Andhra Pradesh

News April 11, 2024

అనంత జిల్లాలో 9 మంది సస్పెండ్

image

అనంతపురం జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన సిబ్బందిపై అధికారులు వేటు వేశారు. నార్పల మండల కేంద్రంలోని 1, 2 సచివాలయాల్లో ఏడుగురు వాలంటీర్లను, సిద్ధరాచెర్ల గ్రామ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు, రాప్తాడు మండలం బొమ్మేపర్తి ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి తప్పక పాటించాలన్నారు.

News April 11, 2024

విశాఖలో ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాలు విస్తరణ

image

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాలను విశాఖలో విస్తరించనుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో విశాఖలో గ్రోసరీ ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 77 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న జీ.ఎఫ్.సీ ద్వారా స్థానికులు వెయ్యి మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ తెలిపింది.

News April 11, 2024

విజయనగరం: వడదెబ్బతో వృద్ధుడు మృతి..?

image

దత్తిరాజేరు మండలం మరడాం గ్రామ సమీపంలోని మామాడి తోటలో బుధవారం మధ్యాహ్నం ఓ వృద్ధులు మృతి చెందాడు. వంగర గ్రామానికి చెందిన చుక్క రామన్న గత కొంతకాలంగా మతిస్తిమితం లేకుండా తిరుగుతున్నాడని స్టేషన్ బూర్జివలస ఎస్.ఐ లక్ష్మీప్రసన్న కుమార్ తెలిపారు. వడదెబ్బకు మృతి చెంది ఉండొచ్చని, మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం తరలించినట్లు వెల్లడించారు.

News April 11, 2024

విశాఖ: ‘ప్రస్తుతానికి వంతెనపై అనుమతి లేదు’

image

విశాఖ రైల్వే స్టేషన్ లో 3,4 ప్లాట్ ఫామ్స్ మధ్య కుంగిన ఫూట్ ఓవర్ వంతెన నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. యుద్దప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 3, 4ప్లాట్ ఫామ్స్ ను ట్రైన్స్ రాకపోకలకు సిద్ధం చేసినట్లు తెలిపారు. పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగా ప్రస్తుతానికి ప్రయాణికులను ఈ వంతెనపై ప్రయాణికులను అనుమతించడం లేదని తెలిపారు.

News April 11, 2024

జగ్గంపేటలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

జగ్గంపేట మండలంలోని రామవరం గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హైవే పోలీసులు
వివరాల ప్రకారం.. రామవరం గ్రామానికి చెందిన ఎద్దుమాటి దేవి తన భర్త వీరబాబు(32)తో కల్లు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపారం ముగించుకొని గ్రామంలో హైవే దాటుతుండగా గుర్తు తెలియని బైక్ ఢీ కొనడంతో మృతి చెందినట్లు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News April 11, 2024

నెల్లూరు: ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్య చేసిన తల్లి

image

ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్య చేసిన ఘటన మంగళవారం రాత్రి బెంగళూరు జాలహళ్లిలో పరిధిలో జరిగింది. నెల్లూరుజిల్లా ఉదయగిరి ప్రాంతానికి చెందిన గంగాదేవి తన ఇద్దరు పిల్లలు లక్ష్మీ (9), గౌతమ్(7)తో కలిసి బెంగళూరులో ఉంటోంది. నిద్ర పోతున్న బిడ్డల ముఖాలపై దిండు వేసి అదిమిపెట్టి హత్య చేసింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి.. తప్పు ఒప్పుకుంది. ఈ మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 11, 2024

కర్నూలు: రేపు ఇంటర్ ఫలితాల విడుదల

image

ఇంటర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గత నెల 1 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలోని 69 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొదటి సంవత్సరం 22,239, ద్వితీయ సంవత్సరం 25,173 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత నెల18న ప్రారంభమైన మూల్యాంకనం అదేనెల 31వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈనెల 4వ తేదీతో ఈ కార్యక్రమం ముగిసింది.

News April 11, 2024

అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన ఫిక్స్

image

అనకాపల్లి జిల్లాలో చంద్రబాబు పర్యటన ఖరారైనట్లు జిల్లా టీడీపీ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీష్ తెలిపారు. ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటలకు పాయకరావుపేటలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని వెల్లడించారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు చోడవరంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

News April 11, 2024

అనంత: వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి

image

రాయదుర్గం మండలంలోని కొంతనపల్లికి చెందిన గొర్రెల కాపరి బోయ వన్నూరప్ప(65) వడదెబ్బతో మృతి చెందాడు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్నూరప్ప ఎప్పటిలాగే మంగళవారం కూడా తనకున్న సుమారు 50 గొర్రెలను మేపుకోసం కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. మంగళవారం సాయంత్రం వడదెబ్బతో అస్వస్థతకు గురికాగా అక్కడి నుంచే నేరుగా గుండ్లపల్లికి తీసుకెళ్లి చికిత్స అందించారు. రాత్రి పరిస్థితి విషమించి మృతిచెందాడు.

News April 11, 2024

విశాఖ: రైళ్లను రద్దు చేసిన అధికారులు

image

దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్లో ఈనెల 11 నుంచి 28 వరకు రోలింగ్ స్టాక్ కారిడార్ కార్యక్రమం కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 11 నుంచి 28 వరకు రాజమండ్రి నుంచి బయలుదేరే రాజమండ్రి-విశాఖ పాసింజర్ ట్రైన్ ను రద్దు చేసినట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో 11 నుంచి 28 వరకు విశాఖ నుంచి రాజమండ్రి బయలుదేరి పాసింజర్ రైలును రద్దు చేసినట్లు పేర్కొన్నారు.