India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

CM చంద్రబాబు ఈ నెల 16న మంగళగిరిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎస్పీవకుల్ జిందాల్ ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా పోలీస్ నియామకం చేపట్టి, ఎంపికైన 6,100 అభ్యర్థులకు మంగళగిరి 6వ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్‌లో నియామక పత్రాలు అందించనున్నారు. సీఎం స్వయంగా పాల్గొని అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు.

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా, నేరుగా అయినా అర్జీలు సమర్పించవచ్చని చెప్పారు. 1100 టోల్ ఫ్రీకి డయల్ చేసి అర్జీల స్థితినితెలుసుకోవచ్చని చెప్పారు. అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొత్తం 431 లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసి 3,04,212 కేసులను పరిష్కరించామని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. ఇందులో 5,985 సివిల్, 2,75,567 క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాగా సివిల్ కేసుల పరిష్కారంలో 23,466 కేసులతో గుంటూరు జిల్లా వరుసగా మూడోసారి ప్రథమ స్థానంలో నిలిచింది.

తమ కుటుంబంలో ఒకరిలా గారాబంగా పెంచుకున్నారు. వారితో పాటే అన్నం పెట్టారు. స్నానం చేయించారు. వారి మధ్యే నిద్ర కూడా పోనిచ్చేవారు. చివరికి తమని వదిలి వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోయారు. ఇంతకీ ఎవరిని అనుకుంటున్నారా! చిత్తూరు పట్టణంలోని గ్రీమ్స్ పేటలో ఓ పెంపుడు కుక్క స్టోరీ ఇది. అది చనిపోవడంతో దానిని మర్చిపోలేక సమాధి కట్టించాడు యజమాని. ఈ వింతను చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు.

కర్నూలు అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూల్లో టీడీపీ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తనకు కర్నూలు అభివృద్ధే తప్ప వేరే ఆలోచన లేదన్నారు. పార్టీ క్యాడర్ ప్రజల్లో ఉంటూ సమస్యలు గుర్తించి పరిష్కరించాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే అభివృద్ధి ఎంతో జరుగుతుందన్నారు.

వందే భారత్ రైలు సేవలు రేపటి నుంచి గుడివాడ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గుడివాడలో కూడా ఆగనుంది. చెన్నై-విజయవాడ వందే భారత్ (20677) రైలును నర్సాపురం వరకు రైల్వే శాఖ పొడిగించింది. అయితే నర్సాపూర్, మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్, బెంగళూరుకు వందే భారత్ రైలు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

తూ.గో జిల్లాలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్, స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తంగా టీములుగా ఏర్పడి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా 68 నంబర్, రికార్డు లేని ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు సీజ్ చేశామని తెలిపారు. 30 మంది పాత నేరస్తుల ఇళ్లను తనిఖీ చేశామన్నారు.

కొత్తవలస (M) తుమ్మకాపల్లి ఫైర్ స్టేషన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్లశంకర్రావు (52) మృతి చెందాడు. వేపాడ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గొల్ల దారప్పడు, గొల్ల శంకర్రావు ద్విచక్ర వాహనంపై పిల్లలతో విశాఖ బీచ్‌కు వెళ్తున్నారు. వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో శంకర్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన దారప్పడును KGHకి తరలించారు. పిల్లలు భవాని, శంకర్ గాయపడ్డారు.

విశాఖ ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో రేపటి (డిసెంబర్ 15) నుంచి 26వ తేదీ వరకు ‘సరస్’ (SARAS) అఖిల భారత డ్వాక్రా బజార్ జరగనుంది. గ్రామీణ మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా 600 మంది మహిళలు.. 250 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఆహార పదార్థాలు ఇక్కడ లభిస్తాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు.

ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు ఉపాధి కోసం అధిక సంఖ్యలో వలస వెళ్తుంటారు. వీరంతా సంక్రాంతికి తమ సొంతూరికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. ఇప్పటికే అన్ని రైళ్ల టికెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్రకు ఒక్క ప్రత్యేక రైలు కూడా ప్రకటించలేదు. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని స్థానిక ప్రజా ప్రతినిధులు రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.