Andhra Pradesh

News June 3, 2024

మరికొన్ని గంటల్లో ఫలితాలు.. శ్రీకాకుళంలో పట్టాభిషేకం ఎవరికో?

image

ఎన్నికల అంకం తుది దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ నేతల భవితవ్యం తేలనుంది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌‌తో నేతలతో పాటు బెట్టింగ్ రాయుళ్లలోను తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కౌంటింగ్‌కు చిలకపాలెం సమీపంలోని శివాని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ మనజీర్ జీలానీ సామూన్ తెలిపారు. మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News June 3, 2024

కడప: ఇద్దరి మద్య గొడవ.. పక్కనున్న మహిళకు గాయాలు

image

నందలూరు మండల పరిధిలోని చింతలకుంటలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. వారిని విడిపించడానికి ప్రయత్నించిన ఓ మహిళకు ప్రమాదవశాత్తు రాయి తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలింది. హుటాహుటిన ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 3, 2024

పవన్ కళ్యాణ్‌కు 60 వేల మెజారిటీ: వర్మ

image

జూన్ 4వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో జనసేన అధినేత, పిఠాపురం  కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్‌కు 60 వేల మెజారిటీ ఖాయమని మాజీ MLA ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఆదివారం పిఠాపురం మండలం కోలంకలో పర్యటించిన ఆయన గాజుగ్లాసులో టీ తాగి అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేలన్నీ కూటమిదే విజయమని చెప్పాయన్నారు. అలాగే, పవన్ గెలుపు కూడా ఖాయమని చెప్పినట్లు గుర్తుచేశారు.

News June 3, 2024

నెల్లూరు జైలులో ఏడుస్తూనే ఉన్నా: సతీశ్

image

సీఎం జగన్‌పై రాయి విసిరిన దానికి తనకు సంబంధం లేదని నిందితుడు సతీశ్ స్పష్టం చేశాడు. ‘అసలు నిందితులు ఎవరో పట్టుకోకుండా నన్ను ఇరికించారు. దాడి నేను చేయలేదని ప్రతి అధికారికి చెప్పినా పట్టించుకోలేదు. 45 రోజులు నెల్లూరు జైలులో నరకయాతన అనుభవించా. అమ్మానాన్న గుర్తు వచ్చి ప్రతిక్షణం ఏడ్చాను. ఇప్పటికైనా నాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా’ అని బెయిల్‌పై విడుదలైన తర్వాత సతీశ్ అన్నాడు.

News June 3, 2024

31 మంది టీడీపీ నాయకులకు బెయిల్‌

image

తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, స్విమ్స్ ఆసుపత్రి వద్ద జరిగిన గొడవలకు సంబంధించి 37 మంది టీడీపీ నాయకులుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో 31 మందికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన ఆరుగురికి బెయిల్‌కు రాలేదు. 14న గొడవ జరిగితే 26న వైసీపీ నాయకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం తెలిసిందే.

News June 3, 2024

నెల్లూరులో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

image

నెల్లూరు నగరంలోని ప్రియదర్శిని కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం కౌంటింగ్ ఏర్పాట్లను, స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ హాల్స్, మీడియా సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రణాళికాబద్ధంగా జరపటానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు.

News June 3, 2024

తూర్పు గోదావరి జట్టుపై విశాఖ విజయం

image

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్కలి సమీపంలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ పోటీల్లో ఆదివారం విశాఖపట్నం-తూర్పుగోదావరి జిల్లా జట్లు మధ్య మ్యాచ్ జరగగా విశాఖ జట్టు 97 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేశారు. తదుపరి బ్యాటింగ్ చేసిన తూ.గో జట్టు 45.5 ఓవర్లకు 182 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో విశాఖ జట్టు విజయం సాధించింది.

News June 3, 2024

పండుగప్ప చేపలకు ధరలేక రైతన్నల దిగాలు

image

పశ్చిమ గోదావరి జిల్లాలో పండుగప్ప చేపలకు ధర లేక రైతన్నలు దిగులు చెందుతున్నారు. 4 నెలల క్రితం పండుగప్ప కేజీ 580 రూపాయలు ఉండగా.. ప్రస్తుతం కేజీ రూ.380కి పడిపోవడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. చేపల చెరువుల రైతులు అధికంగా పండుగప్ప జాతి చేపలను పెంచేందుకు ఆసక్తి చూపుతారు. దళారుల నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.

News June 3, 2024

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కర్నూలు కలెక్టర్

image

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను కలెక్టర్ డా.సృజన తనిఖీ చేశారు. నాల్గో తేదీ జరిగే ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.

News June 3, 2024

శాంతిభద్రతల విషయంలో రాజీ వద్దు: అనంత ఎస్పీ

image

కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో బందోబస్తు విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని అనంత ఎస్పీ గౌతమిశాలి అధికారులను హెచ్చరించారు. ఈ మేరకు ఆమె సిబ్బందితో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చట్టాన్ని ఎవరు అతిక్రమించకుండా చూడాలన్నారు. సిబ్బంది తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.