India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బంధంచర్ల అటవీ ప్రాంతంలో వారం రోజులుగా పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బంధంచర్ల – చింతలపూడి సరిహద్దు అడవిలో పులి అడుగు జాడలను శనివారం బీట్ అధికారిణి భవానీ పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఆయా ప్రాంతాల్లో కనిపించిన కాలి ముద్రలను గుర్తించి జిల్లా ఫారెస్ట్ అధికారులకు పంపుతున్నట్లు తెలిపారు.

హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గెలిచే అవకాశం ఉందని పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ, వైసీపీ నుంచి కురబ దీపిక పోటీలో ఉన్నారు. కాగా.. మరో సర్వే చాణక్య X కూడా బాలకృష్ణ గెలుస్తారని పేర్కొంది. ఈ సర్వేలపై మీ COMMENT.

ట్రాఫిక్ నిర్వహణ పనుల నిమిత్తం శనివారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు 2 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం తెలిపారు. రాజమహేంద్రవరం- విజయవాడ (07767), విజయవాడ- రాజమహేంద్రవరం (07459) రైళ్లు ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండవని తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
– SHARE IT

భార్య మరణం తట్టుకోలేక భర్త కూడా మరణించిన ఘటన కావలి పట్టణంలో చోటు చేసుకుంది. కావలి పట్టణం వైకుంఠాపురం అనపగుంత సమీపంలో నివాసం ఉంటున్న గంటా శ్రీనివాసరావు(71) వరలక్ష్మి (65)భార్య భర్తలు. జ్వరంతో బాధపడుతూ వరలక్ష్మి మృతి చెందగా ఆమె మరణ వార్తను తట్టుకోలేక భర్త శ్రీనివాసరావు కూడా మృతిచెందాడు. ఈ దంపతుల మృతదేహాలు పక్కపక్కనబెట్టి ఉండడం చూసి పలువురు కంటతడి పెట్టారు.

మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ వైసీపీ నుంచి వై.బాలనాగిరెడ్డి, టీడీపీ నుంచి రాఘవేంద్ర పోటీ పడ్డారు. మరో సర్వే చాణక్య X కూడా బాలనాగిరెడ్డే గెలుస్తారని పేర్కొంది. ఈయన 2009లో టీడీపీ నుంచి, 2014, 2019లో వైసీపీ నుంచి గెలిచారు. ఈ సర్వేలపై మీ COMMENT.

పామర్రులో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ టీడీపీ నుంచి వర్ల కుమార్ రాజా, వైసీపీ నుంచి కైలే అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. మరోవైపు, చాణక్య X సర్వే ప్రకారమూ వైసీపీ అభ్యర్థే గెలుస్తారని పేర్కొంది. ఈ సర్వేలపై మీ COMMENT.

జూన్ మూడో తేదీన పలాస – విశాఖపట్నం, విశాఖపట్నం- పలాస మధ్య నడిచే పాసింజర్ రైలు, విశాఖపట్టణం- గుణుపూర్, గుణుపూర్- విశాఖపట్నం మధ్య నడిచే పాసింజర్ రైలు, 3 వ తేదీన విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్ప్రెస్ 4వ తేదీన బ్రహ్మపూర్ నుంచి విశాఖకు నడిచే ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లను రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రజలు కూటమికే పట్టం కట్టారని ‘చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్’ అంచనా వేసింది. మొత్తం 16 స్థానాల్లో కూటమి 10 సీట్లు గెలుస్తుందని, 2 చోట్ల ఎడ్జ్(TDP) ఉన్నట్లు పేర్కొంది. ఇదే క్రమంలో వైసీపీ 2 సీట్లు గెలుస్తుందని, ఒక చోట ఎడ్జ్ ఉందని చెప్పింది. విజయవాడ వెస్ట్‌లో రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఉంటుందని వివరించింది. ఈ సర్వేపై మీ COMMENT.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకే మెజారిటీ స్థానాలు వస్తాయని చాణిక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 14 స్థానాల్లో టీడీపీకి 6, వైసీపీకి 4, జనసేనకు ఒక సీటు వస్తుందని, మిగిలిన మూడు చోట్ల బిగ్ ఫైట్ నెలకొందని తెలిపింది. అందులో ఒకచోట వైసీపీకి, మరోచోట టీడీపీ ఎడ్జ్ ఉండగా.. మిగిలిన ఒకస్థానంలో పోటాపోటీ ఉంటుందని వివరించింది. ఈ సర్వేపై మీ కామెంట్ తెలపండి.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మెజారిటీ స్థానాలు కూటమికే దక్కే అవకాశం ఉందని చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 10 స్థానాల్లో కూటమి 3 సీట్లు, వైసీపీ 2 గెలుస్తుందని, కూటమికి మూడు చోట్ల ఎడ్జ్, వైసీపీకి రెండు చోట్ల ఎడ్జ్ ఉన్నట్లు పేర్కొంది. పాలకొండ, రాజాం, శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురంలో రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. ఈ సర్వేపై మీ COMMENT.
Sorry, no posts matched your criteria.