వారా 47 ఫిర్యాదులు రాగా అందులో 44 పరిష్కరించినట్లు పేర్కొన్నారు.

News April 11, 2024

విశాఖ సూసైడ్ చేసుకున్న కానిస్టేబుల్‌ వివరాలు గుర్తింపు

image

విశాఖ ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో SPF కానిస్టేబుల్ శంకర్రావు గురువారం ఉదయం సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఐఓబీలో గన్‌మెన్‌గా పని చేసే ఇతని స్వగ్రామం రాజాం నియోజకవర్గంలోని వంగర మండలం కొట్టిస. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఉ. 5 గంటలకు డ్యూటీ‌కి హాజరైన శంకర్రావు తన వద్ద ఉన్న SLRతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 11, 2024

విశాఖ: పలు రైళ్లు రద్దు

image

ప్రీ-నాన్ -ఇంటర్లాకింగ్, నాన్ -ఇంటర్లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తునట్లు రైల్వే శాఖ అధికారి ఏ.కె. త్రిపాఠి తెలిపారు. 08527 విశాఖ- రాయ్ పూర్, 08528 రాయ్‌పూర్ -విశాఖ, 08504 విశాఖ-భవానీపట్నం ప్యాసింజర్, 18301 సంబల్పూర్ – రాయగడ, 18302 రాయగడ -సంబల్పూర్ ఇంటర్ సిటీని ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు… 08503 భవానీపట్న-విశాఖ ప్యాసింజర్ ఈనెల 16 నుంచి 25వ వరకు రద్దు చేసినట్లు తెలిపారు.

News April 11, 2024

సోమల: భర్తను ప్రియుడితో కలసి హత్య చేసిన నిందితురాలి అరెస్టు

image

భర్తను హత్య చేసి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా పరారీలో ఉన్న భార్యను అరెస్ట్ చేసి చిత్తూరు ఏడీజే కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు SI వెంకట నరసింహులు తెలిపారు. 2018లో సోమల(M), ఆవులపల్లెకు చెందిన గోవిందప్ప(35)ను భార్య కుమారి, ప్రియుడు వెంకటరమణతో కలిసి రోకలి బండతో కొట్టి హతమార్చింది. కుమారి రిమాండుకు వెళ్లివచ్చిన తర్వాత కోర్టు వాయిదాలకు హాజరుకాలేదు.

News April 11, 2024

గోదావరిలో దూకి ఫ్యామిలీ గల్లంతు?

image

ప.గో జిల్లాలో చించినాడ వశిష్ఠ గోదావరి వంతెనపై నుంచి కుటుంబం బుధవారం దూకి గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భీమవరానికి చెందిన కిషోర్ కుమార్,భార్య యోచన, కుమార్తె శ్రీనిధి అమలాపురంలో నివాసముంటున్నారు. అయితే వీరు ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆ నిర్ణయం తీసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బ్యాగు, ఫోను, చించినాడ గోదావరి వంతెనపై ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 11, 2024

అనంత: తెగిపడిన హైటెన్షన్ వైరు.. తప్పిన పెను ప్రమాదం

image

గుంతకల్లులోని కసాపురం రోడ్డులోని అయ్యప్ప దేవాలయం వద్ద బుధవారం హైఓల్టేజ్ విద్యుత్ స్తంభం నుంచి హైటెన్షన్ వైరు తెగిపడటంతో స్థానికులు భయాందోళన చెందారు. అయితే శాటిలైట్ అనుసంధానంగా ఆ లైన్ బ్రేక్ డౌన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్పందించిన ట్రాన్స్ కో ఉన్నతాధికారులు సిబ్బందిని పురమాయించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

News April 11, 2024

ఒంగోలు: 30 మంది TDP నేతలపై కేసు నమోదు 

image

ఒంగోలులో బుధవారం రాత్రి జరిగిన ఘటనలో సమతానగర్ పరిధిలోని వాలంటీర్ సుజన ప్రియా ఫిర్యాదు మేరకు 30 మంది TDP నేతలపై గురువారం పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వాలంటీర్‌తో కలిసి YCP నేతలు ప్రచారం చేస్తున్నారని కొందరు ఫొటో తీశారు. దీనిపై రగడ జరగడం, ఆ వార్డు టీడీపీ బాధ్యుడు మోహన్ రావు అక్కడికి వెళ్లడంతో గొడవ పెద్దదైంది. అనంతరం రిమ్స్‌లో ఇరు వర్గాల కవ్వింపు చర్యల నేపథ్యంలో TDP నేతలపై కేసు నమోదైంది.

News April 11, 2024

ఇనుప రథం ప్రభ లాగడమే ప్రమాదానికి కారణమా?

image

కల్లూరు మండలం చిన్నటేకూరులో ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ప్రభ లాగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రతి ఏడాది చెక్క రథంతో చేసి ప్రభ లాగేవారు. ఈ ఏడాది మాత్రం ఇందుకు భిన్నంగా ఇనుప రథంతో చేసిన ప్రభ లాగడంతో హైటెన్షన్ వైర్లు తగలి రథంపై ఉన్న సుమారు 17 మంది చిన్నారులు విద్యుత్ షాక్‌కు గురయ్యారు.

News April 11, 2024

విజయనగరం: పలు ట్రైన్లు రద్దు

image

ప్రీ-నాన్ -ఇంటర్లాకింగ్, నాన్ -ఇంటర్లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తునట్లు స్టేషన్ సూపరిండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. 08527 విశాఖ- రాయ్‌పూర్, 08528 రాయ్‌పూర్ -విశాఖ, 08504 విశాఖ-భవానీపట్నం ప్యాసింజర్, 18301 సంబల్పూర్ – రాయగడ, 18302 రాయగడ -సంబల్పూర్ ఇంటర్ సిటీని ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు.. 08503 భవానీపట్న-విశాఖ ప్యాసింజర్ ఈనెల 16 నుంచి 25వ వరకు రద్దు చేసినట్ల వెల్లడించారు.