India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైఎస్ షర్మిల ముఖ్య అనుచరుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకుడు కొండా రాఘవరెడ్డి నేడు కడపకు రానున్నారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి షర్మిల చేసిన అన్యాయంపై కడపలో ఆయన కీలక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ పేరిట వైఎస్ షర్మిల చేసిన మోసం అక్రమాలపై ఈరోజు నుంచి ఆయన రాష్ట్రంలో పర్యటించి ప్రజలకు తెలుపనున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు.
SV యూనివర్సిటీలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. కొన్ని రోజుల క్రితం వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందినట్టు సమాచారం. దీంతో చర్యల కోసం ఎన్నికల కమిషన్ యూనివర్సిటీ అధికారులను ఆదేశించిన క్రమంలో అయ్యప్ప (డ్రైవర్), డాక్టర్ ఐఎస్ కిషోర్ మాథ్యూ అర్నాల్డ్ (అకడమిక్ కన్సల్టెంట్),మురళిరెడ్డి (రిజిస్ట్రార్ పీఎస్) లను సస్పెండ్ చేసినట్టు సమాచారం.
ఎస్పీ సుమిత్ సునీల్ కార్యాలయం ఎదుట ఒంగోలు TDP అభ్యర్థి దామచర్ల జనార్దన్ బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. నగర పరిధిలోని సమతానగర్‌లో వాలంటీర్‌తో కలిసి YCP నేతలు ప్రచారం చేస్తుండడంతో కొందరు ఫొటో తీశారు. దీనిపై రగడ జరగడంతో 37వ వార్డు టీడీపీ బాధ్యుడు మోహన్ రావు అక్కడికి వెళ్లడంతో వారంతో దాడిచేశారు. దీంతో అతడికి తీవ్ర రక్త స్రావం అయింది. టీడీపీ అభ్యర్థి జనార్దన్ ఎస్పీ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు.
బాలికను మోసం చేసి శారీరకంగా లోబరుచుకుని యువకునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై దినకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం.. పార్వతీపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన పెంటకోట ప్రవీణ్ కుమార్ మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ తెలిపారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమలో అత్యధికంగా 22 మంది అభ్యర్థులు పోటీ పడగా, మచిలీపట్నంలో అత్యల్పంగా 8 మంది బరిలో నిలిచారు. జిల్లాల విభజన అనంతరం స్థానికంగా రాజకీయ పరిస్థితులు మారినందునా తాజా ఎన్నికల్లో ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యపై ఆసక్తి నెలకొంది. కాగా గత ఎన్నికల్లో పశ్చిమలో 10 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలవడం విశేషం.
రంజాన్ పండుగ సందర్భంగా గురువారం మిర్చియార్డుకు సెలవు ప్రకటించారు. ఎటువంటి క్రయవిక్రయాలు జరగవని, రైతులు దీనిని దృష్టిలో పెట్టుకొని యార్డుకు మిర్చి తీసుకురావద్దని ఇన్‌ఛార్జ్ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం యార్డులో యథావిధిగా మిర్చి విక్రయాలు జరుగుతాయని ఆయన అన్నారు. రైతులు బుధవారం 1,04,430 బస్తాలు యార్డుకు తరలించగా, అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 85,482 బస్తాలు నిల్వ ఉన్నాయి.
కోడూరు నియోజకవర్గంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ ప్రక్రియలను నిర్వహించాలని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కోడూరు మండలం అనంతరాజుపేటలోని ఉద్యానవన యూనివర్సిటీలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూములను ఎస్పీతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతుల ఏర్పాట్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సృజన నోడల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో పోలింగ్ రోజున కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలపై నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బెంగళూరులో కలిశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు తొలిసారిగా చీరాల అసెంబ్లీ టికెట్ ఇచ్చిన విషయాన్ని ఆయన షర్మిలకు గుర్తు చేశారు. తన చేరికకు వీలుగా చీరాల రావలసిందిగా ఆమంచి ఆహ్వానించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.
ఇంటింటి ప్రచారానికి ముందస్తు అనుమతి అవసరం లేదని, స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి ఆయా రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారం నిర్దేశిత వేళల్లో ఎప్పుడైనా చేపట్టవచ్చని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.