India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కలసపాడులో ఆదివారం టైలర్స్ కాలనీలో మిద్దెపైన కరెంటు వైర్ తగిలి మస్తాన్ (9) మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. బద్వేలు మండలం తొట్టిగారిపల్లెకు చెందిన సిద్దయ్య పెద్ద కుమారుడు మస్తాన్. వేసవి సెలవులకు తన తాత దగ్గరికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఇంటిపైన ఉన్న కరెంట్ తీగలను తగిలాయి. కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే చనిపోయాడు. మరణ వార్త విని తల్లిదండ్రులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.

అనంతపురం నగరం 16 చదరపు కిలో మీటర్లు ఉండగా 8 గ్రిడ్లుగా విభజించామని జిల్లా ఎస్పీ గౌతమి శాలి పేర్కొన్నారు. ఒక్కో గ్రిడ్‌కు ఒక ఇన్‌ఛార్జ్ అధికారిని నియమించి మొబైల్, స్టాటిక్ పికెట్లు పరిశీలించేలా చర్యలు తీసుకున్నామన్నారు. 1వ గ్రిడ్‌లో ఉన్న జేఎన్టీయూ (కౌంటింగ్ కేంద్రం) చుట్టూ సీఏపీఎఫ్, ఏపీఎస్పీ, సివిల్ పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు.

వజ్రపుకొత్తూరు మండలం అక్కపల్లి శివసాగర్ తీరంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం మిరాజ్ సినిమా చిత్రీకరణ ప్రారంభోత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు. కేఎంసీ ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత కే.సత్యభాస్కర్ నిర్మిస్తున్న ఆ చిత్రానికి విష్ణుదేవ్ దర్శకత్వం వహించనున్నారు. వారు మాట్లాడుతూ.. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న శివసాగర్ తీరంలో మొదటి సినిమా చిత్రీకరణ చేయడం ఆనందంగా ఉందన్నారు.

నెల్లూరు జిల్లాలోని పలు సీట్లపై ఆరా సర్వే యజమాని మస్తాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బరిలో దిగడంతో అక్కడ టఫ్ ఫైట్ నెలకొంది. కావలిలో ఎవరు గెలుస్తారనేది పసుపులేటి సుధాకర్‌పై ఆధారపడింది. ఆయన చీల్చే ఓట్లతో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఉదయగిరిలోనూ టఫ్ ఫైట్ ఉంది’ అని ఆయన చెప్పారు. మరి ఆరా సర్వేపై మీ కామెంట్.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 MP సీట్లు ఉన్నాయి. రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి(BJP), వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేశారు. చిత్తూరులో దగ్గుమళ్ల ప్రసాదరావు(TDP), రెడ్డప్ప(YCP) హోరాహోరీగా తలపడ్డారు. తిరుపతిలోనూ గురుమూర్తి(YCP), వరప్రసాద్(BJP) నువ్వానేనా అంటూ ప్రచారం చేశారు. రాజంపేట, తిరుపతిలో YCP కచ్చితంగా గెలుస్తుందని ఆరా సర్వే చెబుతోంది. చిత్తూరుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంది. జూన్ 4న ఫలితాలు వెడుననున్న నేపథ్యంలో విజయనగరం జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. సోమవారం డ్రైడేగా ప్రకటించామని.. మద్యం తాగినా, విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల పరిధిలో 53 మద్యం దుకాణాలు, 8 బార్లు మూసివేస్తున్నట్లు తెలిపారు.

పెండ్లిమర్రి మండలంలో ASIగా పనిచేస్తున్న పుల్లయ్య కుమారుడు సాయి కృష్ణ ఆదివారం కడప ప్రకాష్ నగర్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు చిన్నచౌక్ ఎస్ఐ రఫీ తెలిపారు. సాయి కృష్ణ ప్రైవేట్‌గా చదువుకుంటూ ఇంటి వద్ద ఉంటున్నాడు. పుల్లయ్య అనారోగ్యం వల్ల రెండు రోజుల క్రితం కేరళ వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఇంట్లో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కుప్పంలో చంద్రబాబు విజయం ఖాయమని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇదే విషయాన్ని స్థానిక టీడీపీ నాయకులు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. తమ లక్ష్యమంతా లక్ష మెజార్టీనే అని అంటున్నారు. మరికొన్ని గంటల్లోనే కుప్పం ఫలితం వెలువడనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు విజయం సాధిస్తే ఎంత మెజార్టీ వస్తుందని మీరు భావిస్తున్నారు.

ఏయూలో రేపు ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి మద్దిలపాలెం ఇంజినీరింగ్ ఆర్చ్ గేటు నుంచి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే రహదారిలో సాధారణ వాహనాలకు అనుమతులు ఉండవని ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. 215 మంది ట్రాఫిక్ పోలీసులతో వాహనాల రాకపోకలను నియంత్రిస్తామన్నారు. కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బార్లు, మద్యం దుకాణాలు ఆదివారం కిటకిటలాడాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో 175 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 49 బారులు ఉన్నాయి. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 3, 4వ తేదీల్లో విక్రయాలు ఆపేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆదివారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో రూ.5కోట్లకుపైగా అమ్మకాలు జరిగి ఉంటాయని అంచనా. కలెక్టర్ ఆదేశాలమేరకు ఆదివారం రాత్రి మద్యం దుకాణాలు బంద్ చేశారు.
Sorry, no posts matched your criteria.