India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ సూచించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ప్రారంభమైన శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఆయన పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఎన్నికల నియమాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా గడిచిన 48 గంటల్లో 12 బాల్యవివాహాలను అడ్డుకొనడం జరిగిందని శాఖ మహిళా అధికారులు బుధవారం తెలిపారు. పద్మావతి మాట్లాడుతూ.. ఆడ పిల్లంటే భయం కాదు.. అభయం అని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. ఆడ పిల్లలు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా విద్య నేర్పాలన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా తమకు సమాచారం ఇవ్వాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిని పద్మావతి, సూర్యచక్రవేణి సూచించారు.
ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూ పకడ్బందీగా చేపట్టాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియపై అసెంబ్లీ నియోజకవర్గాల ఏఆర్వోల బృందాలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ ఈనెల 12, 13 తేదీలలో జరుగుతుందన్నారు.
రక్త హీనతపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. 10 ఏళ్ల లోపు పిల్లల్లో మరణాల రేటు నివారణ కార్యక్రమం ( ప్రాజెక్టు ఫర్ రిడక్షన్ ఆఫ్ ఇన్ఫాంట్ మోర్టాలిటి రేట్ బిలో 10)పై వైద్య అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందితో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 10 ఏళ్ల లోపు పిల్లల్లో మరణాల రేటు నివారణకు ముఖ్యంగా రక్త హీనత నివారణపై దృష్టి సారించాలన్నారు.
ప్రయాణీకుల రద్దీ మేరకు రాయనపాడు మీదుగా సికింద్రాబాద్(SC), షాలిమార్(SHM) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం. 07225 SC- SHM ట్రైన్‌ను ఈ నెల 15 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం, నం. 07226 SHM- SC ట్రైన్‌ను ఈ నెల 16 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం నడుపుతామన్నారు. ఈ స్పెషల్ ట్రైన్లు విజయవాడలో ఆగవని, సమీపంలోని రాయనపాడు స్టేషన్‌లో ఆగుతాయని అన్నారు.
ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు కీలక ప్రకటన చేశారు. పోస్టల్ బ్యాలెట్లకు ఈ నెల 22లోపు సంబంధిత శాఖల నుంచి ప్రతిపాదనలు పంపాలని ఆయన సూచించారు. స్పెషల్ ఓటర్లు, సర్వీస్ ఓటర్లు, ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ తదితర 5 కేటగిరీలకు చెందిన వారికి ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించిందని కలెక్టర్ చెప్పారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సున్నితమైన ప్రాంతాలలో ప్రత్యేక బలగాలను మోహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఎన్నికల నేపథ్యంలో తూ.గో జిల్లాలో ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించేందుకు బుధవారం రాత్రి స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రాంమోహన్ మిశ్రా రాజమహేంద్రవరం చేరుకున్నారు. జిల్లాలో పరిశీలన నిమిత్తం విచ్చేసిన స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రాకు పొట్టి లంక చెక్‌పోస్ట్ వద్ద కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే.మాధవీలత, జిల్లా ఎస్పీ పి.జగదీశ్‌లు మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందచేశారు.
రావికంపాడు – అన్నవరం రైల్వే స్టేషన్ల మధ్య సుమారు 55 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని మహిళ బుధవారం రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడింది. తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సుమారు 5అడుగులు ఎత్తు కలిగి పచ్చని చీర కట్టుకుని ఉంది. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రి మార్చురీలో తరలించారు. ఆమె ఆచూకీ తెలిసినవారు తుని రైల్వేపోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఎస్సై లోవరాజుని సంప్రదించాలని కోరారు.
బొబ్బిలి – సీతానగరం రైల్వేస్టేషన్ల మధ్య చిన భోగిలి సమీపంలో, బుధవారం గుర్తు తెలియని మృతదేహాం లభ్యమయ్యిందని బొబ్బిలి జీఆర్పీ హెచ్సీ ఈశ్వరరావు తెలిపారు. ట్రైన్ నుంచి జారిపడి మృతిచెందారా, లేదా పట్టాలు దాటే క్రమంలో ట్రైన్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.